Cow Dung Bricks: మనం అందరం ఉండే ఇల్లు సిమెంట్, ఇటుక, ఇసుకతో నిర్మించారు. వాటిని మళ్ళీ అందంగా కనిపించడానికి టైల్స్ వాడుతాము. టైల్స్ ఎక్కువగా మట్టిలో తయారు చేస్తారు కానీ ఈ మధ్య కాలంలో ప్లాస్టిక్ టైల్స్ కూడా వాడుకలో ఉన్నాయి. ఈ వస్తువులు అని వాడి ఇల్లు కట్టడం వల్ల ఇంటిలో ఉష్ణోగ్రత కూడా పెరిగింది. మన పూర్వం మట్టి ఇంటిలో ఆవు పేడతో అలికితే , ఇల్లు శుభ్రంగా ఉండి, చల్లగా ఉండేది. వేసవికాలంలో కూడా ఆవు పేడతో అలికిన ఇల్లు చల్లగానే ఉండేది.
ఈ ఆలోచనే అనుసరించి ఆవు పేడతో టైల్స్ తయారు చేస్తున్నారు. ఆవు పేడ టైల్స్ మార్కెట్లో మంచి డిమాండ్‌లో ఉన్నాయి. పశువులను పెంచే రైతులకి ఇప్పుడు మంచి వ్యాపారంగా ఉంది. ఆవు పేడ టైల్స్ కారణంగా ఇల్లు కూడా చల్లగా ఉంటుంది. ఈ టైల్స్ వాడటం వల్ల ఇల్లు అందగా కూడా ఉంటుంది.
వు పేడ టైల్స్‌కు డిమాండ్ పెరగడంతో వీటిని తయారు చేసే కంపెనీలు కూడా పెరుగుతున్నాయి. కంపెనీ వాళ్ళు రైతుల నుంచి ఆవు పేడను కొనుగోలు చేస్తున్నారు. కొనుగోలు చేసిన ఆవు పేడని ప్రాసెస్ చేసిన తర్వాత యంత్రం ద్వారా టైల్స్ తయారు చేస్తారు. ఈ టైల్స్ మొత్తం సేంద్రియ పద్దతిలో తయారు చేస్తారు.
సేంద్రీయంగా తయారు చేసిన ఈ టైల్స్ మార్కెట్లో మంచి ధరకి అమ్ముతున్నారు. ఈ టైల్స్‌కి ఉన్న డిమాండ్ చూసి ఛత్తీస్‌గఢ్ మహిళలు ఆవు పేడ టైల్స్ చేతులతో తయారు చేస్తున్నారు. తయారు చేసి వీటిని ఆఫ్‌లైన్, ఆన్లైన్లో కూడా అమ్ముతున్నారు. ఈ మహిళలు ఎటువంటి యంత్రం లేకుండా చేతులతో తయారు చేయడం ద్వారా కూడా మార్కెట్లో మంచి డిమాండ్ కూడా ఉంది.
వేసవి కాలంలో కూడా ఇంటిలో చల్లగా ఉంటుంది. ఇంటిలో ఉష్ణోగ్రత 5-8 శాతం తాగిస్తుంది. ఈ టైల్స్ వాడటం ద్వారా కూడా పరియవారణానికి ఎటువంటి హాని జరగదు. పరియవర్ణం కాపాడుకునే పద్దతి వీటిని కొత్తగా తయారు చేస్తున్నారు. ఆవు పేడ టైల్స్ ఏ ప్రాంతం వాళ్ళు అయిన ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేసుకోవచ్చు.
Also Read: Dry grass Packing Machine: వ్యవసాయంలో కొత్త వ్యాపారం చేస్తూ రెండు నెలలో 30 లక్షలు లాభాలు.!