Vibriosis Disease in Cows: ఈ వ్యాధిని 1957 సంవత్సరంలో మన దేశంలోనే మొదటిసారి కనుగొన్నారు. అన్ని ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు, పందులు మరియు మనుషులలో లైంగిక సంపర్కము ద్వారా కలుగు ఒక ముఖ్యమైన అంటు వ్యాధి. ఇది ఒక జునోటిక్ వ్యాధి.
Also Read: Characteristics of Domestic Cows: పనికి ఉపయోగపడే దేశవాళి ఆవుల లక్షణాలు.!
వ్యాధి కారకము:- ఇది Gm-ve బ్యాక్టీరియా అయిన విబ్రియో/ కాంపైలో బాక్టర్ ఫీటస్ అను సూక్ష్మజీవి వలన కలుగుతుంది. ఇది కామ(,) ఆకారంలో ఉండి, వీటికి చలనం కలదు. ఈ బ్యాక్టీరియా ఆడ మరియు మగ పశువుల జననేంద్రియ వ్యవస్థలో ఉండి, లైంగిక సంపర్కము ద్వారా వ్యాప్తి చెందును.
వ్యాధి బారిన పడు పశువులు:- ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు, పందులు మరియు మనుషులలో ఈ వ్యాధి ప్రభావం ఎక్కువ.
వ్యాధి వచ్చు మార్గం:- గర్భాశయ పిండ పొరలలోను, పాలలోను వ్యాధి కారక క్రిమి అధికంగా వుంటుంది. వాటితో కలుషితమైన ఆహారం, నీరు తీసుకోవడం ద్వారా
వ్యాధి వ్యాప్తి చెందు విధానం:- బ్యాక్టీరియాతో కలుషితమైన ఆహారాన్ని తీసుకోవడం వలన బ్యాక్టీ రియాలు పొట్ట ప్రేగుల ద్వారా రక్తంలో చేరి, అక్కడ నుండి గర్భంతో వున్న పిండంకు చేరి (Gravid Uterus) పిండంను మరియునాశనం చేస్తుంది. ఫలితంగా పశువులు ఈసుకుపోతుంటాయి
వ్యాధి లక్షణాలు:
(1) 2-3 నెలల మధ్య ఈసుకుపోతుంటాయి. మాయ వేయవు.
(2) యోని రంధ్రం నుండి చీము వంటి ద్రవాలు కారుతూ వుంటాయి.
(3) జ్వరం తీవ్రత ఎక్కువ వుంటుంది.
(4) వ్యాధి బారిన పడిన పశువులకు దూడలు పుట్టిన వాటి అవయవాలు సక్రమంగా వుండవు.
(5) వ్యాధి బారిన పడిన పశువులు సరిగ్గా ఎదకు రాకపోవడం, తిరిగి కట్టకపోవడం, తిరిగి పొర్లుతుండడం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి.
(6) వ్యాధి బారిన పడిన పశువులు నీరసంగా ఉంటూ, ఆహారం సరిగా తీసుకోవు.
వ్యాధి కారక చిహ్నములు:-
(1) రక్తపు చారలతో/చీముతో కూడిన ఎండోమెట్రైటిస్ వుంటుంది.
(2) 2-3 నెలల మధ్యలో పశువులు ఈసుకుపోతుంటాయి.
(3) పుట్టిన దూడలకు అవయవాలు సక్రమంగా వుండవు.
వ్యాధి నిర్ధారణ:-
(1) పైన తెలిపిన వ్యాధి లక్షణాలు ఆధారంగా
(2) వ్యాధి కారక చిహ్నముల ఆధారంగా
డిఫరెన్సియల్ డయాగ్నోసిస్:-
(1) బ్రూసెల్లోసిస్
(2) ట్రైకోమోనాస్ ఫీటస్ వంటి వ్యాధులతో సరిపోల్చుకొని చూసుకోవలెను.
చికిత్స:-
వ్యాధి కారకాన్ని నిర్మూలించుటకు చేయు చికిత్స:- వ్యాధికారక క్రిములను నివారించేటందుకు బ్రాడ్ స్పెక్ట్రమ్ పెన్సిలిన్స్ స్ట్రెప్టోమైసిన్ కి. లో శరీర బరువుకు 5-10 మి.గ్రా చొప్పున లేదా టెట్రాసైక్లిన్లను కి. లో శరీర బరువుకు 5-10 మి.గ్రా చొప్పున లేదా క్లోరంఫెనికాల్ కి. లో శరీర బరువుకు 10-15 మి.గ్రా చొప్పున 7-10 రోజులు వాడినట్లైతే మంచి ఫలితం ఉంటుంది.
వ్యాధి లక్షణములకు చేయు చికిత్స:- జ్వరంను తగ్గించుటకు అంటి పైరెటిక్ ఔషదములను, ఇన్ఫ్లమేషన్ ను తగ్గించుటకు ఆంటి ఇన్ ఫ్లమేటరీ ఔషదములను, నొప్పులు తగ్గించుటకు పెయిన్ కిల్లర్ ఇంజక్షన్లను ఇవ్వవలెను. ఎండోమెట్రైటిస్ను తగ్గించుటకు ఎన్బోలిక్స్, పెస్సరిస్ వంటి ఔషదములను ఇవ్వవలెను.
(3) ఆధారము కల్పించు చికిత్స:-
పశువు యెక్క స్థితిని బట్టి సెలైన్ ద్రావణాలను, విటమిన్స్ మరియు మినరల్స్ ఇంజక్షన్లను ఇవ్వవలెను.
నివారణ:- వ్యాధి సోకిన పశువులను మంద నుండి వేరు చేసి మిగలిన పశువులకు జాగ్రత్తగా చికిత్స చెయ్యవలసి యుంటుంది. క్రుత్రిమ గర్భధారణ ఇంజెక్షన్లు ఇప్పించుట వలన ఈ వ్యాధి ఆరోగ్యంగా ఉన్న పశువులకు రాకుండా నివారించవచ్చు. గర్భధారణకు ఉపయోగించు ఆంబోతు ఆరోగ్యవంతమైనదిగా ఉండాలి. ఈ వ్యాధికి ఎటువంటి టీకా లేదు.
Also Read: Desi Cow and Jersey Cow: దేశీ ఆవు, జెర్సీ అవుకు తేడా ఏంటి?