Tomato Farmers: టమాటా ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. పెట్టిన పెట్టుబడులు కంటే ఎక్కువ లాభాలు రావడంతో రైతులు కోటీశ్వరులు అయ్యారు, అవుతున్నారు కూడా. అందుకే రైతులు ఇప్పుడు పడుతున్న వర్షాలకు వరి పత్తి, మొక్కజొన్న అన్ని పంటలను వదిలివేసి కూరగాయల పంట అయినా టమాటా ను ఎంచుకుంటున్నారు. టమాటా పంటకు లాభాలు వస్తాయాన ఆశతో రైతులు ఈపంటను వేయడానికి సిద్దపడుతున్నారు. ప్రసుత్తం ధరలు అమాంతం పెరిగిపోవడంతో టమాటా పంటపై దృష్టి సారించారు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఈపంట సాగు చేయడానికి రైతులు సిద్దపడుతున్నారు. దున్ని విత్తనం వేయడం లేటు అవుతుంది అంతకుముందు వేసిన మొక్కలను తొలగించి దాని స్థానంలో విత్తనాలను చల్లుతున్నారు. వాతావరణ పరిస్థితులను తట్టుకొని అధిక దిగుబడులను ఇచ్చే నారును తెచ్చుకుంటున్నారు.
ధరలు పుంజుకోవడంతో రైతుల ఆశలు చిగురింపు
వాణిజ్య పంటగా సాగు చేసిన టమాటా రైతులకు ఈ సంవత్సరం ప్రతికూల వాతావరణ పరిస్థితులు దిగుబడుల పై ప్రభావం చూపాయి. అధిక పెట్టుబడులు పెట్టి పంట వేస్తే అనుకున్న స్థాయిలో పంట రాలేదు. పంటకు వైరస్ సోకి రావలిసిన దిగుబడి కంటే తక్కువగానే వచ్చింది. సీజన్ ప్రారంభంలో టమాటా పంటకు రేటు లేకపోవడంతో పంటను పొలాల్లోనే వదిలివేశారు. జున్ నుంచి పంటకు ధరలు పుంజుకోవడంతో రైతుల ఆశలు చిగురించాయి. అనుకున్నదాని కంటే రేట్లు ఎక్కువ రావడం రైతులు మళ్లీ ఈ పంట సాగు వైపు మళ్లిస్తున్నారు.
Also Read: Pulses Price Hike: పప్పులతో తిప్పలు తప్పవా భారీగా పెరగనున్న పప్పు ధాన్యాల ధరలు
సీజన్ మొదట్లో వేసిన ఎండిపోయిన టమాటా ను తొలగించి కొత్త నారు వేసుకుంటున్నారు. ఇలా చేయడం ద్వారా పంట కాలం తగ్గి మొక్క ఎదుగుదల పెరిగి పంట తర్వగా వస్తుందని రైతులు అంటున్నారు. ఎటువంటి వంటి వైరస్ సోకకుండా మొదటి దశలోనే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అంతేకాకుండా ఇప్పుడు పొలం చుట్టూ వల వేస్తున్నారు.
నారు కోసం కర్ణాటకకు వెళ్తున్న రైతులు
రైతులు మంచి నారు కోసం కర్ణాటక వెళ్లి తెచ్చుకుంటున్నారు. నవంబర్ వరకు ధరలు ఇలానే ఉంటాయని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. అందుకే ఈ పంటపై రైతులు దృష్టి మళ్ళించారు. ఎకర పొలంలో నారు వేయడానికి 20 వేలు ఖర్చు చేస్తున్నారు. 30 రోజులు ఉన్న నారు తీసుకొని నాటితే దిగుబడులు వస్తాయాని రైతులు అంటున్నారు. వ్యాపారులు దీనిని అదనుగా చేసుకొని నారు ధరలను పెంచేస్తున్నారు. బహిరంగ మార్కెట్లో 10 గ్రాముల 1800 ఉండగా బ్లాక్ మార్కెట్లో 2000 వరకు పెంచుతున్నారు. రైతులను దగా చేస్తున్నారు.ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి దళారులను అరికట్టి సబ్సిడీపై విత్తనాలను ఇవ్వాలని కోరుతున్నారు.
Also Read: Backyard Fruit Plants: ఇంటి పెరట్లో ఎలాంటి పండ్ల మొక్కలు వేసుకోవాలి.!