Weed management కలుపు మొక్కలు పంట మొక్కలతో సమానంగా భూమి, గాలి, వెలుతురు, నీరు, పోషక పదార్థాలతో పోటీపడి పంట మొక్కలకు చాల నష్టం కలుగచేస్తాయి. ఉద్యానవన పంటలలో కలుపు మొక్కల నివారణ అనేది పంట ఉత్పత్తిలో ప్రముఖ పాత్ర పోషించును. కలుపు వల్ల అధిక నష్టం జరుగుతూ ఎన్నో కోట్ల రూపాయలు వృధా అవుతున్నప్పటికి మనుము కలుపు మొక్కల నిర్మూలనను అశ్రద్ధ చేస్తున్నాము.
శీతల మరియు ఉపశీతల దేశాలలో 70% కూలీలు కేవలం కలుపు నివారణకే ఉపయోగిస్తారు. మొక్క నాటిన నుండి కోత కోసే వరకు కలుపు మొక్కలు తీయనిచో 90% నష్టం సంభవిస్తుంది.
తోటలో కలుపు విస్తారంగా పెరుగుతుంది. ఎందువల్ల అనగా ఎక్కువసార్లు అంతరకృషి చేయరు సాధారణంగా పైర్లలో కలుపు మొక్కల నిర్మూలన రసాయనాల వాడటం కంటే ఎక్కువగా వుంచి ఫలితాలతో కలుపు మొక్కల నిర్మూలను రసాయనాలను ఉపయోగించవచ్చు. ఎందువల్లనంటే, తోటలలో ఉన్న చెట్లు పెద్దవిగాను, కలుపు మొక్కలు చిన్నవిగా ఉండటం వల్ల వీటి తారతమ్యాలను ఉపయోగించుకుని పైరుల కంటే ఎక్కువ మోతాదులో కలుపు మొక్కల రసాయనాలను కలుపు నిర్మూలించుటకు వాడటానికి అవకాశం ఉంది.
వర్షాకాలంలో రెండుసార్లు తోటంతా దున్నటం వలన కలుపు మొక్కలు అదుపులో ఉంచడమే కాకుండా నేలు గుల్లబారి వాననీరు ఇంకుతుంది. వర్షాకాలంలో తొలకరి వర్షం తరువాత అట్రటాఫ్ ఎకరాకు 800గ్రా. 240 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి. తరువాత వచ్చే గడ్డి/తుంగజాతి కలుపు నివారణకు డైసెల్ లేదా రౌండప్ కలుపు మందును లీటరు నీటికి 8 మి.లీ మందును కలిపి దానితోపాటు 20 గ్రా అమ్మోనియం సల్ఫేట్గాగాని, 10గ్రా. యూరియా గాని కలిపి 20-25 రోజులు కలుపై పిచికారి చేయాలి. ఈ మందు వాడేటపుడు చిన్న వయసు పండ్ల మొక్కలపై పడకుండా జాగ్రత్త వహించాలి. మామిడి, చీనీ, నిమ్మ, ద్రాక్ష, జామ, సపోట, దానిమ్మ, రేగు, సీతాఫలం తోటలలో పై విధంగా కలుపును నివారించుకోవచ్చు.
అరటిలో కూలీలతో 15-20 రోజులకొకసారి కలుపు తీయిస్తే, ఖర్చు పెరుగుతుంది. అందుచేత, అలసంద చల్లి 40-50 రోజులకు భూమిలో కలియదున్నటం వలన భూసారం వృద్ది అయి, అరటి దిగుబడి పెరుగుతుంది. కలుపు నిర్మూలన జరుగుతుంది. నాగలి లేక పవరు టిల్లర్తో దున్ని కలుపు నిర్మూలించవచ్చు. ఎకరాకు 2.లీ బుటాక్లోర్ లేదా లీ అలాక్లోర్ లేక 1 లీ పెండిమిథాలిన్ లేక 300 మి.లీ అక్సిఫ్లోర్ఫెన్ 200 లీ నీటిలో కలిపి తేమగా ఉన్న భూమిపై కలుపు మొలకెత్తటానికి ముందే పిచికారి చేయాలి. 40-50 రోజుల తర్వాత పలుచగా మొలకెత్తిన కలుపును కూలీలతో ఉయింది, మొదటి సారి పిచికారి చేసిన మందునే సగం మోతాదులో 200లీ నీటిలో కలిపి ఎకరా విస్తీర్ణంలో తేమగా ఉన్న భూమిపై వీధికారి చేయాలి. ఎదిగిన కలుపు పై 40 మి.లీ పారాక్వేట్ను 10 లీ నీటిలో కలిపి పిచికారి చేసి నిర్మూలించవచ్చు.