Agricultural Mobile App for Farmers: వ్యవసాయంలో రైతులకి ఆధునికత ఎక్కువ అవడం ద్వారా సులువుగా పంటలు పండిస్తున్నారు. పండించిన పంటని కూడా త్వరగా అమ్ముకుంటున్నారు. వ్యవసాయంలో కొత్త సాంకేతిక విజ్ఞానం తోడు అవడంతో వినూత్నమైన పంటలని కూడా పండిస్తున్నారు. ఈ ఆధునిక టెక్నాలజీ ద్వారా కొత్త పంటలని ఎలా పండించాలి, పండించిన పంటకి చీడ పీడలని నివారించుకునే పద్ధతులు చాలా తక్కువ సమయంలో తెలుసుకోవచ్చు. ఇలాంటి టెక్నాలజీతో వచ్చిన కొత్త అప్ ప్లాంటిక్. దీని ద్వారా రైతులు చాలా లాభాలు పొందుతున్నారు.
ఈ అప్ మన ఫోన్లో ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు . ప్లాంటిక్ అప్ ప్రస్తుతం 18 భాషలో అందుబాటులో ఉంది. ఈ ప్లాంటిక్ అప్ ద్వారా రైతులు పండించిన పంటకి ఎలాంటి రోగాలు వస్తాయి అని తెలుసుకోవచ్చు. రైతులు వల్ల పంటని ఒక ఫోటో తీసి ప్లాంటిక్ అప్లో అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత నిమిషంలోనే మనకి పంటకి ఎలాంటి రోగం వచ్చింది. రోగం పేరు. దాని ఎలా నివారించుకోవచ్చు అనే సందేశాల్ని ఇస్తుంది.
Also Read: Drum Water Filter: నీళ్లు తాగడానికి పొలంలో కొత్త రకం వాటర్ ఫిల్టర్.!
పంటని చీడ పీడలు ఆశిస్తే వాటిని ఫోటో ద్వారా నివారణ సందేహాలు తెలుసుకోవచ్చు. వీటిని రసాయన పద్దతిలో లేదా సేంద్రియ పద్దతిలో నివారించుకొనే సందేశలని చూపిస్తుంది. నిరక్షరాసులుగా ఉన్న రైతులు ఈ సందేశాల్ని వినడానికి వీలుగా రికార్డింగ్ పద్దతిలో కూడా ఉంటుంది.
ప్లాంటిక్ అప్ ద్వారా వ్యాధి గుర్తింపు మరియు చికిత్స సలహాతో పాటు పంట పండించడానికి ఉపయోగపడే సాగు చిట్కాలు. ఈ అప్లో 500 మంది వ్యవసాయ నిపుణులు ఉంటారు. వారి ద్వారా రైతులు వారు పండించిన పంట సందేహాల్ని తెలుసుకోవచ్చు. రైతులకి పంటలో వచ్చే వ్యాధుల గురించి ముందగానే హెచ్చరించి, నివారణ చర్యలు కూడా చెపుతుంది.
పండించిన పంటకి ఎంత మోతాదులో ఎరువులు వేసుకోవాలి అని లెక్క వేసి చెపుతుంది. ఎరువులు కాలిక్యులేటర్ పంట, పంట పొలం పరిమాణం బట్టి లెక్క చేస్తుంది. ఈ అప్ రైతులందరి చాలా ఉపయోగపడుతుంది. ఎక్కువ భాషలో ఉండటం వల్ల కూడా అని ప్రాంతాల రైతులు ఈ ప్లాంటిక్ అప్ వాడుకొని పంటలో నూతన టెక్నాలజీ వాడుకొని మంచి ఆదాయం కూడా పొందవచ్చు.
Also Read: Food Processing Machine: పంటని ప్రాసెస్ చేసి అమ్ముతే రైతులకి మంచి లాభాలు…