Woman Farmer Success Story: పశ్చిమ గోదావరి జిల్లా, చింతలపూడి మండలం, శివాపురం గ్రామానికి చెందిన కర్రి శాంతకుమారికి తొమ్మిదో తరగతి చదువుతున్న ప్పుడే పెళ్ళి జరిగింది. ఆమె భర్త అప్పులు చేసి పంటవేయడం, పంట చేతికి రాగానే అప్పులు తీర్చడం చేసేవారు. వ్యవసాయం సజావుగా సాగ లేదు. చేసిన అప్పులు తీర్చలేక భర్త హఠాత్తుగా పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఒకవైపు అప్పులు, మరోవైపు చిన్న పిల్లలు. దిక్కు తోచని పరిస్థితి. అప్పులు తీర్చుటకు ఏదో ఒకటి చేయాలనే తపన. పోయిన చోటే వెతుక్కోవాలని నిశ్చయించుకున్నారు. భర్త వదిలేసిన నేలతల్లినే నమ్ముకోవాలనుకున్నారు. ఎవరిని అడిగినా అప్పు పుట్టలేదు. అయినా కృతనిశ్చయంతో ముందుకు సాగారు. ఉపాధి హామి పథకం కింద నిమ్మతో టలో అంతరపంటగా బంతి, చేమంతి, క్యాబేజి, కాలిఫ్లవర్, కొత్తిమీర, టొమాటో, బెండవంటి కూర గాయ పంటలను వినూత్నంగా సాగుచేస్తూ లాభాల బాటలో పయనిస్తున్నారు.
కర్రి శాంతకుమారికి 5 ఎకరాల భూమి ఉంది. 3 ఎకరాలు మెట్టభూమి. పత్తిసాగుతో వ్యవ సాయం మొదలు పెట్టారు. ఆ పంట ద్వారా ఆశిం చిన దిగుబడిరాలేదు. ఓసారి ఈటీవీ అన్నదాత కార్యక్రమంలో బంతిపూలసాగు గురించి చూసి ఆ పంటసాగు చేయాలనుకున్నారు. మొదట 25 సెంట్ల భూమిలో బంతిసాగు మొదలు పెట్టి తరు వాత 50 సెంట్లకు పెంచుకొని లాభాలు గడించారు. రెండోసారి సాగుచేసినప్పుడు రూ.65వేలకు పైగా ఆదాయం వచ్చినట్లు తెలిపారు.
బెంగళూరు నుంచి హైబ్రిడ్ బంతి విత్తనం తెప్పించుకొని వేసుకున్నారు. నారుమడిపోసు కొని 25 రోజుల తరువాత పొలంలో నారును 35-35 సెం. మీల ఎడంలో నాటుకున్నారు. మొక్కలు నాటిన 15 రోజుల తరువాత డి.ఎ.పి,కాంప్లెక్స్ ఎరువులను వాడారు. పూర్తిగా రసాయన ఎరువులపై ఆధారపడకుండా తానే స్వయంగా తయారుచేసుకున్న జీవామృతాన్ని తోట పెరిగేకొద్ది అవసరాన్ని బట్టి వివిధ మోతాదుల్లో వేసుకున్నట్లు తెలిపారు. పురుగు నివారణకు పచ్చిమిర్చి, వెల్లుల్లి కషాయాన్ని, కుళ్ళు తెగులు నివారణకు మైలతుత్తం, బ్లీచింగ్ పొడి కలిపి వాడినట్లు చెప్పారు. పూలు బాగా రావడానికి మొగ్గదశలో 13-0-45 వేశారు. ఖర్చులు పోను 30 సెంట్ల నుంచి సుమారుగా 20 వేలకు పైగా ఆదాయం గడిస్తున్నారు.
తక్కువ నీటి వసతి గల మూడెకరాల మెట్టభూ మిలో ఉపాధిహామి పథకం కింద నిమ్మతోటలు వేసుకొని దానిలో అంతర పంటలుగా బంతి, చేమంతి, కాలిఫ్లవర్, కొత్తిమీర, తోటకూర, బెండ, బీర, ఆనప, మిరప వంటి కూరగాయలను పండిస్తూ అదనపు ఆదాయాన్ని గడిస్తున్నారు.
విద్యుత్ సరఫరాలో ఆటుపోట్లు, నీటిసమస్య పరిష్కారానికి అప్పుచేసి రూ.50 వేల ఖర్చుతో నీటి తొట్టెని ఏర్పాటు చేసుకున్నారు. తరువాత పంట ద్వారా వచ్చిన లాభంతో అప్పుతీర్చినట్లు తెలిపారు. ఆమెను చూసి తోటి రైతులు కూడా నీటి తొట్టెలు ఏర్పాటు చేసుకున్నారు.
పద్నాలుగు ఏళ్ళ ఆమె కృషి ఫలించింది. ఉపా ధిహామి పథకం కింద సాగుచేసిన 150 మంది ఉత్తమ రైతుల్లో ఈమె ఒకరుగా నిలిచారు. నిమ్మ తోటల్లో పలురకాల అంతరపంటలు సాగు, సేద్యపు నీటి కుంటలు ఏర్పాటు, బంతిలో ఉత్తమ రైతు అవార్డు మొదలైన కార్యక్రమాలు ప్రధానమం త్రిని స్వయంగా కలుసుకుని, ఆయన ప్రశంసలు పొందడానికి కారణమయ్యాయి. ఇంతకంటే ఒక ఒంటరి మహిళకు కావాల్సినది ఏమిటి.
Also Read: Vegetable Cultivation: వేసవిలో తీగజాతి కూరగాయల సాగులో మెళుకువలు.!
Must Watch: