Young Farmer Success Story: భారతదేశంలో నిరుద్యోగం పెద్ద సమస్యగా మారింది. విద్యావంతులు సైతం ఉద్యోగాలు పొందలేక అనేక ఇబ్బందులు పడుతున్నారు.అయితే ఈ మధ్యకాలంలో అలాంటి యువత చాలా మంది బయటకు వస్తున్న పరిస్థితి. పట్టు వదలని వారు సొంతంగా వ్యాపారం చేసి నేడు బంపర్ లాభాలు ఆర్జిస్తున్నారు.
అశుతోష్ దీక్షిత్ ఉత్తరప్రదేశ్‌లోని ఇటావా జిల్లా వాసి. అతను 2017 సంవత్సరంలో సివిల్ ఇంజనీరింగ్ కోర్సు నుండి తన B.Tech పూర్తి చేసాడు. ఆ తర్వాత ఉద్యోగం వెతికాడు. అయితే ఏడాది గడిచినా ఉద్యోగం రాలేదు. అయితే దీని తర్వాత కూడా అశుతోష్ పట్టు వదలలేదు. అతను తన గ్రామానికి తిరిగి వచ్చి పశుపోషణ వ్యాపారం ప్రారంభించాడు
Also Read: మహోగని చెట్ల పెంపకం ద్వారా కోట్లలో ఆదాయం
రాజస్థాన్‌లోని బికనీర్‌లో అప్పు చేసి నాలుగు సాహివాల్ ఆవులను కొనుగోలు చేశాడు. నాలుగు ఆవులతో ప్రారంభమైన అతని వ్యాపారంలోకి ప్రస్తుతం 3 ఏళ్లలోపే 70 ఆవుల గోశాల తయారైంది. వందల లీటర్ల పాలను గ్లాస్ బాటిళ్లలో ప్యాకింగ్ చేసి నగరంలో సరఫరా చేస్తూ చక్కటి లాభాలు గడిస్తున్నారు అశుతోష్.
అశుతోష్ పరిసర ప్రాంతాల్లో చుట్టూ అటవీ సమూహమే కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఆవులకు మేత సమస్య ఉండదు. నెయ్యి కూడా సాధారణం కంటే 3 రెట్లు ఎక్కువ ధరకు విక్రయించబడుతుందని అశుతోష్ చెప్పారు ఆవు పేడతో కలప, ఎరువు తయారు చేసి వ్యాపారం మొదలు పెట్టానని తెలిపారు అశుతోష్. అశుతోష్ దీక్షిత్ కాన్పూర్‌లోని పిఎస్‌ఐటి కళాశాల నుండి సివిల్ ఇంజనీరింగ్ చేశానని చెప్పాడు ఉద్యోగం రాకపోతే ఈ వ్యాపారం మొదలుపెట్టాను.
ఈరోజు ఆవుల సంఖ్య 70. కోచ్ బాటిల్ లో ప్యాక్ చేసిన పాలను లీటరు రూ.50కి విక్రయిస్తున్నాను. ఒక నెలలో ఒక లక్ష కంటే ఎక్కువ లాభం మరియు సంవత్సరానికి 12 నుండి 13 లక్షల రూపాయల వరకు సంపాదిస్తున్నాను అని తన జర్నీని వివరించాడు. ఉద్యోగం కోసం సమయం వృధా చేయకుండా రిస్క్ తీసుకుని పశుపోషణ ప్రారంభించి లక్షల ఆదాయాన్ని అందుకుంటున్నాడు అశుతోష్. అశుతోష్ తన తోటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు.
Also Read: మేకల పెంపకం రైతులకు అందుబాటులో మొబైల్ యాప్స్