Weed Management: అక్టోబర్ 15 నుండి నవంబర్ 15 వరకు రబీ పంటలుగా మినుము, పెసర విత్తుకోవటానికి అనుకూలమైన సమయం. తొలకరిలో ఏ పంటసాగు చేయకుండా నేలలు ఖాళీగా ఉన్న పరిస్థితులలో రైతులు ముందుస్తుగా రబీ మినుము, పెసర పంటలను సెప్టెంబర్ 15 నుండి కూడా సాగుచేసుకోవచ్చు. మినుము, పెసర పైర్లు సళ్ళ మధ్య దూరం కమ్ముకోవాడినికి సుమారుగా 35- 40రోజులు సమయం పడుతుంది ఈ దశ వరకు మినుము, పెసర పైర్లు లో కలుపు సమస్య లేకుండా యాజమాన్యం చేపట్టాలి. కలుపు నివారణ సక్రమంగా లేని దగ్గర, మినుము, పెసర పైర్లలో కలుపు లేకుండా యాజమాన్యం చేపట్టాలి. కలుపు నివారణ సక్రమంగా లేని దగ్గర మినుము, పెసర పంటలలో కలుపు తీవ్రతనుబట్టి దిగుబడులు 50-75 శాతం వరకు తగ్గిపోయే అవకాశముంది.
Also Read: Black Gram Farming: మినుములు సాగు విధానం
కలుపు నివారణ: రైతులు ఈ మధ్యకాలంలో అనేక కారణాలు దృష్ట్యా పూర్తిగా కలుపు మందుల పైనే ఆధారపడే పరిస్థితి వచ్చింది. ఏ కలుపు మందు ద్వారా కూడ వందకి శాతం కలుపు నివారించే అవకాశం లేదు. కాబట్టి కలుపు నివారణలో మంచి ఫలితాలు సాధించటానికి సమగ్ర కలుపు యాజమాన్యం పాటించాలి.
వితేముందు దుక్కి బాగా తయారుచేసుకోవటం పైరు విత్తే ముందు అవసరాన్ని బట్టి 2-4 సార్లు నేలను గొర్రు, గుంటకలతో దున్ని పొలంలో ఉన్న కలుపు మొక్కలు పూర్తిగా చనిపోయేటట్టు చేయాలి. అలాగే నేలపై పొరలలో ఉండే కలుపు విత్తనాలు మొలకెత్తేలా చేస్తే మినుము, పెసర విత్తినప్పుడు పైరుతోపాటుగా కలుపు మొక్కలు మొలకెత్తవు.
పంట మొక్కలు మొలిచిన కొన్ని రోజుల తరువాత ఇచ్చే నీటి తడులకో లేక వర్షాలకో కలుపు ముందుగానే మొలిచి పెరుగుతాయి కాబట్టి, కలుపు సమస్య తక్కువగా ఉంటుంది. దుక్కి బాగా తయారు చేసుకొని పంట విత్తుకోవటం కలుపు నివారణలో మంచి ఫలితాలు ఇస్తుంది, పూర్వం రోజులలో ఎద్దుల అరకలతో దుక్కి తయారు చేసుకోవలిసి ఉండటంతో అధిక శ్రమ అధిక సమయం తీసుకునేది.
కాని నేడు చిన్న కమతాల నుండి పెద్ద కమతాలకు అనువైన అనేక రకాలైన ట్రాక్టర్లు, ట్రాక్టర్లతో నడిచే రోటవేటరు, మల్చరు స్లాషార్, గొర్రులు, గుంటకాలు అందుబాటులోకి వచ్చాయి.
ఇవి తక్కువ శ్రమతో, తక్కువ సమయంలో దుక్కి చేసుకోవటానికి రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి కాబట్టి వీటిని ఉపయోగించుకొని రైతులు దుక్కి వీలైనంత బాగా తయారు చేసుకొని పైర్లు విత్తుకోవాలి.
కలుపు నివారణలో మినుము, పెసర పైర్లలోనే కాక, ఇతర పంటలలోనూ దుక్కి బాగా తయారు చేసుకోవటం అనేది చాలా ముఖ్యమైన అంశం. మొక్కల సాoద్రత సరిపడా ఉండేలా విత్తుకోవాలి. పొలంలో సరైన మొక్కల సాంద్రత ఉన్నపుడు కలుపు సమస్య తక్కువగా ఉంటుంది. కాబట్టి పొలంలో పంట మొక్కల సాంద్రత సరిపడా ఉండేలా ఎకరానికి మినుము 7-8 కిలోలు, పెసర 6-7కిలోలు విత్తిన మోతాదుతో, సాలుకు సాలుకు మధ్య 12 అంగుళాలు దూరం ఉండేలా, విత్తనం 2 ½-3 అంగూళాల లోతులో మంచి పదునులో విత్తుకోవాలి.
కూలీలతో కలుపు తీయటం: కూలీలు సరిపడా అందుబాటులో ఉన్నప్పుడు విత్తిన 15-20 రోజులకు మొదటిసారి, 30-35 రోజులకు రెండవసారి కలుపు తీయిచడం ద్వారా మినుము, పెసర కలుపు సమస్యను పూర్తిగా అధిగమించవచ్చు.
అంతర సేద్యం: అంతరసేద్యానికి అనువైన అరకలు, ఎద్దులు, అరకలతో సేద్యం చేసే నైపుణ్యంగల పనివారు అందుబాటులో ఉన్నపుడు విత్తిన 20 రోజులకు మొదటసారి, 30-35 రోజులకు రెండవసారి అంతరసేద్యం చేసి, ఆపైన పొలంలో మిగిలిన కలుపు మొక్కలకు కూలీలతో తీయించి. మినుము, పెసర కలుపు సమస్యను అధిగమించవచ్చు. ఈ మధ్యకాలంలో సేద్యానికి అనువైన డీజల్, పెట్రోలుతో నడిచే యంత్ర పరికరాలు కూడా అందుబాటులోకి వచ్చాయి. వాటిని కూడా ఉపయోగించి అంతరసేద్యం చేయవచ్చు. కూలీలు అందుబాటులో లేనప్పుడు అంతర సేద్యానికి వనరులు లేనప్పుడు కలుపు మందుల ద్వారా కలుపు నివారించుకోవచ్చు.
విత్తిన వెంటనే వాడే కలుపుముందులు: మినుము, పెసర విత్తిన వెంటనే లేక విత్తిన 1-2 రోజులలో పెండిమీథాలిన్ 30 శాతం (స్టాంపు, పెండిస్టర్ ) 1.0 లీటర్ లేక అల్లాక్లోర్ 50 శాతం 1.5 లీటర్లు 200 లీటర్లు నీటిలో కలిపి పిచికారి చేసినప్పుడు పంట మొక్కలను, పైరు తొలిదశలో మొలిచే కలుపు మొక్కలను చాలా వరకు నివారించవచ్చు. పెండి మిథాలిన్ కలుపు మందు వెడల్పకు మరియు గడ్డిజాతికి చెందిన కలుపు మొక్కలను సమర్ధవంతంగా నివారిస్తుంది. ఈ కలుపు మందులు నేల పై పొరలో తగినంత తేమ ఉన్నప్పుడు మాత్రమే సమర్ధవంతంగా పనిచేస్తాయి.
Also Read: Broken Rice: మొక్కజొన్నకి ధర పెరగడంతో నూకలకి పెరిగిన డిమాండ్