రైతులు

Farmer Success Story: పుట్టగొడుగుల సాగు ప్రారంభించి ఏటా 170 టన్నులు ఉత్పత్తి

0
Mushrooms Cultivation
Mushrooms Farming

Farmer Success Story: నేటి కాలంలో రైతులు సంప్రదాయ వ్యవసాయంతో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. ఈ సమయంలో వారికి అనేక రకాల పంటలు అందుబాటులో ఉన్నాయి. సాగు భూమి లేని రైతులకు పుట్టగొడుగుల పెంపకం కంటే మెరుగైన ఎంపిక మరొకటి ఉండదు. దీనికి పెద్దగా ఖర్చు ఉండదు. పొలం ఉండాల్సిన అవసరం లేదు. నేటి కాలంలో గ్రామాలు, పల్లెల్లో సైతం రైతులు పుట్టగొడుగులను ఉత్పత్తి చేస్తున్నారు.

Farmer Success Story

హిమాచల్ ప్రదేశ్‌లోని సోలన్ జిల్లాలో నివసిస్తున్న వినోద్ ఠాకూర్ అనే రైతు పుట్టగొడుగుల పెంపకంతో మంచి ఆదాయాన్ని ఆర్జిస్తున్నాడు. . సోలన్‌ను మష్రూమ్ సిటీ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు. ఇక్కడ పుట్టగొడుగుల ఉత్పత్తి ఎక్కువగా ఉండడం దీనికి మొదటి కారణం కాగా డైరెక్టరేట్ ఆఫ్ మష్రూమ్ రీసెర్చ్ ఇక్కడ ఉండడం రెండో కారణం. వినోద్ ఠాకూర్ అదే సోలన్‌లోని బెర్ కి సెర్ అనే చిన్న గ్రామంలో నివసిస్తున్నాడు.

Farmer Success Story

                             Vinod Thakhur

వ్యవసాయంలో భవిష్యత్తును వెతుక్కున్న ఠాకూర్ సంప్రదాయ వ్యవసాయం కాకుండా పుట్టగొడుగులను ఉత్పత్తి చేయడం ప్రారంభించాడు. 1980లో తన గదిలో 25 ట్రేలతో పుట్టగొడుగుల పెంపకాన్ని ప్రారంభించిన ఠాకూర్ ఈరోజు సుపరిచితుడై విజయవంతమైన రైతుగా పేరుగాంచాడు.అతను ఈ పనిలో విజయం సాధించడంతో పుట్టగొడుగులతో పాటు టమాటా, పెసలు, మొక్కజొన్న సాగు చేయడం ప్రారంభించాడు. దీంతో పాటు తన వ్యాపారాన్ని పెంచుకునేందుకు పాడి పరిశ్రమను కూడా ప్రారంభించాడు. ఆధునిక సాంకేతికత, వ్యవసాయంలో జరుగుతున్న ప్రయోగాలను తెలుసుకుని, అర్థం చేసుకున్న వినోద్ ఠాకూర్ ఎరువును తయారు చేస్తూ సంపాదిస్తున్నాడు.

Mushroom Farming

                           Mushroom Farming

ఠాకూర్ సంవత్సరానికి 170 టన్నుల పుట్టగొడుగులను ఉత్పత్తి చేస్తాడు. అతని విజయం ఇతర రైతులకు కూడా స్ఫూర్తినిచ్చింది మరియు వారు కూడా పుట్టగొడుగుల పెంపకం ద్వారా వారి జీవితాల్లో మార్పు తీసుకువస్తున్నారు. విజయవంతమైన రైతు వినోద్ ఠాకూర్ వ్యవసాయంలో చేసిన కృషికి అనేక అవార్డులతో సత్కరించబడ్డారు.

Leave Your Comments

Biofortified: వ్యవసాయంలో బయోఫోర్టిఫైడ్ ప్రాముఖ్యత

Previous article

Flax Seeds health benefits : రోజూ గుప్పెడు అవిసె గింజలతో.. సంపూర్ణ ఆరోగ్యం

Next article

You may also like