రైతులు

Farmer Success Story: వ్యాపారరంగం నుంచి వ్యవసాయo వైపు అడుగులు వేసిన రైతు.!

0
Indian Farmer
Indian Farmer

Farmer Success Story: వ్యవసాయ నేపద్యానికి చెందిన అప్పిరెడ్డి మంచి చదువులు చదివి వ్యాపారరంగంలో అడుగుపెట్టటం జరిగింది. వ్యాపారాలు చేస్తున్నా కూడా వ్యవసాయ రంగాన్ని వదలకుండా కొంత వ్యవసాయాన్ని కొనసాగిస్తూ వస్తున్నాడు. కొన్ని కారణాల వలన తన వ్యాపారాన్ని తగ్గించుకుంటూ వస్తూ వ్యవసాయాన్ని పెంచుకుంటూ వస్తున్నాడు. ఇంకొంత కాలానికి తన వ్యాపారాన్ని పూర్తిగా వదలివేసి తన సమయాన్ని పూర్తిగా వ్యవసాయం మరియు దాని అనుబంధ రంగాలకు కేటాయించాలనే లక్ష్యంతో అటువైపు తన అడుగులు వేగంగా వేస్తున్నాడు.

Farmer Success Story

Farmer Success Story

12 ఎకరాలలో వివిధ రకాల మామిడి మొక్కలు నాటించినాడు. లైనుకి లైనుకి మరియు మొక్కకి మొక్కకి 25 అడుగులు ఉండేలా 4 అడుగుల వెడల్పు, పొడవులతో ఉండేలా గుంతలు తీసుకుని అందులో బాగా మాగిన పశువుల ఎరువు వేసి మామిడి మొక్కలు నాటించినాడు. మొక్కలు నాటిన 2 సంవత్సరాల తరువాత విపరీతమైన కరువు వచ్చి నీరు అందుబాటులో లేక నీరు ఇవ్వటం కుదరలేదు. అయినా కాని ఒక్క మొక్క కూడా చనిపోలేదు. ప్రస్తుతం మామిడి మొక్కల వయసు 6 సంవత్సరాలు. మామిడి మొక్కలకి ఇప్పటి వరకు ఎటువంటి మందులు పిచికారి చేయలేదు. పాదులలో కూడా మొదట్లో పశువుల ఎరువు వేశారు. తరువాత పశువుల ఎరువు కూడా వేయలేదు. మామిడి మొక్కలను పూనింగ్ చేయించి ఆకులను పార్టీలో వేయించి మట్టి కప్పడం జరుగుతుంది. గత సంవత్సరం వచ్చిన మామిడి కాయలని రూ. 1,50,000/- లకు అమ్మటం జరిగింది. ప్రస్తుతం మామిడి చెట్లు కాపులో ఉన్నాయి. కారణాలు ఏమైనా కాని ఈ సంవత్సరం మామిడి దిగుబడి సరిగ్గా రాలేదు.

Also Read: Farmer Success Story: సేంద్రియ బాట లో లాభాలు పొందుతున్న రైతు.!

తోటి రైతులు ఈ ప్రాంతంలో అల్లనేరేడు పంట సాగు చేస్తూ ఆశాజనకమైన దిగుబడులు సాధించటం చూసి అప్పిరెడ్డి కూడా అల్లనేరేడు పంట 12 ఎకరాలలో వేసి అందులో అంతరపంటగా జామ, అక్కడక్కడ సపోటా తదితర పంటలు వేయటం జరిగింది.

Allaneredu crop

Allaneredu crop

లైనుకి లైనుకి మరియు మొక్కకి మొక్కకి 30 అడుగులు ఉండేలా నేరేడు మొక్కలు నాటించినాడు. మామడిలో మాదిరిగానే గుంతలు తీయించి ఆ గుంతలలో మాగిన పశువుల ఎరువు వేయించి నేరేడు మొక్కలు 2017 జూన్ మాసంలో నాటించడం జరిగింది. నేరేడులో అంతర పంటలుగా జామ, సపోటలతో పాటు పొలంలో అక్కడక్కడ కొబ్బరి, యాపిల్ రేగు తదితర మొక్కలు నాటించి అన్నింటిని సేంద్రియ పద్ధతిలో పండిస్తున్నారు.

ప్రస్తుతం ఒక ఆవుని పోషిస్తున్నాడు. ఆవుల యొక్క వ్యర్థాలతో వివిధ రకాల కషాయాలు, ద్రావణాలు తయారు చేసుకుని ఉపయోగిస్తున్నాడు. ముందుముందు ఇంకా కొన్ని ఆవులను కొనాలనే ఆలోచనలో అప్పిరెడ్డి ఉన్నాడు. వ్యవసాయంతో పాటు కొన్ని నాటుకోళ్ళను పెంచుతున్నాడు. పొలంలో ఒక ఫాంపాండ్ ఉంది.

-Rakesh Jhadi
Ph.D. Research Scholar
Department of Agronomy
Bidhan Chandra Krishi Viswavidhyalaya
Contact no:9505410171

Also Read: Farmer Success Story: ప్రకృతి వ్యవసాయంతో కరివేపాకు సాగు చేస్తున్న యువరైతు.!

Must Watch:

Leave Your Comments

Health Benefits of Aloevera: చేదుగా ఉండే కలబందతో చెప్పలేనన్ని ప్రయోజనాలు!!

Previous article

Tulsi Health Benefits: పూజకి ఉపయోగించే “తులసి మొక్క”తో పుష్కలమైన లాభాలు!

Next article

You may also like