రబీ వేరుశనగ 1.5 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేయబడుతుంది. ఈ పంటలలో విత్తిన తదుపరి చర్యలలో కలుపు ప్రధానమైనది.
కలుపు యాజమాన్యం : – వేరుశనగలో ఒక ఊద, తుంగ, గరిక, గడ్డి, మొదలగు కలుపు మొక్కలు పంటను ఆశిస్తాయి. పంట విత్తిన 30 – 50 రోజుల వరకు కలుపు లేకుండా ఉంచినచో అధిక దిగుబడులు గణించవచ్చు. కలుపు మొలకెత్తక ముందు అలా క్లోర్ ఎకరానికి లీటర్ లేదా పెండిమిథాలిన్ మీద 30% ఇ.సి ఎకరాకు 750 ml ఒక లీటరు చొప్పున 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి. విత్తిన 20 – 30 రోజుల దశలో గొర్రుతో అంతరకృషి చేసుకోవాలి. అలాగా మొక్కల మొదళ్లకు మట్టిని ఎగదోయాలి. విత్తిన 45 రోజుల వరకు ఎలాంటి కలుపు లేకుండా చూసి అనంతరం అంతర సేద్యం చేయకూడదు, లేనిచో దెబ్బతిని దిగుబడులు తగ్గుతాయి. పంట విత్తిన 20 రోజుల వరకు కలుపు తీయడం వీలుకాని పరిస్థితుల్లో పైరులో మొలచిన కలుపును ( వెడల్పాకు & గడ్డిజాతి ) రెండు మూడు ఆకుల దశలో ఉన్నప్పుడు ఇమిజాతాపిర్ 10% ఎకరాకు 300 మిల్లీ. లీటర్ల లేదా ఇమిజా మ్యాక్స్ 25% + ఇమిజా తాపిర్ 35% కలుపుమందును 40 గ్రా ఎకరాకు చొప్పున 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి అన్ని రకాల కలుపు మొక్కలను నివారించుకోవచ్చు.
Also Read : వెంకయ్య…కేంద్రం వడ్లు తీసుకోమంటుంది ఏం చేద్దాం మరి!
ఎరువుల యాజమాన్యం : భూసార పరీక్షలు అనుసరించి ఎరువుల మోతాదును నిర్ణయించుకోవాలి. ఆఖరి దుక్కిలో ఎకరాకు 3 – 4 టన్నుల పశువుల ఎరువును వేసుకోవాలి. మొత్తం భాస్వరం,పొటాష్ ఎరువుల ఆఖరి దుక్కిలో వేసుకోవాలి ఎకరానికి 100 కిలోల సూపర్ ఫాస్ఫేట్ 33 కిలోల మ్యూరెట్ ఆఫ్ పొటాష్ మరియు 18 కిలోల యూరియా విత్తిన సమయంలో వేసుకోవాలి. విత్తిన 30 రోజుల తర్వాత తొలి పూత దశలో మరో 10 నుండి 15 కిలోల యూరియాని వేసుకోవాలి. ఎకరానికి 200 కిలోల జిప్సంను పూత దశ పూర్తయి ఊడలు దిగే సమయంలో మొదళ్ళ దగ్గర వేసే మట్టిని ఎగదోయా నేల ద్వారా సంక్రమించే తెగుళ్లను నివారించుటకు 2 కిలోల ట్రైకోడెర్మా విరిడి అనే జీవ శిలీంధ్ర నాశిని నీ 100 కిలోల పశువుల ఎరువులో కలిపి 10 రోజులు మూగబెట్టి ఆఖరి దుక్కిలో వేసుకోవాలి.
నీటి యాజమాన్యం : వేరుశనగ పంటకు మొత్తం 450 – 600 మిల్లీ లీటర్ల నీరు అవసరమవుతుంది. తేలిక నేలల్లో 6 – 8 తడులు ఇవ్వవలసి ఉంటుంది. విత్తే ముందు నేల బాగా తడిగా ఉండేలా నీరు పెట్టుకుని రెండవ తడి మొలకెత్తిన 20 – 25 రోజులకు ఇవ్వాలి. నేల లక్షణాన్ని బట్టి 7 నుండి 10 రోజుల వ్యవధిలో ఇవ్వాలి. చివరి తడి పంట కోతకు 4 – 7 రోజుల ముందు ఇవ్వాలి.
పైరుల ఊడలు దిగేదశ నుండి కాయలు ఊరే వరకు అనగా 45 – 50 రోజుల నుండి 85-90 రోజుల వరకు సున్నితమైనది. కనుక ఈ దశలో నీరు సక్రమంగా తగు మోతాదులో కట్టాలి నీటి తుంపర్లు (స్ప్రి౦క్లర్) ద్వారా ఇచ్చినట్లయితే దాదాపు 25% వరకు నీరు ఆదా అయి అధిక దిగుబడి మరియు నాణ్యమైన కాయలు తీసుకోవచ్చు. ఈ విధంగా యాజమాన్య పద్ధతులు పాటించి మంచి దిగుబడి సాధించవచ్చు.
డి.స్రవంతి , డా. పి.శ్రీలత, ఎమ్.మాధవి, శిరీష వ్యవసాయ కళాశాల, అశ్వరావుపేట
Also Read : వెదురు పిలకల కూర అద్భుతం