రైతులు

Farmer Success Story : సేంద్రియ పద్ధతిలో మామిడి సాగు చేస్తున్న రైతు.!

1
Cultivating Mango Organically
Cultivating Mango Organically

Farmer Success Story : రసాయనిక వ్యవసాయం సృష్టించిన వినాశనం నుంచి బయట పడటానికి అనేక రకాల రసాయనరహిత సాగు పద్ధతులను నిపుణులు సూచిస్తున్నారు. వీటిలో అందుబాటులో ఉన్న వనరులను బట్టి వివిధ రకాల రైతులు వివిధ పద్ధతులను ఆచరిస్తూ తమ రసాయనిక వ్యవసాయాన్ని సేంద్రియానికి మార్చుకుంటూ వస్తున్నారు. ఏ ఒక్క సేంద్రియ పద్ధతిపైనో గ్రుడ్డిగా ఆధారపడకుండా అన్ని రకాలు సేంద్రియ పద్ధతులను పరిశీలించి అనువైన పద్ధతులను తమ పంటల సాగులో అవలంభించిన రైతులు ఆరోగ్యకరమైన దిగుబడులు సాధిస్తున్నారు. ఇదే కోవకు చెందుతాడు జగిత్యాలకు చెందిన కొక్కు అశోక్ కుమార్.

Farmer Success Story

Farmer Success Story

విద్యాశాఖలో పదవీవిరమణ చేసిన అశోక్ కుమార్ తన విశ్రాంత జీవితాన్ని వ్యవసాయరంగంలో గడపాలని తలచి 2005వ సంవత్సరంలో జగిత్యాల సమీపంలో 8 ఎకరాలు భూమిని కొనుగోలు చేయడం జరిగింది. అప్పటి పరిస్థితులలో తోటి రైతుల మాదిరిగానే తాను కూడా రసాయనిక వ్యవసాయం చేయదలచి 8 ఎకరాలకు గాను సుమారు 550 మామిడి మొక్కలను నాటించాడు. బంగినపల్లి, హిమాయత్, దశేరీ మొదలగు మూడు రకాలను ఎక్కువ మొత్తంలో వేసి మిగతా రకాలను ఇంటి అవసరాల నిమిత్తం కొన్నింటిని ఒక్కొక్కటిగా నాటించాడు.

Also Read: Mango Cultivation: మామిడిలో లాభాలు రెట్టింపు చెయ్యడానికి  తీసుకోవాల్సిన చర్యలు.!

మామిడి మొక్కలను ఒక్కొక్కటి 7/- చొప్పున సంగారెడ్డి ఉద్యాన శాఖ నర్సరీ నుంచి కొనుగోలు చేసి 2006 సంవత్సరంలో నాటించాడు. రసాయనిక పద్ధతిలో మామిడి మొక్కలను పెంచుతూ వస్తున్న సందర్భంలో సేంద్రియ వ్యవసాయం గురించి తెలుసుకుని అందుకు సంబంధించిన మరింత సమాచారం కొరక వివిధ ప్రాంతాలలో తిరిగి అవగాహన కల్పించుకున్నాడు.

Mango Nursery

Mango Nursery

ఈ క్రమంలో హైదరాబాదు రాజేంద్రనగర్ లోని ఎన్ఎస్ఐపి హెచ్ఎమ్ (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్)లో జీవన ఎరువులు మరియు జీవ పురుగుమందులు గురించి శిక్షణ తీసుకుని అక్కడ మదర్ కల్చర్స్ సేకరించుకొని ఇంటి వద్ద సొంతంగా మదర్ కల్చర్స్ తయారు చేసుకొని తన మామిడి తోటకు ఉపయోగిస్తూ ఫలితాలు పొందిన తరువాత తోటి రైతులకు ఈ విజ్ఞానాన్ని అందించాలనే లక్ష్యంతో వివిధ ప్రాంతాలలో పర్యటిస్తూ జీవన ఎరువులను రైతు స్థాయిలో తయారు చేసుకొనే విధంగా తోటి రైతులకు తెలియచేస్తూ రైతులకు ఉచితంగా మదర్ కల్చర్స్ అందిస్తూ వస్తున్నారు.

ఈ క్రమంలో రైతునేస్తం ఫౌండేషన్ గుంటూరు వారు ఏర్పాటు చేసే శిక్షణ తరగతులలో కూడా పలు సార్లు పాల్గొని రైతులకు జీవన ఎరువుల గురించి అవగాహన కల్పించడంతోపాటు మదర్ కల్చర్స్ ఉచితంగా అందిస్తూవస్తున్నాడు. ఇదే క్రమంలో మిగతా సేంద్రియ పద్ధతులయిన వర్మికంపోస్టు, వర్మివాష్, ఆర్గానిక్ యూరియా, ఆర్గానిక్ డిఎపి మొదలగు వాటి గురించి తెలుసుకుని తన మామిడి సాగులో వినియోగిస్తూ తోటి రైతులకు వాటిపై అవగాహన కల్పిస్తూ వస్తున్నాడు. వివిధ రకాలు సేంద్రియ పద్దతుల గురించిన సమాచారాన్ని రైతునేస్తం వారి సహకారంతో పుస్తక రూపంలో ముద్రించి రైతులకు ఉచితంగా అందిస్తూ వస్తున్నాడు. ఒకవైపు శిక్షణ మరియు రెండవవైపు తన మామిడితోట సాగు ఈ రెండింటికి సక్రమంగా న్యాయం చేకూరుస్తున్నాడు

-Rakesh Jhadi
Ph.D. Research Scholar
Department of Agronomy
Bidhan Chandra Krishi Viswavidhyalaya
Contact no:9505410171

Also Read: Mango Pest Control: మామిడిలో చీడపీడల నివారణ చర్యలు.!

Must Watch:

Leave Your Comments

Green Manures : పచ్చిరొట్ట ఎరువులతో భూసారం పెరుగుదల.!

Previous article

Techniques in Fishing: చేపలు పట్టడం లో మెళుకువలు..!

Next article

You may also like