Farmers Approach HC తెలుగు రాష్ట్రాల విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి పేరు గాంచింది. ఆ నాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆంధ్ర రాజధానిగా అమరావతిని నిర్ణయించారు. 5 కోట్ల ఆంధ్రుల అభివృద్ధికి వారధైన అమరావతే ఏకైక రాజధానిగా తీర్మానించింది ఆ నాటి మంత్రివర్గం . కాగా అనంతరం చట్టాల్లో మార్పులు, రాజధానిగా మూడు ప్రాంతాలని ఎంచుకున్నారు ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి. దీంతో రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ అన్నదాతలు ఉద్యమం మొదలు పెట్టారు. అందులో భాగంగా గత నలభై రోజులుగా మహా పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. Amaravati Rajdhani Farmers
AP Farmers Padayatra For Amaravati నలభై రోజులుగా చేస్తున్న ఈ పాదయాత్ర 16వ తేదీ తిరుమల శ్రీవారి దర్శనంతో ముగియనుంది. తిరుపతిలో 17వ తేదీన బహిరంగ సభను నిర్వహించాలని రాజధాని అమరావతి పరిరక్షణ సమితి నిర్ణయించింది. కాగా.. తిరుపతిలో రాజధాని రైతులు ఈనెల 17న తలపెట్టిన బహిరంగ సభకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో ఎట్టిపరిస్థితుల్లోనూ బహిరంగ సభ నిర్వహిస్తామని రైతులు తేల్చి చెప్పారు. హైకోర్టు ( AP High Court )ను అశ్రయించి.. సభకు అనుమతి సాధిస్తామని వారు నేడు హైకోర్టుని ఆశ్రయించారు.
Farmers Approach HC అమరావతి పరిరక్షణ సమితి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. రాజధాని రైతుల బహిరంగ సభకు అనుమతి ఇవ్వాలని పిటిషన్ లో కోరింది. సభను ఉద్దేశపూర్వకంగానే సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం అడ్డుపడుతోందని హైకోర్టుకు వెల్లడించారు న్యాయవాది లక్ష్మినారాయణ. కాగా.. రైతుల పిటిషన్ పై రేపు మంగళవారం విచారణ జరగనుంది. ఇకపోతే రైతులు రైతు సంఘం నేతలు రాకేష్ టికాయత్ తో సహా పలువురు పార్టీల నేతలను ఆహ్వానించారు. AP Farmers Protest For Amaravati