2 Lakh Farmers Are Newly Added To The Rythu Bandhu Scheme తెలంగాణ రైతులకు ఆర్ధిక చేయూత కోసం ప్రవేశపెట్టిన పథకమే రైతుబంధు. సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న రైతుబంధు పథకం అర్హులైన ప్రతిఒక్కరికీ చెందాలని, ఎటువంటి మధ్యవర్తులు లేకుండా నేరుగా రైతుల ఖాతాల్లోకి చేరాలని ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం ద్వారా రైతులకు పెట్టుబడి పరంగా ఎంతో మేలు జరుగుతుంది. ముఖ్యంగా సన్నకారు రైతులకు ఆర్ధిక భరోసా కల్పిస్తుందీ పథకం. కాగా తెలంగాణాలో ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని పలు రాష్ట్రాల్లో అమలు చేస్తున్న వైనం. ఇక ఈ ఏడాది తెలంగాణాలో మరో 2 లక్షల మంది రైతులకు ఈ పథకం వర్తించనుంది. రాష్ట్ర రైతులకు ఎకరానికి 5వేల రూపాయల చొప్పున కోటిన్నర ఎకరాలకు తెలంగాణ ప్రభుత్వం నిధులు విడుదల చేయనుంది. 2 Lakh Farmers
CM KCR తాజాగా సంబంధిత అధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుబంధుపై రివ్యూ నిర్వహించారు. అధికారుల నుంచి ప్రతిపాదనలు స్వీకరించిన సీఎం ఈ ఏడాది మరో రెండు లక్షల మంది రైతులకు ఈ పథకం వర్తింపజేయాలని భావించారు. అందులో భాగంగా సుమారు లక్ష ఎకరాల భూమి రైతుబంధు జాబితాలోకి చేరనుంది. కాగా ఈ నెలాఖరులోగా రైతు ఖాతాల్లోకి రైతుబంధు సొమ్ము జమ అవ్వనుంది. ధరణి పోర్టల్ లో భూ వివాదాలు సద్దుమణిగిన కారణంగా త్వరితగతిన రైతుబంధు అమలు చేయాలనీ సీఎం కెసిఆర్ అధికారుల్ని ఆదేశించారు. Rythu Bandhu Scheme
Telangana Farmers అయితే గత సీజన్లో 60, 84 లక్షల మంది రైతులకు రూ. 7,360,41 కోట్లను రైతుబంధు స్కీమ్ కిందా పంపిణి చేయగా… ఈ సీజన్లో సుమారు రూ.7500 కోట్ల వరకు అవసరం పడనుంది. ఇక ఇప్పటికే ఈ సీజన్లో అర్హులైన రైతుల్ని గుర్తించిన అధికారులు ఓ అంచనాకి వచ్చినట్టు సమాచారం. మరో విశేషం ఏంటంటే. రెవెన్యూశాఖ నుంచి రైతులు, భూమి వివరాలను సేకరిస్తున్నారు. Rythu Bandhu Latest News