Uses of Bio-Fertilizers : మన ప్రమేయం లేకుండా సహజసిద్ధంగా నెలల్లో ఉన్న సూక్ష్మ జీవులు. నాచు శీలింద్రల చర్యల వల్ల మొక్కల వల్ల ఎంతో ఉపయోగం కలుగుతుంది.పంట మార్పిడి వల్ల ప్రతి రెండు సాధారణ పైర్ల సాగుకు మధ్య వేసే పప్పు జాతి పైర్లు వల్ల సహజంగా సూక్ష్మ జీవుల సంఖ్య పెరిగి చాలా లాభం పోదుతున్నాం. జీవన ఎరువులు సహజమైనవి. వాటి వల్ల కాలుష్యం ఉండదు మరియు పంటకు కూడా హాని చేయదు.రసాయన ఎరువుల ధరలు ఎక్కువగా ఉండడం వలన జీవన ఎరువుల ప్రాముఖ్యత రోజు రోజుకు పెరుగుతుంది.సమగ్ర ఎరువుల వాడకంలో ఇవి ఒక బాగమై నేల ఆరోగ్యం ఉత్పాదకత కాపాడడంలో దిగుబడి నాణ్యత పెంచడం లో ప్రముఖ పాత్ర వహిస్తుంది.
- ఇవి వాతావరణంలో నత్రజని ని స్థిరీకరిస్తాయి. నేలలోని స్వభావన్నీ అందుబాటులోకి తెస్తాయి.
- హార్మోన్లు, విటమిన్లు, ఎంజైములు లభ్యమై మొక్క పెరుగుదల చురుకుగా ఉంటుంది.
- సాధారణంగా దిగుబడులు 10-20 % వరకు పెరుగుతాయి.20-25% నత్రజని,భాస్వర ఎరువుల వాడకాన్ని తగ్గించవచ్చు.
- నేల నుండి సంక్రమించే తెగుళ్ల కోత మేరకు నిరోధించబడతాయి.
- ఉపయోగకరమైన సూక్ష్మ జీవులు గమణీయంగా పెరుగుతాయి.
- నేల భౌతిక లక్షణాలు మెరుగుపడతాయి. వేర్లకు గాలి, నీరు,బాగా లభ్యమవుతాయి.
- వృక్ష సంబంధిత భాగాలు నాణ్యత రుచి పెరుగుతుంది.
- పశువుల మేతలో పోషకాల పరిమాణం పెరుగుతుంది.
- రైతులకు ఎరువు ఖర్చు తగ్గుతుంది.
- రసాయన ఎరువుల దిగుమతికి అయ్యే విదేశీమారక ద్రవ్యం ఆదా అవుతుంది.
- జీవన ఎరువులు ఎంతగా ఉపయోగించుకుంటే అంతగా వృద్ధి చెందుతాయి.
- కాలుష్యం ఉండదు.నేలకు, పంటకు ఎలాంటి హాని ఉండదు.
- నత్రజని, భాస్వరం జీవన ఎరువులు రెండు వాడినప్పుడు ప్రయోజనం ఉంటుంది.
- నేలలో ఉన్న భాస్వరాన్ని కరిగించి లభ్య రూపంలోనికి మారుస్తాయి.అంతే కాక మొక్కలకు అందుబాటులోకి తెస్తాయి.
- దిగుబడులు 10-20% పెరుగుతాయి.
- భూసారం పెరుగుతుంది.
జీవన ఎరువుల వాడకంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన మెళకువలు-
- జీవన ఎరువులను వేడి వెలుతురు గల ప్రదేశాల్లో ఉంచకూడదు.చల్లని ప్రదేశంలో నిల్వ ఉంచాలి.
- జీవన ఎరువులను పురుగు మందులతో తోను రసాయన ఎరువుల తోను కలిపి వాడరాదు.
- విత్తన శుద్ధి చేయదలచినప్పుడు మొదటగా విత్తనాలను శిలింద్రానశినులతో శుద్ధి చేసి 24 గంటల తర్వాత జీవన ఎరువులను పట్టించాలి.
- ప్యాకెట్ లలో సూచించబడిన గడువు తేదీ గమనించాలి.గడువు దాటిన ఎరువులను వాడరాదు.
- సమర్ధవంతమైన చర్యకు మంచి నాణ్యత గల కల్చర్ ను వాడాలి.
- జీవన ఎరువులను ప్రభుత్వ రంగా సంస్థలనుండి గాని నమ్మకమైన సంస్థల నుండి గాని కొనుగోలు చేయాలి.
- పైరుకు సంబదించిన ఎరువులను మాత్రమే వాడాలి.
- జీవన ఎరువులు సేంద్రియ ఎరువులు కలుపుకొని వాడడం శ్రేయస్కరం.
- సేంద్రియ నిల్వలు లేని నెలల్లో జీవన ఎరువుల నుండి ఆశించిన ఫలితాలు రావు.
- నెలల్లో సూటిగా వేసుకోవచ్చు. విత్తన శుద్ధి ద్వారా కానీ కొన్ని పరిస్థితులలో పిచికారీ ద్వారా గాని జీవన ఎరువులను వాడాలి.
Leave Your Comments