Farmer Success Story: ఇంతకుముందు రైతులు వ్యవసాయంలో సంప్రదాయ పంటలు మాత్రమే పండించే వాళ్ళు. సంప్రదాయ పంటల నుంచి వచ్చే ఆదాయం ఇంటి ఖర్చులకి కూడా సరిపోయేవి కాదు. ముఖ్యంగా మహారాష్ట్ర రైతులు అక్కడి పంట పొలాలని బట్టి కేవలం సంప్రదాయ పంటలని మాత్రమే పండించే వాళ్ళు. ఈ పంటల వల్ల ఎలాంటి లాభాలు లేవు అని గజానన్ మహోర్ రైతు వాణిజ్య పంటలు పండించడం మొదలు పెట్టారు.
ఇంటిలో వాళ్ళ సలహాతో పువ్వులా తోటను సాగు చేయడం మొదలు పెట్టారు. అతనికి ఉన్న ఒకటిన్నర ఎకరాల్లో గులాబీ, బంతి పువ్వుల సాగు చేశాడు. ఆధునిక పద్ధతిలో గులాబీ, బంతి పువ్వులను సాగు చేస్తున్నాడు. ఈ పూవ్వుల సాగు ద్వారా మంచి లాభాలు వచ్చేవి. అని ఖర్చులు పోయి సంవత్సరానికి లక్ష రూపాయలు లాభం వచ్చేది.
Also Read: Bonsai Tree: బాబోయ్… ఈ చెట్టుకి 9 కోట్ల రూపాయలా.!
ఈ లాభాలతో మరో మూడు ఎకరాల భూమి కొన్నాడు. అందులో కూడా పూవ్వుల తోటలనే సాగు చేశాడు. ఈ పులతోటకి డ్రిప్ సహాయంతో నీటిని అందిస్తున్నాడు. దాని ద్వారా నీటి ఖర్చు కూడా కొంత వరకు తగ్గింది. ఇతను ఉండే దగరలో హింగోలిలో ఎనిమిదవ జ్యోతిర్లింగం క్షేత్రం ఉంది. ఈ క్షేత్రం ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందింది. ఈ దేవాలయానికి గజానన్ మహోర్ సాగు చేసిన పూవ్వులని పూజకి, అలంకారానికి తీసుకుంటారు. దానితో ఈ రైతుకి మంచి గిరాకీ దొరకడంతో మంచి లాభాలు కూడా పొందుతున్నారు.
ఈ రైతు పండించే పూవ్వులకి కూడా డిమాండ్ బాగా పెరిగింది. అతను పండించే భూమి విస్తరణ కూడా పెంచాడు. ఇప్పుడు మొత్తం 6 ఎకరాలో పూవ్వుల తోటని సాగు చేస్తున్నాడు. ఈ తోటలో గులాబీ, లిల్లీ, బంతిపూలతో పాటు ఇంకో 10 రకాల పూవ్వులని సాగు చేస్తున్నాడు.
దానితో ప్రస్తుతం అతని ఆదాయం నెలకి 1.5 లక్షలు పొందుతున్నారు. ఆ ప్రాంతంలో ఉన్న డిమాండ్ బట్టి పూవ్వులని సాగు చేస్తున్నాడు. డ్రిప్ ఇరిగేషన్ ద్వారా మొక్కలకు నీరందించడం వల్ల నీళ్లు కూడా ఆదా అవుతుంది. దానితో పెట్టుబడి ఖర్చు కూడా తగ్గుతుంది. తక్కువ పెట్టుబడితో మంచి లాభాలు సంపాదించడానికి పూవ్వుల తోటని పెంచుకోడం మంచిది.
Also Read: Mango Post Harvest Practices: కోతల తర్వాత మామిడి తోటల్లో యాజమాన్యం.!