రైతులు

Horticulture: మారుమూల ప్రాంత మహిళా రైతులు ఉద్యానపంట ద్వారా లక్షల ఆదాయం

1
Horticulture
Horticulture

Horticulture: జార్ఖండ్‌లోని రాంచీ జిల్లాలోని గోపాల్‌పూర్ గ్రామానికి చెందిన మహిళా రైతులు వ్యవసాయంలో మరియు ఉద్యానవనాల ద్వారా కొత్త విజయగాథను రాస్తున్నారు.కాస్త వెనుకబడిన ప్రాంతం అయిన చోట కూడా హీరామణి తన కష్టార్జితంతో బాగానే సంపాదిస్తోంది. వ్యవసాయం అంటే ఇష్టం ఉన్న హీరామణి.. చదువు పూర్తయ్యాక తనకు ఉపాధి లభించలేదని, ఆ తర్వాత వ్యవసాయంనే ఉపాధిగా ఎంచుకున్నానని చెప్పింది. ఈరోజు ఆమె అభిరుచి మంచి ఆదాయాన్ని ఇస్తోంది. తన సోదరి ఇంట్లో తోటపని చూసిన తర్వాత తన మనసులో వ్యవసాయం చేయాలనే ఆలోచన వచ్చిందని చేపిందామె. అక్కాచెల్లెళ్లు ప్రభుత్వ ప్రయోజనాలు పొందుతున్నప్పటికీ అవి అందకపోవడంతో సొంతంగా పెట్టుబడి పెట్టి వ్యవసాయం చేశారు.

Horticulture

Horticulture

హీరామణి 2016లో వ్యవసాయం చేయడం ప్రారంభించింది.ఆమె భర్త రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి. మొదట గార్డెనింగ్ చేయాలని నిర్ణయించుకుని టేకు మొక్కలు నాటినట్లు చెప్పారు. ఎంఎన్‌ఆర్‌ఈజీఏ పథకం ద్వారా మొక్కలు నాటాలని భావించినా పథకం కింద లబ్ధి పొందలేకపోయారు. ఆ తర్వాత సొంతంగా వ్యవసాయం చేయాలని సంకల్పించి సుమారు 12 లక్షల రూపాయలు వెచ్చించి భూమికి కంచె వేయించారు . ఆ తర్వాత రాంచీలోని గోడన్‌పోఖర్‌లో ఉన్న నర్సరీలో నాలుగు లక్షల రూపాయల విలువైన మొక్కలు కొనుగోలు చేశారు. పూర్వం హీరామణి బత్తాయి పండించేది. ఆ సమయంలో తన వస్తువులను ట్రక్కులో అమ్మకానికి ఎగుమతి చేసేదానినని ఆమె చెప్పింది.

Also Read: వరి టు-రో రైస్ ట్రాన్స్‌ప్లాంటర్

తాను దాదాపు ఎనిమిదేళ్లుగా వ్యవసాయం చేస్తున్నాననీ, ఇప్పటి వరకు తనకు ఎలాంటి ప్రభుత్వ పథకాలు అందలేదని హీరామణి చెబుతోంది. పథకం కింద కూడా మొక్కలు నాటాలని దరఖాస్తు చేసుకున్నా వినలేదన్నారు. ఇది మాత్రమే కాదు ఆమె పొలంలో నీటిపారుదల కోసం డ్రిప్ ఇరిగేషన్ ఏర్పాటు చేశానని తెలిపారు. హీరమణికి చెట్లు నాటడం అంటే చాలా ఇష్టం. నీటిపారుదల కోసం విద్యుత్‌పైనే ఆధారపడాల్సి వస్తోందని, గ్రామీణ ప్రాంతం కావడంతో విద్యుత్‌ సమస్య అలాగే ఉందన్నారు. అందుకే సోలార్‌ పంప్‌ కోసం దరఖాస్తు చేసుకున్నా ఇంతవరకు ప్రయోజనం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Vegetables Cultivation

Vegetables Cultivation

2016లో వ్యవసాయం ప్రారంభించినప్పుడు ఐదెకరాల పొలంలో మొక్కలు నాటినట్లు తెలిపారు. ఆ తర్వాత 2019లో తోటపని మరింత ముందుకు సాగింది. నేడు ఆమె వద్ద , లిచ్చి మహోగుణి మరియు జామ వంటి 35 రకాల మొక్కలు ఉన్నాయి. అదేవిధంగా పొలంలో మామిడి నుండి 500 మొక్కలు, సుమారు 61 లిచ్చి మొక్కలు మరియు 1000 కంటే ఎక్కువ మహోగని మొక్కలు ఉన్నాయి. ఇది కాకుండా జామ, దానిమ్మ, సీజనల్ మరియు గింజలు లేని నిమ్మచెట్లు ఉన్నాయి. తోటలకు సాగునీటి సౌకర్యం లేకపోవడంతో ఇబ్బందులు పడాల్సి వస్తోంది. గతేడాది మామిడి పండ్లను విక్రయించినట్లు తెలిపారు. ఈ ఏడాది కూడా మామిడి బాగా పండినా సాగునీరు లేకపోవడంతో రాలిపోతున్నాయి అని ఆవేదన వ్యక్తం చేశారు.

హార్టికల్చర్‌తో పాటు హిరామణి టమోటా, బెండకాయ, క్యాలీఫ్లవర్, క్యాబేజీ, పెసలు మరియు ఆవాలు పండిస్తున్నారు. అంతే కాకుండా ఆమె పుచ్చకాయను కూడా పండిస్తోంది. 2019లో రెండు లక్షల రూపాయల విలువైన పుచ్చకాయను విక్రయింరు ఆమె. అయితే లాక్‌డౌన్‌ కారణంగా రెండేళ్లపాటు కష్టాలు పడాల్సి రావడంతో ఈసారి పుచ్చకాయ సాగు చేయలేదు. తన తోటలో మొక్కలు చిన్నగా ఉన్నప్పుడు మొక్కల మధ్య అల్లం, మొక్కజొన్న, బాదం సాగు చేసేదానిని అని ఆమె తెలిపారు. హీరామణి మొత్తం 10 ఎకరాలకు పైగా భూమిలో సాగు చేస్తున్నారు. పొలం బయట ఇప్పుడు ఆరు ఎకరాల్లో తోటపని చేస్తున్నామని ఆమె అన్నారు.

Also Read: వేసవిలో పుచ్చ సస్య రక్షణ

Leave Your Comments

Two Row Rice Paddy Transplanter: వరి టు-రో రైస్ ట్రాన్స్‌ప్లాంటర్

Previous article

Four Row Paddy Drum Seeder: నాలుగు- వరుస వరి డ్రమ్ సీడర్

Next article

You may also like