Farmer Success Story: తక్కువ శ్రమ, పరిమిత పెట్టుబడితో అధిక దిగుబడినిచ్చి మార్కెటింగ్కు ఎలాంటి ఇబ్బందిలేని ఏ పంటయినా రైతుకు లాభసాటిగానే ఉంటుంది. కృష్ణాజిల్లాకు చెందిన వెంకటకృష్ణయ్య అనే రైతు గత రెండేళ్లుగా కొత్తరకం జామ ‘అర్క కిరణ్’ను సాగుచేస్తూ మంచి ఆదాయాన్ని పొందుతున్నారు. సాధారణంగా జామతోటలు నాటిన రెండేళ్లకు కాపుకు వస్తాయి. కాని అర్క కిరణ్ రకం నాటిన 11 నెలలకే కాపుకొచ్చింది. పంటకు పెట్టిన పెట్టుబడి మొత్తం మొదటి ఏడాదే చేతికొచ్చింది. రెండో ఏటనుంచి ప్రతి ఆరు మాసా లకోసారి కాపుకు వస్తోంది. నూతన రకం జామసాగులో ఈ రైతు ఎలాంటి పద్ధతులను అవలంభిస్తున్నాడు,
రైతు వెంకటకృష్ణయ్య 15 ఎకరాల్లో అర్కకిరణ్ రకాన్ని సాగు చేస్తున్నాడు. దీనిని రెండు భాగాలుగా విభజించి 2015 ఏప్రిల్లో ఏడున్నర ఎకరాల్లో మొక్కలు నాటాడు. మిగతా ఏడున్నర ఎకరాల్లో 2016 ఫిబ్రవరిలో నాటాడు. మొదట నాటిన మొక్కల నుంచి కాపుతీయలేదు. ఆ మొక్కల నుంచి మరిన్ని మొక్కలు తీయడానికే ప్రయత్నించారు. ఇది అరుదైన రకం. ఒక పంటను వదులుకొని మొక్కలుగా మార్చితే మరింతమంది రైతులకు వాటిని ఇచ్చి విస్తీర్ణం పెంచవచ్చన్నది ఈ రైతు అభిప్రాయం. బెంగళూర్లోని భారత ఉద్యాన పరిశోధన స్థానం వారు ఈ రకాన్ని రూపొందించారు. 2012లో అక్కడి నుంచి 175 మొక్కలు కొనుగోలు చేశారు. వాటిని దపదపాలుగా అభి వృద్ధి చేసి 2015 నాటికి 16వేల మొక్కలను తయారు చేశాడు. అలా తయారు చేసిన మొక్కలనే తన పొలంలో నాటుకున్నాడు.
సాగు: శాస్త్రవేత్తలు జరిపిన వివిధ పరిశోధనల్లో, రైతుల పరిశీలనలో జామ తోటల సాగులో మొక్కల సాంద్రత పెంచిన ప్రతీసారి దిగుబడులు పెరిగి నట్లు గమనించారు. రైతు వెంకటకృష్ణయ్య అక్కకిరణ్ సాగుకు ఎంచుకున్న నేల గుల్లబారేలా రెండుసార్లు దున్నారు. ఆ తర్వాత మూలసాలు తోలారు.ఎకరానికి రెండువేల పాదులు వచ్చేలా గుర్తులు పెట్టారు. అడుగున్నర పొడవు . వెడల్పు × లోతుతో గుంతలు తవ్వించారు. ఒక్కో గుంత తవ్వడా X నికి కూలీలు రూ.11 రూపాయల చొప్పున ఎకరానికి రూ.22వేలు అడిగారు. దీంతో ప్రత్యామ్నాయంగా గుంతలు తవ్వేయంత్రాన్ని కొని తెచ్చారు. ఈ యంత్రం గంటకు 250 గుంతలు తవ్వుతుంది. లీటర్ పెట్రోల్తో ఈ యంత్రం నాలుగు గంటలు పనిచేస్తుంది. గుంతలు చేయడానికి ముందు మార్కింగ్ చేయడానికి, తీసిన గుంతలు పూడ్చటానికి ఒక్కో మొక్కకు రెండు రూపాయల చొప్పున ఖర్చయింది. ఎకరం పొలంలో మొక్కలు నాటడానికి అయిన ఖర్చు (భూమిని దుక్కి చేయడానికి రూ.3500+ గుంతల మార్కింగ్, మొక్కలు నాటడానికి రూ.4000) మొత్తం రూ. 7500. ఈ రైతు ఒక్కో అర్క కిరణ్ మొక్కను రూ.65 చొప్పున కొనుగోలు చేశాడు. మొక్కలు నాటిన తర్వాత: తోటలో ఏర్పాటుచేసిన డ్రిప్ ద్వారా గుంతలు తీసిన వెంటనే రెండు గంట లపాటు నీరు వదిలి ఇంకేలా చూడాలి. ఆ తర్వాత మొక్కలు గుంతల్లో నాటాలి.
