Crops Growth Period In Agriculture విశాలమైన భారతదేశంలో వ్యవసాయం ప్రాధాన్యమైనదిగా చెప్పుకోవచ్చు. అనేక పంటలకు మన నేల అనుకూలం. మన దేశం నుంచి పంట ఉత్పత్తుల్ని విదేశాలకు ఎగుమతి చేస్తూ మన దేశ కీర్తిని చాటుతున్నారు రైతులు. ఇక ప్రభుత్వాలు కూడా వ్యవసాయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని వ్యవసాయ సంక్షేమం కోసం పథకాలను ప్రవేశపెడుతున్నాయి. దేశానికి అన్నం పెట్టే రైతు బాగుంటే దేశం బాగుంటుందన్న ఆలోచనతో రైతు సంక్షేమం కోసం కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు రైతు బంధు, రైతుభరోసా, పీఎం కిసాన్ నిధి తదితర పథకాలను తీసుకొచ్చింది. అదేవిధంగా ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంట నష్టపోతే వారికి నష్టపరిహారం అందిస్తున్నాయి ప్రభుత్వాలు.
ఇకపోతే పంట వేసిన నాటి నుండి పంటను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తుంటాడు రైతు. ఆరుగాలం పండించిన పంట చేతికొస్తే రైతు ఎంతో తృప్తి పడతాడు. ఇక పంటల విషయానికి వస్తే సాధారణంగా మన దేశంలో పంటలను మూడు రకాలుగా చూడవచ్చు.
ఆహార పంటలు: వరి, గోధుమ, జొన్న, మొక్కజొన్న, బార్లీ
వాణిజ్య పంటలు: పత్తి, చెరుకు, జనుము, పొగాకు
తోట పంటలు: కాఫీ, తేయాకు, రబ్బరు. కొబ్బరి, పండ్ల తోటలు.
అయితే ఏ ఏ పంటలు ఎంత కాలానికి చేతికి వస్తాయి, వాటి వృద్ధి కాలం ఎంత అన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.. Crops Growth Period
వరి : 90 నుంచి 150 రోజులు
క్యాబేజి : 120 నుంచి 140 రోజులు
క్యారెట్ : 100 నుంచి 150 రోజులు
పత్తి : 180 నుంచి 195 రోజులు
వాటర్ మెలోన్ : 120 నుంచి 160 రోజులు
బఠానీ : 90 నుంచి 100 రోజులు
వేరుసెనగ ; 130 నుంచి 140 రోజులు
ఆలుగడ్డ : 105 నుంచి 145 రోజులు
ముల్లంగి: 35 నుంచి 45 రోజులు
సోయాబీన్ : 135 నుంచి 150 రోజులు
చెరుకు : 270 నుంచి 365 రోజులు
పొద్దుతిరుగుడు : 125 నుంచి 130 రోజులు
పొగాకు : 130 నుంచి 160 రోజులు
టమాటా : 135 నుంచి 180 రోజులు
అరటి : 300 నుంచి 365 రోజులు
బీన్స్ : 75 నుంచి 90 రోజులు
సిట్రస్ : 240 నుంచి 365 రోజులు
దోసకాయ : 105 నుంచి 130 రోజులు
మొక్కజొన్న స్వీట్ : 80 నుంచి 110 రోజులు
మొక్కజొన్న ధాన్యం : 125 నుంచి 180 రోజులు
Agriculture Daily News, Today Agriculture Updates, Eruvaaka Live