Weed Management in Tobacco: పంటను జయప్రదంగా సాగుచేయుటకు అవలంబించే వివిధ అంతరకృషి చర్యల లక్ష్యం
- కలుపు మొక్కలను తగ్గించడం
- చెత్తను తయారు చేయుట ద్వారా నేల బీటలు తీయకుండా నివారించడం
- నేలలోని తేమను సంరక్షించడం మరియు నేలలో వాయు ప్రసరణ జరిగేటట్లు చేయడం.
Also Read: Tobacco Cultivation Techniques: ఆరోగ్యవంతమైన పొగాకు నారు పెంపకంలో మెళుకువలు.!
కలుపు నియంత్రణ: మిరప, పసుపు, చెరకు వంటి ఇతర వాణిజ్య పంటలతో పోలిస్తే పొగాకులో కలుపు సమస్య అంత తీవ్రమైనది కాదు. ఎందుకంటే ఈ పంటను సాధారణంగా ఎర్రనేలల్లో వానాకాలంలో వర్షాధార పంటగానూ, సాగునీటి పారుదల లేకుండా నల్ల భూములలో అవశేష తేమ మీద ఆధారపడి పెంచుతారు. రసాయన పద్ధతులతో పోలిస్తే భౌతిక, యాంత్రిక కలుపు నియంత్రణ పద్ధతులు చాలా జనరంజకంగా ఉన్నాయి. పొగాకులో నారుమడిలోనూ, ప్రధాన పొలంలో కూడా కలుపు మొక్కలుంటాయి. ప్రధాన కలుపు మొక్కలు వెర్నోనియా, పైసాలిస్ జాతులు, యుఫర్బియా జాతులు, ఒరబాంకి జాతులు. కలుపు పోటికి సందిగ్ధకాలం నాటిన తరువాత మొదటి 9 వారాలు.
అతి సురక్షితమైన పొదుపైన కలుపు నియంత్రణ పద్ధతి యాంత్రిక పద్ధతి. నారుమడిలో చేతితో కలుపు తీయడం ఉపయుక్తంగా ఉంటుంది. ఊడ్చిన/ నాటిన పంటలో వరుసల మధ్యదూరం ఎక్కువ కావడం వల్ల వరుసల మధ్య కృషి సాధ్యమవుతుంది. పొగాకు మొక్కలకు దగ్గరగా పెరుగుతున్న కలుపు మొక్కలను తొలగించడానికి 1,2 సార్లు కృషి జరిపి, తరువాత చేతితో కలుపు తీస్తే సరిపోయినంత కలుపు నియంత్రణ జరుగుతుంది. ట్రైనోర్రుతో అంతర కృషి జరిపి తరువాత బ్లేడ్ ‘హీరోతో అంతర కృషి చేయడం తేమ సంరక్షించడానికి చేసే మామూలు పద్ధతి.
ఒరబాంకి నియంత్రణ:
- వేసవిలో 2 లేక 3 సార్లు లోతుగా దున్నడం వలన దీని విత్తనం లోతుకి వెళ్ళి మొలకెత్తుట తగ్గించును.
- దీని ఉదృతి ఎక్కువగా ఉన్నప్పుడు 1 లేక 2 సీజన్స్ పొగాకు మానివేయాలి.
- వంగ, టొమాటో, టెండ పంటలను సాగుచేయకూడదు.
- ఒర్బంకి మొక్కలను పుష్పించే ముందు మరియు విత్తనం తయారయ్యే ముందు పీకివేయాలి. తరువాత వాటిని తగులబెట్టాలి.
- జొన్న, నువ్వులు, మినుము, పెసర వంటి ట్రాప్ పంటలను ఖరీఫ్లో వేయటం వలన ఒరబాంకి విత్తనాలు మొకకెత్తుతాయి. కాని పెరుగుదల ఉండదు. అందువలన ఆ నేలలో విత్తన పరిమాణం తగ్గించవచ్చును.
Also Read: Topping and De-suckering in Tobacco: పొగాకు సాగు లో తలలు నరకటం, పిలకలు తీసివేయటం కలిగే ఉపయోగాలు