Types of Nutrients: భూమి పై పొరలో 109 మూలకాలు గుర్తించడం జరిగింది.మొక్కల పెరుగుదలకు కొన్ని మూలకాలను ఎక్కువ పరిమాణంలోనూ, కొన్నింటిని తక్కువ గానూ నేలనుండి తీసుకొంటాయి.ఇతర మూలకాలు అనేకం నేలలో ఉన్నప్పటికీ వాటిని తీసుకోవు. ఇలా మొక్కలు వాటి అవసరార్ధం నేలనుండి సంగ్రహించే మూలకాలను ” పోషకాలు ” అంటారు. పోషకాలలో భారత నేల చాలా తక్కువగా ఉందని పేర్కొంది. సాంపిల్స్‌లో దాదాపు 85 శాతం మట్టిలో ఆర్గానిక్ కార్బన్ లోపం ఉంది. వీటిలో దాదాపు 15 శాతం శాంపిల్స్‌లో ఆర్గానిక్ కార్బన్ తక్కువ స్థాయిలో ఉంది.
పోషకాల ఆవశ్యక నియమాలు:
- గింజలు మొలకెత్తి మొక్క తన జీవిత చక్రాన్ని సంపూర్ణం గావించడానికి ఉపయోగపడే మూలకం-అంటే ఆ మూలకం లేకపోతే మొక్క తన జీవిత చక్రాన్ని సంపూర్తి గావించు కోలేదు.
- పోషకము గా పరిగణించబడిన మూలకము సరఫరా లోపించి నపుడు మొక్కలు కొన్ని లోప లక్షణాలు: ప్రదర్శిస్తాయి. ఈ లోప లక్షణాలు ఆ ప్రత్యేక మూలక పదార్ధము మొక్కకు సరఫరా చేస్తేనే సవరింప బడతాయి.
- పోషకము అనబడే మూలకం మొక్క పోషణ లో ప్రత్యక్షంగా పాల్గొనును.
ముఖ్య పోషకాలు: మొక్కల ఎదుగుదలకు 20 పోషకాలు అవసరమని ఇప్పటి వరకూ గుర్తించారు. మొక్కల పోషకాలు అవి ఉపయోగించుకొనే పరిమాణాన్ని బట్టి మూడు తరగతులు గా విభజించారు.
స్థూల పోషకాలు లేదా ప్రధాన పోషకాలు (primary or Major nutrients): నత్రజని, భాస్వరము, పొటాష్ ధాతువులు పైర్లు ఎక్కువ మోతాదులలో అవసరముంటుంది. అందువలన వీటిని “స్థూల పోషకాలు” అంటారు.
ఉప పోషక పదార్థాలు (secondary nutrients): కాల్షియం, మెగ్నీషియం, గంధకం, ఈ ధాతువులను మొక్కలు స్థూల పోషకాల కంటే తక్కువ పరిమాణం లో వినియోగించు కొంటాయి. కావున వీటిని “ఉప పోషక పదార్ధాలు” అంటారు.
సూక్ష్మ పోషక పదార్థాలు (micro nutrients or trace elements): ఇనుము, మాంగనీసు, జింకు, రాగి, బోరాస్, మాలిబ్దినం, సోడియం, క్లోరిస్, నికెల్, కోబాల్ట్, సిలికాస్ ధాతువులను మొక్కలు చాలా తక్కువ పరిమాణం లో వినియోగించు కొంటాయి. కావున వీటిని “సూక్ష్మపోషకాలు అంటారు.
Also Read: Cotton cultivation: ప్రత్తి పంట లో వర్షాలు తగ్గిన తర్వాత రైతులు పాటించవలసిన యాజమాన్య పద్ధతులు