- పప్పు ధాన్యాలు ఆహారం లో మాంస కృతుల కొరతను తీర్చుతాయి . పెరిగే పిల్లలు నుండి వృద్దుల వరకు తీసుకునే ఆహారం లో తగినంత మాంస కృతులు లేనిచో పిల్లల్లో పెరుగుదల పెద్దల్లో దేహ దారుఢ్యం ఉండదు.
- ఈ పంట లో విటమిస్, ఖనిజాలు, కూడా ఎక్కువగా ఉన్నాయి. విటమిన్ A దాదాపు 3-4% ఉంటుంది.
- రోజు రోజుకు నిస్సరమవుతున్న సాగు భూములను పూర్వపు స్థితి కి తీసుకు రావడనికి కూడా అపరాల పంటలు ఎంతో మేలు చేస్తాయి.
- వేర్లు వాతావరణం లోని నత్రజనిని సంగ్రహించి వేరు బోడిపెలు ద్వారా నెలకు అందిస్తాయి.
- ఆకులు కాడలు కుళ్ళి సేంద్రియ పదార్థం గా మారి నేల భోతిక మరియు రాసాయనిక లక్షణాలను మెరుగు పరుస్తాయి. ఈ సూక్ష్మ జీవుల అభివృద్ధి కి తొడపడతాయి.
- ఈ సూక్ష్మ జీవులు నిరంతరం గా వాటి జీవ కార్య కలాపాలు జరుపుకొంటూ నేలను గుల్ల పరచి , తేమ ను నిల్వ ఉంచుకొని, నేలలో గల పోషకాలను మొక్కలు వినియోగించు కొనే విధం గా మార్చడం లో పాలు పంచు కొంటున్నాయి.
- పప్పు ధన్య పంటలు పశువుల మేత గా ఉపయోగ పడుతున్నాయి.
- ఈ పంటలు సాగు చేయడం
- ద్వారా కలుపు ఉధృతి తగ్గుతుంది.
- పప్పు ధన్యాల పంటలను సాగు చేయడం వల్ల నేల కోత అరికట్టి బడుతుంది.
Also Read:Green Manure Crops: పచ్చి రొట్ట ఎరువులు – సాగులో మెళకువలు అవరోధాలు.!
పంట సాగు లో సమస్యలు –
వాతావరణ పరిస్థితులు :
- అపరాల సాగు ను 92% వరకు వర్షధారం గా పండిస్తున్నారు
- కీలక దశ లో అధిక నీటి ఎద్దడీ కి మరియు ఎక్కువ ఉష్టగ్రత్త కు గురి కావడం జరుగుతుంది. అసాధారణ మరియు అసమాన వర్షాల వలన నీటి ఎద్దడికి మరియు నీటి ముంపు కు పంట గురికావడం జరుగుతుంది.
- నేల కోతకు గురైన సారవంతం కాని నేలలో అపరాలను పండించడం వలన తక్కువ దిగుబడులు వస్తున్నాయి.
- అపరాలు సున్నితమైన పంటలు . అవి ఆమ్లాత్వన్ని , క్షరత్వని, నీటి ముంపు ను తట్టుకోలేవు. ఎత్తున నీటి మట్టం ఉన్న ప్రాంతాల్లో పండించ దానికి పనికి రావు.
- అధిక ఉత్పాదకత గల రకాలు లేకపోవడం
- రైతులకు అపరాలు సాగు చేయడం పై అవగాహన లోపించడం
- అధిక మోతాదు లో కలుపు ఉధృతి ఉండడం
- పురుగులు, తెగుళ్లు ఎక్కువ గా ఆశించడం
- కోత తర్వాత గింజ నిల్వ సమయంలో పురుగులు ఆశించి నష్టం చేయడం
- కోత అనంతర సాంకేతిక పరిజ్ఞానం లో ప్రతికుల అంశాలు ఉండటం.
పప్పు ధన్యాల పంటలు పండించడం లో ప్రధాన అంశాలు :-
- అనువైన తక్కువ కాల పరిమితి మరియు అధిక దిగుబడి నిచ్చు వంగడాలను సాగు చేయడం ద్వారా ఎక్కువ విస్తీర్ణాన్ని అపరాలు సాగు లోనికి తీసుకు రావడం
- అపరాలు వర్షధార మరియు నీటి పారుదల క్రింద మరియు ఎక్కువ ఎడం లో జొన్న, సజ్జ వంటి పంటలలో సహా పంట గా, అంతర పంట గా, మిశ్రమ పంట గా సాగు చేయడం ద్వారా కొత్త పంటల వ్యవస్థ ను అభివృద్ధి పరచడం .
- అధిక దిగుబడి ని ఇచ్చే రకాలను రూపొందించి విత్తనాభివృద్ధి చేయడం
- అనువైన సస్యరక్షణ చర్యలు చేపట్టడం
- దుక్కి లో భాస్వరం ఎరువులు వేయడం, విత్తన శుద్ధి చేయడం మరియు రైజోబియం కల్చరు విత్తనానికి కలిపి సాగు చేయడం ద్వారా అధిక దిగుబడులు పొందడం
- పప్పు ధాన్యాల పంటలను సారవంతమైన నేలలో సాగు చేయడం వల్ల అధిక దిగుబడులు పొందడం
- ప్రభుత్వం ద్వారా అపరాల విత్తనాలను , ఎరువులను , సస్యరక్షణ చర్యలు చేపట్టే సాధనాలను సబ్సిడీ రూపం లో అందించడం ద్వారా రైతులకు ప్రోత్సాహం లభించడం.
- రైతులకు పప్పు ధాన్యాల సాగు పద్ధతులను పూర్తి గా తెలుసుకొని సరైన సమయానికి పంటను వితుకోవడం , సరైన ఎరువులను వేయడం, సరైన కలుపు మరియు నీటి యాజమాన్యం చేపట్టడం ద్వారా అధిక దిగుబడిని పొందడం .
Also Read:Horticultural Crops: ఏప్రియల్‌లో ఉద్యాన పంటల్లో చేపట్టవలసిన అభివృద్ధి పనులు
Also Watch:
Leave Your Comments