Pashu Kisan Credit Card: రైతులకి వ్యవసాయ పంటలోనే కాకుండా పాడి పశువులను పెంచడం ద్వారా ఆదాయం చాలా పెరుగుతుంది. ఈ మధ్య కాలంలో పాడి పశువులని కొన్నాడానికి, వాటి ఆహారానికి చాలా ఖర్చు అవుతుంది. ఈ ఖర్చు భరించలేక చాలా మంది రైతులు పశువులని పెంచడం లేదు. పశుపోషణను ప్రోత్సహించడానికి ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో పథకాలను తీసుకొని వచ్చింది.
రైతులకు పశుపోషణతో ఆర్థికంగా ప్రోత్సహించడానికి ప్రభుత్వం పశు క్రెడిట్ కార్డు ప్రారంభించింది. ఈ పశు క్రెడిట్ కార్డు కూడా కిసాన్ క్రెడిట్ కార్డుల వాడుకోవచ్చు. ఈ పశు క్రెడిట్ కార్డు ద్వారా పాడి పరిశ్రమ, మత్స్య రైతులకి రుణాలు అందిస్తుంది. యానిమల్ క్రెడిట్ కార్డ్‌తో పశుపోషణ , ఆవులు, గేదెలు కొన్నాడానికి, వాటి ఆహారానికి రైతులకి 1. 60 లక్షలు రుణంగా ఇస్తున్నారు.
Also Read: Biodegradable Products: బయో డిగ్రేడబుల్ వస్తువులని మాత్రమే వాడాలి.!

Pashu Kisan Credit Card
ఈ యానిమల్ క్రెడిట్ కార్డ్‌తో పశువులను కొన్నాలి అనుకున్న రైతులు 1. 60 లక్షల వరకు ఎలాంటి హామీ లేకుండా బ్యాంక్‌లో లోన్ తీసుకోవచ్చు. ఈ క్రెడిట్ కార్డు రైతులతో పాటు పశువుల యజమానులు కూడా తీసుకోవచ్చు. ఈ క్రెడిట్ కార్డు పై దాదాపు 3 లక్షల వరకు రుణాలు తీసుకోవచ్చు. కానీ ఎటువంటి హామీ లేకుండా 1. 60 లక్షల వరకి మాత్రమే ఇస్తారు. మూడు లక్షల వరకు లోన్ కావాలి అంటే హామీతో మాత్రమే ఇస్తారు.
దీని ద్వారా 40,783 రూపాయలు ఆవులకి, 60,249 రూపాయలు గేదెకు, 4063 రూపాయలు గొర్రెలకు ఇస్తారు. కోళ్లకి రుణం కోసం PKCC పథకం ప్రభుత్వం మొదలు పెట్టారు. ఈ పథకం ద్వారా ఒక కోడికి 720 రూపాయల రుణం ఇస్తారు. పశు క్రెడిట్ కార్డుతో తీసుకున్న రుణంపై 7 శాతం వడ్డీ మాత్రమే కట్టాలి. రైతులు తీసుకున్న రుణాన్ని సరైన సమయంలో కడితే 3 శాతంకి రుణ వడ్డీ కట్టాల్సి ఉంటుంది. ఈ ప్రభుత్వ పథకాలను వాడుకొని రైతులకి, పశువుల యజమానులకు లాభాలు వచ్చి, పశు సంపదని పెంచాలి అని ప్రభుతం కోరుకుంటుంది.
Also Read: Agricultural Scientist: పీహెచ్డీ పూర్తి చేసుకున్న అగ్రికల్చర్ విద్యార్థులకి శుభవార్త..