Cotton Corporation : ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సహకారంతో కాటన్ కార్పొరేషన్ అఫ్ ఇండియా (సి.సి.ఐ.) వారు రాష్ట్రంలో 2024-25 సీజన్ కు సంబదించి పత్తి కొనుగోలు కోసం రైతులు రైతు సేవా కేంద్రాలలో నమోదును 27 అక్టోబర్ 2024 నుంచి ప్రారంభించారు. కాబట్టి రైతులు తమ పంట వివరాలను రైతు సేవా కేంద్రాలలో నమోదు చేసుకోవాల్సిందిగా అవగాహన కల్పించారు. సి.సి.ఐ. నిర్దేశించిన నాణ్యత ప్రమాణాల మేరకు ఉన్న పత్తిని మాత్రమే కొనుగోలు చేస్తుంది గనుక రైతులు నాణ్యమైన విడి పత్తిని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని మార్కెటింగ్ శాఖ సూచిస్తోంది. ఈ విషయమై వ్యవసాయ, మార్కెటింగ్ శాఖామాత్యులు సమీక్షించి రైతులకు సరైన అవగాహన కల్పించి మద్దతు ధరకు పత్తిని సి.సి.ఐ. వారికి విక్రయించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలియజేశారు. ఖరీప్ 2024- 25 సీజన్ కు సంబంధించి భారత ప్రభుత్వం ప్రకటించిన పత్తి కనీస మద్దతు ధరలు…క్వింటాలుకు పొడవు పింజ రకాలకు రూ.7521/-, పొట్టి పింజ రకాలకు రూ.7121/- గా ఆంధ్ర ప్రదేశ్ మార్కెటింగ్ శాఖ తెలియజేస్తుంది.
Read More : http://పత్తి రైతులకు మేలు చేసే అన్ని చర్యలు తీసుకుంటాం…