Farmers Success Story: వ్యవసాయ రంగంలో వాణిజ్య పరంగా ఎదగాలంటే డిమాండ్ లో ఉన్న పంటను సాగు చేయాలి. అయితే అధిక ఆదాయం కోసం కొందరు అడ్డదారులు తొక్కుతున్నారు. ఈ క్రమంలో మత్తుపదార్ధాలను పండిస్తూ లక్షలు సంపాదిస్తున్నారు. కానీ ప్రస్తుతం ఆ సంప్రదాయం కనిపించడంలేదు. డబ్బు కోసం అడ్డదారులు తొక్కేవారి సంఖ్య రోజురోజుకి తగ్గిపోతుంది. ఆరోగ్యంతో పాటు సమాజంలో గౌరవం కోరుకునే వారి సంఖ్య పెరిగింది. గతంలో మత్తు పదార్ధాలను సాగు చేసిన ఓ రైతు ప్రస్తుతం ఆదర్శ రైతుగా మారాడు.
బీహార్‌లోని గయా జిల్లాలోని ఛోట్కీ చాపి గ్రామానికి చెందిన సకల్‌దేవ్ యాదవ్ తన జీవితంలో జరిగిన అనుభవాలను పంచుకున్నారు. యాదవ్ మాట్లాడుతూ… నాకు తొమ్మిదేళ్ల ప్రాయంలో మా గ్రామంలో పేదరికంతో ఎన్నో కష్టాలు ఎదుర్కొనేవారు.15 కిలోమీటర్ల దూరంలో ఉన్న మార్కెట్‌లో ఎండు కలపను అమ్మడం తప్ప మాకు ఇతర స్థిరమైన ఆదాయ వనరులు లేవు. కాబట్టి 0.4-0.8 హెక్టార్ల పంటకు సంవత్సరానికి కనీసం రూ.1 లక్ష ఆదాయానికి హామీ ఇవ్వడంతో గ్రామంలో రైతులు నల్లమందు వ్యవసాయం వైపు మొగ్గు చూపారు. పంజాబ్, హర్యానా, రాజస్థాన్‌ల నుంచి విపరీతమైన డిమాండ్ ఉంది.
కాలక్రమేణా గ్రామంపై పోలీసుల దాడులు మొదలుపెట్టారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2015-16, 2018-19 మధ్య నాలుగు సంవత్సరాలలో దాడుల ద్వారా 400 హెక్టార్లలో పంటలు నాశనం అయ్యాయి. గరిష్టంగా గయా జిల్లాలో 1,300 హెక్టార్లలో నల్లమందు సాగు అయింది. అయితే రోజురోజుకి దాడులు పెరుగుతుండటంతో దాడులతో విసిగిపోయిన మహిళా రైతులు 2019లో సహాయం కోసం స్థానిక ప్రభుత్వ అధికారులను సంప్రదించారు.
Also Read: ఆదర్శ రైతు విజయ గౌరీ సక్సెస్ స్టోరీ
బలవంతంగా నల్లమందు సాగును ఆపడానికి అవకాశం లేకపోవడంతో మహిళలతో కలిసి దానికి వ్యతిరేకంగా అవగాహన కల్పించాము అని గయా డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ అభిషేక్ కుమార్ చెప్పారు. కాగా అటవీ శాఖ రైతులకు తేనెటీగల పెంపకం, కుట్టుపనిలో నైపుణ్యాభివృద్ధి శిక్షణను నిర్వహించడంతోపాటు నిమ్మగడ్డి, మునగ చెట్లు మరియు నూనె-గింజలను పరిచయం చేయడం ప్రారంభించింది. అనంతరం గ్రామాల్లో ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు జిల్లా యంత్రాంగం నిధులు విడుదల చేసింది.
ఉదాహరణకు జైగీర్ గ్రామంలో ఇప్పుడు లెమన్‌గ్రాస్ ఆయిల్ ప్రాసెసింగ్ యూనిట్ ఉంది. తేనె మరియు మునగ పొడిని ప్రాసెస్ చేయడానికి మరియు టిల్కుట్ తయారీకి వివిధ గ్రామాలలో ఇలాంటి యూనిట్లు ఏర్పాటు చేయబడ్డాయి. అటవీ శాఖ ప్రస్తుతం అరణ్యక్ బ్రాండ్ పేరుతో ఉత్పత్తులను విక్రయిస్తోంది. నల్లమందు సాగుకు లాభదాయకమైన ప్రత్యామ్నాయాన్ని అందించడంతో పాటు ఉపాధిని కల్పించడం వల్ల ఈ ప్రాంతంలో వ్యతిరేఖ సాగు తగ్గిందని అధికారులు. ఈ కార్యక్రమం విజయవంతం కావడం వల్ల రానున్న రోజుల్లో మిగిలిన రైతులను కూడా ఆకర్షిస్తారని ఆయన అభిప్రాయపడ్డారు.
అయితే ప్రస్తుతం యాదవ్ తన 2.4 హెక్టార్ల వరి పొలంలో మొదటిసారిగా నిమ్మగడ్డిని పెంచుతున్నాడు. ఇప్పటికే రూ.25,000 పెట్టుబడి పెట్టి విత్తనాలు సేకరించి, ఐదేళ్ల తర్వాత పండించిన పంటను నూనెగా మార్చి లీటరు రూ.1,300-1,500కి విక్రయిస్తే మంచి రాబడి వస్తుందని సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. కాగా యాదవ్ విజయవంతంగా పండిస్తే అతని కుటుంబం మళ్లీ నల్లమందు సాగులోకి వెళ్లాల్సిన అవసరం ఉండదు.
Also Read: బిగ్ బాస్కెట్, రిలయన్స్ లతో ఒప్పందం కుదుర్చుకున్న మహిళా రైతు కథ