Asiatic Class Hens: ఎసియాటిక్ తరగతి కోళ్ళలోని ప్రధాన లక్షణాలు (COMMON FEATURES OF THE CLASS):
ఈ క్లాస్ నందు “Brahma, Cochin & Langshan కోళ్ళ జాతులు కలవు.
1) ఈ జాతి కోళ్ళు నిదానంగా పెరుగును.
2) ఇవి దాణాను సరిగ్గా తీసుకోవు.
3) ఇవి మంచి పొదుగుడు స్వభావం కలిగి ఉంటాయి.
4) వీటి తొడల దగ్గర ఎక్కువ ఈకలు ఉండును.
5) వీటి గ్రుడ్ల పెంకు బ్రౌన్ రంగులో ఉండును.
6) వీటికి చురుకుదనం తక్కువగా ఉండును. 7) మంచి మాంసపు గుణములు కలిగి యున్నది.

Asiatic Class Hens
Also Read: Precautions for Bringing Baby Chicks Home: కోడి పిల్లలు తెచ్చే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.!
(A) లాంగ్షాషన్ (LANGSHAN):
ఈ జాతి కోళ్ళు చైనాలోని లాంగ్షన్ జిల్లాకు చెందినవి.
జాతి లక్షణాలు:
1) వీటి శరీరం పొట్టిగా మరియు డీప్ గా ఉండును.
2) వీటి ఈకలు పొడవుగా ఉండును.
3) వీటి తొడలు పొడవుగా తగిన విధంగా ఉండును.
4) సింగిల్ కూంబ్ కలిగి ఉండును.
5) ఈ జాతి కోళ్ళు అందంగా ఉండును.
ఉపయోగములు (UTILITY):
1) ఈ జాతి మాంసోత్పత్తికి పేరు గాంచినది.
2) పుంజులు సగటున 3.8 కే.జీలు, పెట్టలు 3.3 కేజీలు శరీర బరువు తూగును.
(B) కొచిన్ (COCHIN):
ఈ జాతి కోళ్ళు చైనాలోని షాంగై జిల్లాకు చెందిన ది.
జాతి లక్షణాలు:
1) ఈ జాతి కోళ్ళు లావుగా ఎక్కువ ఈకలు కలిగి ఉండును.
2) రొమ్ము తక్కువగా ఉంటుంది.
3) కోళ్ళలో తోక యొక్క ఆధారానికి ప్రముఖమైన కుషన్ ఉంటుంది.
4) వీటి ఈకలు పొడవుగా ఉండటం వలన ఇవి పొడవుగా కనిపించును.
5) ఇవి సింగిల్ కూంబ్ కలిగి ఉండును.
ఉపయోగములు (UTILITY) :
1) ఈ జాతి కోళ్ళు మంచి మాంసపు జాతికి చెందినవి.
2) పుంజులు సగటున 4.9 కేజీల, పెట్టలు 3.8 కేజీల శరీర బరువు తూగును.
(C) బ్రహ్మ (BRAHMA):
1) ఈ జాతి కోళ్ళు ఇండియా నందు బ్రహ్మ సముద్రం ఏరియా కు చెందిన వి.
2) ఈ జాతి యందు 2 వెరైటీస్ కలవు. అవి ఏమనగా లైట్ మరియు డార్క్ in Plumage colour,
జాతి లక్షణాలు:
1) ఈ జాతి కోళ్ళు ఎసియాటిక్ క్లాస్లలో వున్న అన్ని కోళ్ళు కంటే అతి పెద్దవి.
2) వీటి శరీరం లావుగా వెడల్పుగా మరియు డీప్ గా ఉండును.
3) వీటి శరీరంపై ఎక్కువ ఈకలు ఉండును. ఇవి నలుపు రంగులో ఉండును.
4) పీ కూంబ్ కలిగి ఉండును. వీటి కాళ్ళ పైన కూడా ఈకలు ఉండును.
ఉపయోగములు (UTILITY):
1)ఇవి మంచి మాంసపు జాతి కోళ్ళు.
2) పుంజులు సగటున 5 కేజీల, పెట్టలు 4 కేజీల శరీర బరువు తూగును.
Also Read: Benefits of Eating Chicken: కోడి మాంసం తినడం వల్ల కలిగే ప్రయోజనాలు