Also Read: BAHAR TREATMENT IN GUAVA: జామలో పంట నియంత్రణ
మరుసటి రోజు నుంచి రోజుకు 5 నుంచి 10 నిమిషాలు డ్రిప్ ద్వారా నీరందిస్తే మొక్కలకు అవసరమైన తేమ అందుతుంది. వారం, పది రోజుల తర్వాత మొక్కల మొదళ్లను బిగదొక్కాలి. నెల తర్వాత బ్లైటాక్స్ ద్రావణాన్ని జామ మొక్కలపై పిచికారి చేయాలి. ఇలా ప్రతినెలా ఒకసారి బె _టాక్స్ ద్రావణం పిచికారి చేస్తే సరిపోతుందని, ఎలాంటి ఇతర క్రిమిసంహార కాలను వాడాల్సిన అవసరం లేదని రైతు తెలిపాడు. బ్లైటాక్స్ పిచికారీ చేసే ముందురోజు మొక్క 35 సెం.మీ. ఎత్తులో తలలు తుంచాలి. తలలు తుంచడం వల్ల మొక్క కింది భాగంలో పిలకలు పుట్టుకొచ్చి సగటు దిగుబ డులు పెరగడానికి దోహదపడుతుంది. మొక్కలు పాతకముందే గుంతల్లో పశువుల ఎరువు వేయడం శ్రేయస్కరం. అలాగే ప్రతిగుంతకు రెండు, మూడు గ్రాముల కార్బోప్యూరాన్ గుళికలు వేయాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే మొక్కలు నాటిన 30 రోజులకు 40-45 సెం.మీ. ఎత్తు పెరుగుతాయి. 35 సెం.మీ. ఉంచి మిగిలిన తలలను తుంచాలి.
ఎరువులు:
జామ తోటలకు నత్రజని ఎరువులు పెద్దగా వేయనవసరం లేదు. తలలు కత్తిరించే ముందు నీటిలో కరిగే 19:19:19 ఎరువును ఎకరాకు 20-25 కిలోలు డ్రిప్ ద్వారా అందిస్తే సరిపోతుంది. ఇలా ప్రతి మూడునెలలకు ఒకసారి ద్రవ రూపంలో మిశ్రమ ఎరువును అందించడంతో పాటు 50 కిలోల యూరియా, 50 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్లను వేసి అవి కరిగే వరకు డ్రిపన్ను పని చేయించాలి. కోతకు కోతకు మధ్య ఒకసారి యూరియా ఫాస్ఫేట్ ద్రావ ణాన్ని, రెండుసార్లు 19:19:19 ద్రావణాన్ని అందించాలి. మొక్కల ఖరీదు కాకుండా దుక్కికి, గుంతలు తీయడానికి ఆ తర్వాత బైటాక్స్ వాడకం, తలలు తుంచడం, ఇతరత్రా ఎరువులకు కలిపి మొత్తం ఎకరాకు రూ.15వేల వరకు ఖర్చయింది. మొదటికోత అనంతరం తలలు తుంచడం, ఎరువుల ఖర్చు పరిమితంగా ఉంటుంది. మొదటి ఏడాదిలో ఖర్చులు అధికంగా ఉండటమే కాకుండా ఒకేకాపు వచ్చి దిగుబడి కూడా తక్కువగా ఉంటుంది. నాటిన 18 నెలలకే రెండోకాపు వస్తుంది. దీంతో పెట్టుబడి పోనూ కొంత మిగులుతుంది. మూడో కోతనుంచి ఆదాయం సమకూరే అవకాశం ఉంటుంది. ప్రతి ఆరు నెలలకోసారి తలలు తుంచడం వల్ల భూమిమీద పడిన ఆకు కుళ్లి మంచి – సేంద్రియ పదార్థంగా మారి ఎరువుల ఖర్చు తగ్గుతుంది.
దిగుబడి:
అర్కకిరణ్ రకం జామకాయ బరువు ఒక్కోటి 180-200గ్రా. ఉంటుంది. నాటిన 11వ నెలలో మొదటి కాపుతో ఎకరాకు ఆరు టన్నులు, రెండోకాపులో ఎకరానికి 10 టన్నుల చొప్పున నాటిన 18 నెలల వ్యవ ధిలో 16 టన్నుల దిగుబడి సాధించారు. ఆ తర్వాత ప్రతి ఆరునెలలకు 10 టన్నులకు తగ్గకుండా దిగుబడి వస్తుందని రైతు తెలిపాడు.
Also Read: Guava verieties: జామ సాగుకు అనువైన రకాలు
Must Watch: