Sri Potti Sriramulu’s 70th Birth Anniversary: ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, లాం లో ప్రత్యేక ఆంధ్రరాష్ట్ర పోరాట యోధుడు, భాష ప్రయుక్త రాష్ట్రాలకు కారణభూతుడైన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు 70వ వర్ధంతిని పురస్కరించుకొని విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డాక్టర్ జి.. రామారావు గారు, పరిశోధన సంచాలకులు డా. ఎల్.ప్రశాంతి గారు శ్రీ పొట్టి శ్రీరాములు చిత్రపటానికి నివాళులు అర్పించి, పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని రిజిస్ట్రార్ డాక్టర్ జి. రామారావు గారు మాట్లాడుతూ అమరజీవి పొట్టి శ్రీరాములు మహాత్మా గాంధీజీ సబర్మతి ఆశ్రమంలో 25 సంవత్సరాల ప్రాయంలో చేరి, గాంధీజీ ప్రవచించిన సత్యం, అహింసా మరియు హరిజనోద్ధరణ అనే ఆశయాలకోసం పనిచేసిన ధన్యజీవి అని తెలిపారు.

Sri Potti Sriramulu’s 70th Birth Anniversary
ఈ సందర్భముగా పలువురు వక్తలు ఈయన గాంధీజీ చేపట్టిన ఉప్పు సత్యాగ్రహం మరియు క్విట్ ఇండియా ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారని, జైలుకు కూడా వెళ్లారని తెలిపారు. మద్రాస్ లోని అన్నీ దేవాలయాలలో దళితుల ప్రవేశాన్ని కోరుతూ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టినప్పటికి, గాంధీజీ కోరిక మేరకు విరమించడం జరిగిందన్నారు. అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం అక్టోబర్ 19 నుండి అమరణ నిరాహారదీక్ష చేపట్టి 1952 డిసెంబర్ 15న అర్థరాత్రిన ఆశువులు బాసారని తెలిపారు. తదనంతరం మద్రాస్ నుండి విశాఖపట్నం వరకు జరిగిన చెలరేగిన ఆందోళనల నేపథ్యంలో 1952 డిసెంబర్ 19న, నాటి మనదేశ ప్రధానమంత్రి దివంగత శ్రీ పండిట్ జవహర్ లాల్ నెహ్రూకు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ప్రకటన చేయక తప్పింది కాదన్నారు. ఆయనను గురించి మహాత్మా గాంధీజీ మాటలలో చెప్పాలంటే ఇటువంటి గొప్పవ్యక్తులు కొంత మంది ఉన్న భారతదేశానికి స్వాతంత్రం ఎప్పుడో వచ్చి ఉండేదన్నారు. కాబట్టే అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు ధన్యజీవి మరియు చిరస్మరణీయులు అయ్యారన్నారు. బోధన, బోధనేతర మరియు సహాయ సిబ్బంది పాల్గొన్నారు.
Also Read: Koheda Market: కోహెడ మార్కెట్ నిర్మాణానికి తుది ప్రణాళిక సిద్దం.!
Also Watch: