Mulberry Fruits: మల్బరీ పండ్లు… ఈ మధ్య కాలంలో ఈ పండ్ల పేరు చాలా వింటున్నాము. మార్కెట్లో కూడా మంచి డిమాండ్ ఉన్న పండు. వీటి రేట్ కూడా అలానే ఉంది. రోజు మార్కెట్‌కి వచ్చి రైతులు ఈ పండ్లకి ఉన్న డిమాండ్‌ని చూసి రంగారెడ్డి జిల్లా సరస్వతిగూడ గ్రామం రైతులు అందరూ మల్బరీ పండ్లు సాగు చేస్తున్నారు. ఈ గ్రామంలో ప్రతి ఒక రైతు దాదాపు అర ఎకరం పొలంలో సాగు చేస్తున్నారు.
మల్బరీ పండ్లు సాగు చేయడానికి విత్తనాలు ఉండవు. మల్బరీ పండ్లు చెట్టు కొమ్మని తీసి మొక్కల నాటుకోవాలి. మల్బరీ చెట్టు ఎక్కువగా పట్టు పరుగులకి ఆహారం కోసం సాగు చేస్తారు. పట్టు పరుగులకు ఆహారంగా నాటుకునే మొక్కలు ఒక అడుగు దూరంలో నాటుకోవాలి. మల్బరీ పండ్ల కోసం నాటుకునే మొక్కలు 15 అడుగుల దూరంలో నాటుకోవాలి .

Mulberry Farming
గత రెండు మూడు సంవత్సరాల వరకు ఈ పండ్లు కిలో 1000-1200 ఉండేది. ఇప్పుడు కిలో 200-250 వరకు అమ్ముతున్నారు. అర ఎకరంలో 120 మొక్కల వరకు నాటుకోవచ్చు. మొక్కలు నాటుకున్నాక 10 నెలల తర్వాత పండ్లు వస్తాయి. ఒక చెట్టు నుంచి ప్రతి రోజు ఈ పండ్లు అమ్ముకొని దాదాపు 500 రూపాయలు ఆదాయం పొందవచ్చు.
Also Read: Electric Issurrai: ఇసుర్రాయి..కొత్త పద్దతిలో ఇలా వచ్చాయి.!
ఈ పండ్లు ప్రతి కాలంలో వస్తాయి. ఎలాంటి వాతావర్ణంలో అయిన వస్తాయి. కానీ ఎక్కువ వర్షాలు ఉంటే దిగుబడి తగ్గుతుంది. ప్రతి చెట్టుని 45 రోజులకి ట్యూనింగ్ చేసుకోవాలి. ట్యూనింగ్ అంటే చెట్టు ఆకులు మొత్తం తీసివేయాలి. మళ్ళీ 45 రోజులకి పూత వస్తుంది. ఈ పండ్లని పిట్టలు, పక్షులు ఎక్కువగా తింటాయి. వీటి నుంచి ఈ పండ్లని కాపాడుకోవడానికి చేపల వల పొలం చుట్టూ, చెట్ల పై భాగంలో కూడా కట్టుకోవాలి.

Mulberry Fruits
అర ఎకరం పొలం నుంచి 40-50 కిలోల దిగుబడి ప్రతి రోజు వస్తుంది. రోజు ఆదాయం కూడా 5000 వరకు వస్తుంది. అంటే 45 రోజులో ఒక లక్ష రూపాయల వరకు ఆదాయం పొందవచ్చు. ఈ చెట్లకి ఎలాంటి చీడ పురుగులు పట్టవు. సంవత్సరానికి ఒకసారి సేంద్రియ ఎరువులు వేసుకుంటే దిగుబడి పెరుగుతుంది. హోటల్స్, జ్యూస్ సెంటర్ రైతులతో కాంట్రాక్టు పద్దతిలో ఈ పండ్లని కొన్నుకుంటున్నారు. దాని వల్ల రవాణా ఖర్చులు కూడా తగ్గి రైతులకి మంచి ఆదాయం వస్తుంది.
Also Read: Mic for Protect Crops from Birds: రైతులు పంటని పక్షుల నుంచి కాపాడుకోవడానికి కొత్త పరికరం..