శ్రీమతి జి. శైలజ డిడియస్ కెవికె
ఔషధంగా, సుగంధ ద్రవ్యంగా విశిష్ఠ ప్రాధాన్యత ఉన్న పంట అల్లం. ఆయుర్వేదంలోనూ అల్లంను విరివిగా ఉపయోగిస్తున్నారు. తెలంగాణ జిల్లాలైన ఉమ్మడి మెదక్, రంగారెడ్డి జిల్లాలోనూ అధికంగా సాగు చేస్తున్నారు. సాధారణంగా అల్లంను ఏప్రిల్ ` మే మాసంలో విత్తుకొని, డిసెంబర్ ` జనవరి మాసంలో పంటను కోయడం ప్రారంభిస్తారు. ఈ దిగుబడిలోని కొంత భాగంను విత్తనం కోసం నిల్వ చేస్తూ ఉంటారు. నిల్వలో శాస్త్రీయ, యాజమాన్య పద్ధతులను పాటించినట్లైతే, ఆరోగ్యవంతనైన విత్తనాన్ని పొందవచ్చును. ధరలు ఆశాజనకంగా ఉంటే పచ్చి అల్లంగాను, లేదంటే మరొక నాలుగు నెలల పాటు భూమిలో అల్లంను ఉంచి పంట కోయవచ్చును. అంతేకాక ఉపఉత్పత్తుల్లో ఎండు అల్లం, సొంఠి రూపంలోను కూడా విక్రయించవచ్చును.
` ఈ అల్లం మన రాష్ట్రంలో సుమారుగా 2220 హెక్టార్లలో పైబడి సాగు చేయబడుతూ 1050 మెట్రిక్ టన్నుల దిగుబడి ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడు అయితే మనకు డిసెంబర్ ` జనవరి నెలలో మార్కెట్ ధర సరిగ్గా లేకపోయిన, పైన ఆకులు ఎండిపోయిన, సరిగ్గా క్రింద దుంప ఏర్పడకపోయినా, తరువాత రెండు మూడు నీటి తడులు ఇచ్చుకొని ఏప్రిల్ లోపు మనం పంట కోసుకున్నట్లయితే, దీని విత్తనంగా కూడా వాడుకోవచ్చును దీని వల్ల మనకు ఇంకా 20 క్వింటాళ్ళు ఎక్కువ దిగుబడి రావాడం జరుగుతుంది.
` దీనికి ముఖ్యంగా మనం ఏం చేస్తాం అంటే డిసెంబర్, జనవరి నెలలో మనకు పంట వచ్చిన తరువాత, మనం త్రవ్వడం మొదలుపెట్టి, ఈ త్రవ్విన తరువాత మనము ఏప్రిల్ ` మే వరకు ఉంచుతాము. ఈ నాలుగు నెలలు ఉంచే పద్ధతినే మనం నిల్వ చేసే పద్ధతి అంటాము. దీని కోసం మనం ఏం చేస్తాం అంటే అల్లంను త్రవ్విన తరువాత, మనం నీటితో శుభ్రపరుచుకుని, ఎండలో ఉంచుకోవాలి. మనకు సమర్ధవంతంగా ఎక్కువ కాలం నిల్వ ఉంచుకోని అలాగే మొలక ఎక్కువ రావాలంటే, ఈ నిల్వ పద్ధతి కోసం మనం ఒక గుంతను తయారు చేసుకోవాలి, ఈ గుంత అనేది 45 సెం.మీల పొడవు, 45 సెం.మీల వెడల్పు, 60 సెం.మీ. లోతు ఉండాలి, ఆ గుంతలో మనం పేడతో అలికి, బాగా ఎండిన తరువాత మనం క్రింద 10 సెం.మీ ఇసుక వేసుకోవాలి, దాని పైన మళ్ళి ఈ అల్లం దుంపను 10 సెం.మీల మందంలో వేసుకోవాలి. అలా మనం 10 సెం.మీ అల్లం దుంపను మరియు ఇసుక 2`3 సెం.మీ, పై వరకు వేసుకోవాలి. అలాగే గుంతకు పైన 10 సెం.మీ, గ్యాప్ వచ్చేలా ఉంచుకోవాలి. దీని పైన ఒక చెక్క బోర్డును ఉంచి, ఆ చెక్క బోర్డుకు చిన్న రంధ్రం ఉన్నట్లయితే, గాలి, వెలుతురు వెళ్ళి, ఎక్కువ శాతం మనకు మంచి దుంప, మంచి నాణ్యత కలిగిన విత్తనం ఉండటానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి, ఆ విధంగా 45I45I60 సెం.మీ గుంతలో 25కిలోల అల్లంను మనం నిల్వ చేసుకోచ్చును.
Read More: మొక్కజొన్న పంటలో పోషక లోపాలు నివారణ
` ఇలా ఉంచిన తరువాత దానిపైన వర్షపు నీరు వెళ్ళకుండా ఉండాలంటే, పైన షెడ్ వేసినట్లయితే సరిjైున దుంపనలను మనం మార్కెట్‌కు వేసే ఆస్కారం ఉంటుంది.
` ఎండు అల్లంగా తయారు చేసుకోవడానికి పైన శుభ్రంగా కడిగి, మట్టిలేకుండా పైన తొక్క తీసి, కడిగి ఎండలో ఆరబెట్టి, మళ్ళీ శుభ్రంగా చేస్తే ఎండు అల్లం తయారవుతుంది. ఈ ఎండు అల్లం మనకు 5:1 నిష్పత్తిలో తయారవుతుంది. అంటే 100 కిలోల పచ్చి అల్లంకి 25కిలోల ఎండు అల్లం తయారవుతుంది.
` సొంఠి తయారీ విధానంలో 7 నెలల తరువాత పంట తీసి ఆ తర్వాత అల్లంను సున్నపు నీటిలో 6 గంటల పాటు ఉంచాలి. ఈ సొంఠి తయారికి మనకు 5కిలోల సున్నం అవసరం అవుతుంది. ఈ విధంగా తయారు చేసుకోని ఎండలో ఆరబెట్టి, అదే విధంగా 3`4 సార్లు ఇదే పద్ధతిని మనము చేసుకున్నట్లయితే, పసుపు రంగు కలిగిన ఎండు అల్లం ఏర్పడుతుంది. ఈ ఎండు అల్లంను సల్ఫర్ వాయువుతో ప్రభావితం చేస్తే, మనకు తెలుపు రంగులో సొంఠి ఏర్పడుతుంది. ఈ సొంఠి మనకు 4:1 నిష్పత్తిలో తయారవుతుంది. అంటే 100కిలో అల్లంకి 25కిలో సొంఠి తయారవుతుంది. మార్కెట్ లేనప్పుడు ఈ విధంగా తయారు చేసుకున్నట్లయితే సొంఠితో ఎక్కువ లాభం పొందే ఆస్కారం వుంటుంది.