Government creating unique IDs of farmers రైతు ప్రయోజనాల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను ప్రవేశపెడుతున్నాయి. మద్దతు ధర, పంట నష్టపరిహారం, సబ్సిడీ, ఎరువుల, విత్తనాలు, యంత్రాలు సరఫరా మొదలైన విషయాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ప్రోత్సహిస్తున్నాయి. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పొందాల్సిన పథకాల విషయంలో రైతులకు మధ్యవర్తుల తాకిడి ఎక్కువైంది. దీంతో రైతులకు చెందాల్సిన ఫలాలు అందక నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం బృహత్తర నిర్ణయానికి శ్రీకారం చుట్టింది. రైతులందరికీ ప్రభుత్వం తరుపున గుర్తింపు కార్దు జారీ చేసేందుకు కసరత్తు ప్రారంభించింది.
లోకసభలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ tomar మాట్లాడుతూ.. రైతులపై మధ్యవర్తులు లేకుండా చూసేందుకు కేంద్రం కసరత్తు చేస్తుంది. అందులో భాగంగా దేశంలోని రైతులకు గుర్తింపు కార్డులు మంజూరుకు ప్రక్రియ మొదలైంది. ఇప్పటికి ఇ-నో యువర్ ఫార్మర్స్ ద్వారా రైతులను ధృవీకరించే నిబంధన మొదలైంది. దీని ద్వారా వివిధ పథకాల కిందా రైతులు ప్రయోజనాలు పొందుతారు. అదేవిధంగా కార్యాలయాల చుట్టూ రైతులు తిరిగే శ్రమ తప్పుతుందన్నారు మంత్రి. ఇప్పటివరకు మొత్తం 11.5 కోట్ల మంది రైతుల్లో ఐదున్నర కోట్ల మంది రైతుల డేటాబేస్‌ను సిద్ధం చేశామన్నారు. మిగిలిన రైతుల వివరాల కోసం కసరత్తు జరుగుతోంది. Government creating unique IDs of farmers
ప్రధాన మంత్రి కళ్యాణ్ నిధి యోజన నుంచి సంవత్సరానికి మూడు సార్లు రెండు వేల రూపాయల అందజేసే రైతులందరికీ ఈ ఐడీ కార్డు ఉపయోగపడనుంది. దేశంలో వ్యవసాయ పథకాల్లో అనేక రకాల మోసాలు జరుగుతున్నాయని, వాటి ప్రతికూలతలతోపాటు నకిలీలు, మోసగాళ్లతో రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారని ప్రస్తావించారు. గుర్తింపు కార్డు ఉండటం వల్ల రైతులు లాభదాయకమైన అంశాలను పొందేందుకు సహాయపడుతుంది. ఈ కార్డు ద్వారా వ్యవసాయానికి సంబంధించిన వివిధ సమాచారాన్ని రైతులకు నేరుగా అందించవచ్చు. డిజిటల్ అగ్రికల్చర్ మిషన్‌తో చేసే ఈ ప్రయత్నం వ్యవసాయ రంగంలో పారదర్శకతను తీసుకరానుందని మంత్రి తోమర్ అభిప్రాయపడ్డారు. ID Cards For Farmers