రైతులు

Seed Conservation: అంతరించిపోయే పంట విత్తనాలు దాచుకోవడం ఎలా.!

3
Seeds
Seeds
Seed Conservation: రైతులు పండించే పంటలో చాలా పంటలు అంతరించి పోతున్నాయి. ఈ మధ్య కాలంలో రైతులు లాభాల కోసం వాణిజ్య పంటల ఫై ద్రుష్టి పెట్టడంతో మన సాంప్రదాయ పంటలు చాలా అంతరించి పోతున్నాయి. మన పూర్వికులు పండించిన పంటలు వాటి మూలాలు లేక మనం ఆ పంటలని పండించడం లేదు. మనం పండించే పంటలు అంతరించిపోకుండా విత్తనాలు దాచుకొని అవసరం అయినపుడు వాడుకోవడానికి ప్రతి జిల్లలో ఒక సీడ్ బ్యాంకు ఏర్పాటు చేసారు.

ఈ సీడ్ బ్యాంక్లో మనం పండించిన పంట విత్తనాల్ని దాచుకోవచ్చు. మళ్ళి ఈ విత్తనాలు అవసరం ఉన్నపుడు లేదా ఇతర దేశంలో ఆ పంట విత్తనాలు దొరకపోయిన ఈ విత్తనాల్ని వాడుకోవచ్చు. విత్తనాల్ని మనం 150 సంవత్సరాల వరకి దాచుకోవచ్చు. ఇలాగే మన పూర్వికులు దాచి పెట్టిన విత్తనాలు ఇప్పటికి పిరమిడ్ , పురాతన కటాడాలో కొన్ని స్థలంలో కొన్ని పంటల విత్తనాలు లభించాయి.

Also Read:Livestock Management: వర్షాకాలంలో పాడి పశువుల ఆరోగ్య పరిరక్షణలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.!

Seed Conservation

Seed Conservation

ప్రతి జిలాలోని రైతులు పండించిన పంటలో నాణ్యమైన విత్తనాల్ని విత్తన బ్యాంకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అధికారులు వచ్చి విత్తనాన్ని పరిశీలించి బ్యాంక్లో దాచడానికి తీసుకుంటారు. రైతుల దగ్గరి నుంచి విత్తనాల్ని 1:2 రేషియోలో తీసుకుంటారు అధికారులు. 1:2 అంటే 1 శాతం విత్తన బ్యాంకుకి , 2 శాతం రైతుల కుటుంబాలు వాడుకోవడానికి లేదా అమ్ముకోవడానికి.

వర్షాకాలంలో పాండే పంటలో 50 కంటే ఎక్కువ రకాలు సీడ్ బ్యాంక్లో దాచుకోవచ్చు. సీడ్ బ్యాంక్లో విత్తనాల్ని తక్కువ తేమ శాతం ఉంటూ, చల్లని కంటైనర్లో పెడతారు. విత్తనాల్ని -20 డిగ్రీ సెలసిస్లో స్టోర్ చేయాలి. సీడ్ బ్యాంక్లో విత్తనాలు స్టోర్ చేయడం ద్వారా విత్తనాల నాణ్యత కూలిపోకుండా, జన్యుపరంగా ఎలాంటి నాణ్యత కొలిపోకుండా కాపాడుతుంది

దక్కన్ డెవలప్‌మెంట్ సొసైటీ “అత్తగారు మరియు కోడలు” సంఘాన్ని మొదలు పెట్టారు. ఇందులో మహిళలకు వ్యవసాయ వర్క్‌షాప్‌లు, విత్తనాలు దాచుకోవడం ఫై ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇలా విత్తనాలు దాచుకోవడం వల్ల మనం మన వచ్చే తరాలకి మన పంటలని వాళ్ళు పండించవచ్చు.

Also Read: Fisheries in Telangana: తెలంగాణలో చేపలపెంపకానికి అనువైన జాతులు, వాటి యొక్క ప్రాముఖ్యత

Leave Your Comments

Livestock Management: వర్షాకాలంలో పాడి పశువుల ఆరోగ్య పరిరక్షణలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.!

Previous article

Cauliflower Cultivation: రంగు రంగుల కాలీఫ్లవర్ మీరు సాగు చెయ్యాలి అనుకుంటున్నారా.?

Next article

You may also like