మన వ్యవసాయం

నీరు అవసరం లేని ఏకైక పంట

0
Chickpea Crop
Chickpea

Chickpea Crop : What crop should grow where there is no water నీటి తడి లేకుండా పండే ఏకైక పంట శనగ పంట. నీరు అందుబాటులో లేని రైతులు ఈ పంటను వేసుకోవడం ఉత్తమం. ఈ పంట ఎకరా దిగుబడి 8 కింటాల నుంచి 12 కింటాల దిగుబడి ఉంటుంది. అయితే నీళ్ల సౌకర్యం ఉంటే పూతకు ముందు ఒకసారి తడి చేసుకుంటే మరో రెండు కింటలు పెరిగే అవకాశం ఉంటుంది. ఇక ఈ పంటకు విత్తనం 40 నుంచి 50 కేజీలు అవసరం పడుతుంది. ఇక అన్ని పంటలకు తెగుళ్ల సమస్య ఉన్నట్టే ఈ శనగ పంటని కూడా పచ్చ పురుగు ఆశిస్తుంది. నవంబరులో శనగ సాగు చేస్తే వాతవరణం అనుకూలంగా మారి పంట ఎదుగుదల ఉండి దిగుబడులు పెరుగుతాయి. ఎందుకంటే శనగ పంట మంచు ఆధారంగా పెరిగే పంట. ఈనెలలో సాగు చేస్తేనే అనుకూలం, లేదా డిసెంబరు మొదటి వారం సాగు చేసుకోవచ్చు. ఆ తరువాత సాగు చేసిన పంట పూత దశకు వచ్చేసరికి ఎండబెట్ట తగిలి దిగుబడులు తగ్గుతాయి. అధిక ఉష్ణోగ్రతల వల్ల గింజ సరిగా గట్టిపడక దిగుబడి తగ్గుతుంది. Chickpea Production Guide
Chickpea Crop

Chickpea Crop విత్తుకునే ముందు విత్తన శుద్ధి అనేది చాలా ముఖ్యమైనది. థైరామ్‌ లేదా కాప్టాన్‌ 3 గ్రా. లేదా కార్బండజిమ్‌ 2.5 గ్రా. లేదా వాటి వాక్స్‌ పవర్‌ 1.5 గ్రా. కిలో విత్తనంలో కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. విత్తుకునే ముందు భూమిని నాగలితో లేదా కల్టివేటర్‌తో ఒకసారి, తరువాత గొర్రుతో రెండు సార్లు మెత్తగా దున్ని చదునుచేసి విత్తుటకు సిద్ధం చేయాలి. పశువుల ఎరువు 10 టన్నులు, గంధకం 16 కిలోలు, నత్రజని 8 కిలోలు, మరియు భాస్వరపు ఎరువులు 20 కిలోలు ఎకరాకు ఆఖరి దుక్కిలో వేసి కలియదున్నాలి. విత్తే ముందు భూమిలో సరిపడా తేమ ఉండేటట్లు చూసుకోవాలి. Chickpea does not need water

Chickpea Crop

సస్యరక్షణ చర్యలు : పురుగు నివారణకు రైతులు సస్యరక్షణ చర్యలు తీసుకోవాలి. లీటరు నీటికి 3 మి.మీల ఎండో సల్ఫాన్‌ ద్రావణం, దీంతో పాటు వేపనూనె 5 మి.మీలు, లేదా ఫాస్ఫేట్‌ లీటరు నీటితో తడిపి మొక్కలపై ఉదయం, సాయంకాలం వేళల్లో పిచికారి చేయాలి. లేదా క్లోరోఫైరిపాస్‌ 2 సె.మీల ద్రావణం లీటరుకు నీటితో కలిపి పిచికారి చేసి ఎకరాకు 4 లింగాకర్షక బుట్టలు, 20 పక్షి స్థావరాలను ఏర్పాటు చేసుకోవాలి. Chickpea Crop Benefits

Chickpea Crop

శనగకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నది. శనగలతో పాటు, శనగ పప్పు, శనగ పిండి, పుట్నాలకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. దీంతో రైతులు పండించిన పంటకు మంచి ధర లభిస్తుంది. ఇక శనగ ఉత్పత్తులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉండటంతో శనగ సాగుపై రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. Agriculture Today News

Leave Your Comments

Mulberry Cultivation: మల్బరీ సాగులో మెలుకువలు

Previous article

ఏపీలో ఫుడ్ ప్రోసెసింగ్ యూనిట్లు ప్రారంభం..

Next article

You may also like