Arka Savi Rose Cultivation: రైతులు కొత్త కొత్త పంటలు పండించడానికి ప్రయోగిస్తున్నారు. లాభాలు వచ్చే పంటలని మాత్రమే పండిస్తున్నారు. రైతులు ప్రయోగించడానికి కొత్త రకం గులాబీ పువ్వుల సాగు చేస్తున్నారు. ఈ కొత్త రకం గులాబిని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసెర్చ్ బెంగళూరు వాళ్ళు తయారు చేశారు. ఈ గులాబీ పువ్వులను రంగారెడ్డి జిల్లా, అగర్మీనగూడెం గ్రామంలో అడిఫాహ్మద్ రైతు ఈ కొత్త గులాబీ సాగు చేస్తున్నారు. ఈ కొత్త గులాబీని ఆర్కా సవి గులాబీ అంటారు.
ఈ రైతు పెద్ద మొత్తంలో ఆర్కా సవి గులాబీ రకం సాగు చేస్తున్నారు. ఆర్కా సవి గులాబీ ఒక ఎకరంలో దాదాపు 2200 మొక్కలు నాటుకోవచ్చు. మొక్కల మధ్య దూరం 2.5 అడుగులు ఉండాలి. వరుసల మధ్య ఎనిమిది అడుగుల దూరం ఉండాలి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసెర్చ్ నుంచి ఈ మొక్కలు తెచ్చుకున్నారు. ఒక మొక్క 40 రూపాయల ఖరీదు ఉంది. ఎకరం పొలంలో 2200 మొక్కలు నాటడానికి లక్ష రూపాయల వరకు ఖర్చు వస్తుంది.
Also Read: Drum Seeder: రైతులకి కూలీల బాధ తగ్గిస్తున్న ఈ వరి పరికరం..
మొక్కలు నాటిన ఎనిమిది నెలల తర్వాత ఆర్కా సవి గులాబీ పువ్వులు పూస్తాయి. ఆర్కా సవి గులాబీ మొక్కలు డ్రిప్ ద్వారా నీళ్లు అందించారు. డ్రిప్ ఇరిగేషన్ నుంచి మొక్కలకి నీటిని అందించడం వల్ల నీటిని వృధా చేయడం తగ్గుతుంది. రోజు మర్చి రోజు ఆర్కా సవి గులాబీలు కోసుకోవచ్చు. రోజు మర్చి రోజు ఈ పువ్వులు కోయడం వల్ల దాదాపు 10 కిలోల దిగుబడి వస్తుంది. ఈ పువ్వులు పెద్ద పెద్ద నగరాలు ఎగుమతి చేస్తున్నారు.
ఆర్కా సవి గులాబీ పువ్వులు మార్కెట్లో ఒక కిలో 100 రూపాయలకు అమ్ముతున్నారు. ఈ గులాబీ పువ్వులు 2-3 రోజులు ఉంచిన కూడా వాటి రెక్కలు రాలిపోవు. వేరే గులాబీ పువ్వులతో పోలిస్తే ఆర్కా సవి గులాబీ ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఈ పువ్వులని ప్రస్తుతం హైదరాబాద్ నగరానికి ఎక్కువ మొత్తంలో ఎగుమతి చేస్తున్నారు. ఆర్కా సవి గులాబీ పువ్వులు మార్కెట్లో ఎక్కువ ధర ఉండడంతో రైతులు కూడా మంచి లాభాలు పొందుతున్నారు.
Also Read: Turmeric Digging: పసుపు తవ్వడానికి రైతులు ఈ పరికరాని వాడితే పంట నాణ్యత పెరుగుతుంది.!