Polyhouse Farming: పూలకు ఏడాదంతా మార్కెట్ ఉంటుంది. కార్తీక మాసంలో మరింత ఎక్కువ డిమాండ్ ఉంటుంది. అయితే సాధారణ పూల సాగు ఎవరైనా చేయవచ్చు. కానీ జర్బెరా సాగు మాత్రం పాలహౌసుల్లోనే సాగు చేయాల్సి ఉంటుంది. అందరి మాదిరిగా కాకుండా వినూత్నంగా పూల సాగు చేయాలనుకున్నారు… రైతు సంతోష్ కుమార్. బెంగళూరు సమీపంలోని లింగపుర గ్రామంలో ఆదర్శ రైతు సంతోష్ కుమార్ పదేళ్లుగా పాలీ హౌస్ లో జర్బెరా పూల సాగు చేపట్టారు. లక్షల రూపాలయ ఖర్చుతో పాలీ హౌస్ నిర్మించుకుని అత్యాధునిక పద్దతుల్లో సంతోష్ కుమార్ పూల సాగు చేసి ఔరా అనిపిస్తున్నారు.
ఒక్కసారినాటతే నాలుగేళ్ల దిగుబడి
పాలీహౌసులో జర్బెరా మొక్కలను ఒక్కసారి నాటితే నాలుగేళ్లపాటు, 365 రోజులు దిగుబడి వస్తుందని సంతోష్ కుమార్ తెలిపారు. రోజూ వేలాది జర్బెసా పూల దిగుబడి సాధించడంమే కాదు. ఆ పూలతో బొకేలు తయారు చేసి బెంగళూరులో మార్కెట్ చేస్తూ లక్షలు ఆర్జిస్తున్నారు. అర ఎకరం భూమిలోనూ జర్బెరా సాగు చేయవచ్చని రైతు సంతోష్ తెలిపారు. ఎర్ర భూములు జర్బెరాకు సాగుకు అనుకూలంగా ఉంటుంది. అయితే 2 ఎకరాల్లో సాగు చేయడానికి పది మంది కూలీల అవసరం ఉంటుందని సంతోష్ తెలిపారు. అయితే ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తే కూలీలను తీసుకురావడం, పర్యవేక్షణ బాగుంటుందని సంతోష్ చెబుతున్నారు.
Also Read: MTU-1262 Marteru Paddy Seed Variety: మార్టేరు వరి పరిశోధన స్థానం ఖాతాలో కి మరో నూతన వరి వంగడం.!
బెడ్ ఏర్పాటు చేసుకోవాలి
జర్బెరా సాగు చేసేందుకు ముందుగా పాలీ హౌస్ లో రెండు అడుగుల ఎత్తైన బెడ్ తయారు చేసుకోవాలి. నీరు ఎక్కువైనే జర్బెరా మొక్క చనిపోతుంది. అందుకే వర్షాలు పడ్డా, నీరు పట్టినా నీరు నిలవకుండా జర్బెరా సాగులో జాగ్రత్తలు తీసుకోవాలని రైతు సంతోష్ తెలిపారు. మొక్కకు మొక్కకు మధ్య 2 అడుగుల దూరం పాటించాలని సంతోష్ చెబుతున్నారు. కరెంటు సౌకర్యాలతోపాటు, మార్కెటింగ్ పై కూడా రైతులకు అవగాహన ఉండాలని రైతు తెలిపారు. మార్కెట్ చేసుకునే అనుభవం లేకుండా ఈ పంట సాగు చేయవద్దని ఆయన సలహా ఇస్తున్నారు. కేవలం సాగు చేయడమే కాకుండా, రైతులు పండించిన పూలను కూడా సంతోష్ కొనుగోలు చేసి ఎగుమతి చేస్తున్నారు.
మెట్రో నగరాలు దక్కర ఉండాలి
ఎకరా పాలీ హౌస్ కు రూ.50 లక్షలు ఖర్చవుతుంది. జర్బెరా ను మార్కెట్ చేసుకోవాలంటే కనీసం వంద కిలోమీటర్ల పరిధిలో మెట్రో నగరం ఉండేలా చూసుకోవాలని రైతు సంతోష్ సలహా ఇస్తున్నారు. ఎరుపు, పసుపు రంగు జర్బెరా కు మంచి డిమాండ్ ఉందని ఆయన తెలిపారు. ఢిల్లీ, బెంగళూరు, పూణే మార్కెట్లలో జర్బెరాకు మంచి ధర వస్తుందని ఆయన చెబుతున్నారు. ఎకరాకు 16 వేల మొక్కలు పెట్ట వచ్చని ప్రతి రోజూ పూల దిగుబడి వస్తుందని సంతోష్ వెల్లడించారు. మొక్క నాటిని 3 నెలలకు పూల దిగుబడి వస్తుంది. అక్కడి నుంచి ప్రతి రోజూ పూల దిగుబడి లభిస్తుందన్నారు.
Also Read: Irradiation Onions Experiment: భారత్ లో తొలిసారి నిల్వ చేసే అరేడియేషన్ ఉల్లిపాయలపై ప్రయోగం.!