Tomato Farmer: పంట దిగుబడి వచ్చే సమయానికి అకాల వర్షాలు వల్ల రైతులు నష్టపోతున్నారు. లేదా పంట విత్తనాలు విత్తుకునే సమయంలో ఎక్కువ వర్షాలు, ఈదురు గాలుల వల్ల కూడా రైతులు పొలంలో పంటలు పండించలేకపోతున్నారు. ఎక్కువ వర్షాల వల్ల గత 15 రోజుల నుంచి కూరగాయల ధరలు పెరగడం చూస్తున్నాము. ధరలు పెరగడం సామాన్యులకి ఇబ్బందిగా మారిన, రైతులకి మాత్రం ఇది శుభవార్తగా ఉంది. ముఖ్యంగా టమాట పండించిన రైతులకి ధరలు పెరగడం మంచి లాభాలు వస్తున్నాయి. ఒకే రోజులో రైతులు టమాట పంటని అమ్ముకొని లక్షాధికారులు అవుతున్నారు.
Also Read: Telangana Rains: తెలంగాణాలో భారీ వర్షాలు – రెడ్ అలెర్ట్ ప్రకటన
ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం టమాట ధర 300 రెట్లు పెరిగింది. కొన్ని ప్రాంతాల్లో టమాట ధర 200 నుంచి 250 రూపాయల వరకు ఉంది. ఈ ధర టమాట రైతులని ఒకేసారి లక్షాధికారులుగా చేస్తుంది. కర్ణాటక రాష్ట్రం, కోలార్ జిల్లా, రైతు ప్రభాకర్ గుప్తా గారు రెండు రోజుల క్రితం టమాట పంట మార్కెట్లో అమ్ముకున్నారు. పంట దిగుబడి కూడా ఎక్కువ రావడంతో 2000 టమాట బాక్స్ అమ్మారు. ఒక బాక్స్ ధర 1900 రూపాయలుగా మొత్తం 2000ల బాక్స్కి 30 లక్షల రూపాయల ఆదాయం వచ్చింది. మంచి దిగుబడితో పాటు ఎక్కువ ధరకి పంటని అమ్ముకోవడంతో రైతులకు మంచి ఆదాయం వస్తుంది.
వెంకటరమణా రెడ్డి రైతు 54 బాక్స్‌ల దిగుబడిని వచ్చింది. 15 కిలోల టమాట ధర 2200 రూపాయలు. దాదాపు 20 లక్షల వరకు ఆదాయం వచ్చింది. ప్రస్తుతం టమాట పండించిన రైతులు తమ పంట అమ్ముకొని ఒక రోజులోనే ధనవంతులు అవుతున్నారు.
Also Read: The World’s Most Expensive Cow: ఆంధ్రప్రదేశ్లో పెరిగే ఈ ఆవులు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనది..