Benefits of Terrace Gardening: ఇంటి పంట ద్వారా మన కుటుంబానికి కావాల్సిన, వచ్చిన తాజా కూరగాయలను ఎప్పటికప్పుడు పండించుకోవచ్చు. ఇంటి పెరటిలోగాని, టెర్రస్ పైనగాని, అపార్ట్మెంట్ వాసులైతే బాల్కనీల్లో గాని కూరగాయ మొక్కలు, పండ్ల మొక్కలు, ఔషధ మొక్కలు, పూల మొక్కలు పెంచుకోవచ్చు.
ఇంటి పంటతో లాభాలు:
- ఇంటిపంటతో ఏడాదిపొడవుగా అవశేషాలు లేని తాజా కూరగాయలు పండ్లను పొందవచ్చు.
- ఇంటి చుట్టూ, ఇంటిపైన పచ్చదనాన్ని పెంపొందించుకోవచ్చు.
- వాతావరణ కాలుష్యాన్ని తగ్గించుకొని, స్వచ్ఛమైన గాలిని పొందవచ్చు.
- భూతాపాన్ని కొంతమేర తగ్గించుకొని కరెంటు ఖర్చును తగ్గించుకోవచ్చు. కూరగాయలు, పండ్లు, పూలపై పెట్టే ఖర్చు ఆదా అవుతుంది.
- చెట్ల మధ్య గడపటం వల్ల శారీరక, మానసిక ఉల్లాసం కలుగుతుంది.
- మన విత్తనాన్ని మనమే ఉత్పత్తి చేసుకోవచ్చు.
పెరటి తోటల పెంపకం: పెరటి తోటలను ఇంటికి దగ్గరలో సూర్యరశ్మి సోకే దేశంలో పెంచుకోవాలి. నీటిపారుదల సౌకర్యముండాలి. కూరగాయలను మీ ప్రాంత వాతావరణాన్ని, పంట కాలాన్ని దృష్టిలో మొక్కలను నాటుకునేముందు రాళ్లురప్పలు, చెత్తా, చెదారం లేకుండా నేలను పెట్టుకొని నాటుకోవాలి. చదును చేసుకోవాలి. భూమికి కంపోస్టు ఎరువు వేసుకోవాలి. విత్తనాలను మీకు దగ్గరలో ఉన్న నర్సరీల నుండిగాని, ఉద్యానశాఖ నుంచి కొనుగోలు చేసుకోవాలి. ఇంటి ముందు భాగంలో పూల, అలంకరణ, ఔషధ మొక్కలు, ఇంటి వెనుక భాగంలో పండ్లు, కూరగాయ మొక్కలు పెంచుకోవచ్చు.
కూరగాయ మొక్కలను పెంచుకునే పద్ధతి: టొమాట, వంగ, మిరప, క్యాబేజి, కాలిఫ్లవర్ వంటి కూరగాయలను నారు పెంచి నాటుకోవాలి. కంచెపైన వేసవి, వర్షాకాలంలో కాకర, బీర, సొర, దోస, పొట్ల, పుచ్చ వంటి తీగ జాతి కూరగాయలను, శీతాకాలంలో చిక్కుడు, బఠాణీ మొక్కలను పెంచుకోవాలి. క్యాబేజి, కాలీఫ్లవర్ వంటి దీర్ఘకాలిక పంట వరు సల మధ్య పాలకూర, మెంతికూర, కొత్తిమీర, బచ్చలి వంటి స్వల్పకాలిక పంటలను వేసుకోవాలి. బోదెగట్ల పైన క్యారెట్, ముల్లంగి, బీట్రూట్ వంటి కూరగాయలను పెంచుకోవాలి. పూలమొక్కలను కూరగాయ మొక్క లతో కలిపి వేసుకోవటం వల్ల పురుగుల బారినుంచి కూరగాయ మొక్కలను కొంతమేర రక్షించుకోవచ్చు. పూలమొక్కలు కూరగాయల నాశించే పురుగులను ఆకర్షించి పురుగుల బారి నుండి కాపాడుతాయి. త్వరగా పక్వానికి వచ్చే కూర గాయలన్నింటిని ఒకేచోట విత్తడం వల్ల కాపు అయిన తరువాత ఆ స్థలాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.
Also Read: Terrace Farming: భూమి కొరత కారణంగా డాబాపై వ్యవసాయం
Also Watch: