పసుపు మన దైనందిన జీవితంలో ఒక భాగం. పసుపుతో అనేక లాభాలు ఉన్నాయి. మన భారతీయ సంస్కృతి పసుపుతో ముడిపడి ఉంటుంది. కానీ పసుపు సాగు చాలా తక్కువ. పసుపు పండించే రైతులు అరుదుగా ఉంటున్నారు. దిగుబడి ఉండదని కొందరి అపోహ. కానీ పసుపుని సక్రమంగా పండిస్తే అధిక లాభాలు గడించవచ్చు. పసుపు దుంపజాతి మొక్క. పచ్చ బంగారంగా పిలువబడే పసుపు పంట గురించి తెలుసుకుందాం.
పసుపు పంట వేయాలనుకునే వారు మే మొదటి వారం నుండి జూన్ వరకు వేయవచ్చు. అయితే దీన్ని సాగు చేయాలంటే ఇసుక నేలలు, ఒండ్రు మట్టి నేలలు, గరప నేలలు బాగా సౌకర్యవంతంగా ఉంటాయి. ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే..పసుపు సాగుకు మురుగు నీటి పారుదల వసతి తప్పని సరి అంటున్నారు నిపుణులు. ఎందుకంటే మురుగు నీరు పారడం వలన పసుపు దుంప కూలిపోకుండా ఉంటుంది. మురుగు నీటి వసతి లేనందున దుంప కుళ్ళి మొక్కలు చనిపోతాయి. ఇదే జరిగితే రైతు నష్టాలు పాలవుతాడు.పంటను ఎత్తు మడుల పద్ధతి, బోదెల పద్ధతిలో సాగు చేస్తారు. బోదెల పద్ధతిలో 45 నుడి 50 సెంటీమీటర్ల దూరం ఉండేలా తయారుచేసుకోవాలి. బోదెల మీద 25 సెంటీమీటర్ల దూరంలో దుంపలు నాటుకోవాలి. ఎత్తు మడుల పద్ధతిలో మీటరు వెడల్పు, 15 సెంటీమీటర్ల ఎత్తుగల మడులు తయారు చేసుకొని, మడుల మధ్య 30 సెంటీమీటర్లు, దుంపల మధ్య 25 సెంటీమీటర్ల దూరం ఉండేలా నాటుకోవాలి.
కలుపు సమస్య ఎక్కువగా ఉన్న నేలల్లో పసుపు దుంపలు నాటిన మరుసటిరోజే అట్రజిన్ కలుపు మందును ఎకరాకు 600-800 గ్రా. 200 లీటర్ల నీటిలో కలిపి నేల మొత్తం పిచికారి చేసుకోవాలి.దుంపలు నాటిన 40-45 రోజులకు కలుపు నివారణ చర్యలు తీసుకోవాలి. నేల మరియు కలుపు ఉధృతి బట్టి వంట కాలంలో 3 -4 సార్లు పలు దఫాలుగా కలుపు నివారణకు అంతరకృషి చేపట్టాలి. పంట వేసుకునే ముందు పశువుల ఎరువు ఎకరానికి 10-15 టన్నుల వేసుకొని దుక్కి చేసుకోవాలి. పశువుల ఎరువు వెయ్యలేకపోతే చివరి దుక్కిలో ఎకరానికి 200 కిలోల వేపపిండి మరియు కానుగ పిండి లేదా 200 కిలోల సూపర్ ఫాస్ఫేట్ మరియు ఆముదం పిండి కలుపుకొని వేసుకోవాలి. చివరి దుక్కిలో జింక్ సాల్ఫేట్ వేసుకోవాలి. పసుపు నాటుకున్న 35-40 రోజుల మధ్య ఎకరానికి 50 కిలోల యూరియ మరియు 200 కిలోల వేపపిండి రెండు కలుపుకొని వేసుకోవాలి.
పసుపు పంటకు పైపాటుగా వేసే యూరియా, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఆకులపై వర్షపు నీటి బొట్లు, మంచు, తేమ లేనప్పుడు వేయాలి. లేకపోతే ఆకుల మీద పడ్డ రసాయనిక ఎరువులు ఈ నీటి బొట్ల మంచు బిందువుల్లో కరిగి గాఢత ఎక్కువై ఆకు మాడే ప్రమాదం ఉంది. అంతేగాక మొక్క లేత ఆకు కణజాలం దెబ్బతింటుంది. కాబట్టి రసాయనిక ఎరువులు చల్లేటప్పుడు సుడిలో పడకుండా మొక్కలకు 10-15 సెం.మీ. దూరంలో వేసి మట్టితో కప్పి తేలికపాటి తడి నివ్వాలి. నీటి యాజమాన్యం : తక్కువ వర్షపాత ప్రాంతాల్లో పసుపును నీటి వసతి క్రింద సాగుచేయాలి. పసుపు దుంపలు నాటిన వెంటనే ఒక నీటితడి తప్పనిసరిగా ఇవ్వాలి. తరువాత మొలకొచ్చి మొక్క భూమిమీద కనపడువరకు 4-6 రోజులకొకసారి నీరివ్వాలి. భూ భౌతిక, వాతావరణ పరిస్థితులను గమనించి బరువైన నేలల్లో సాధారణంగా 15-20 సార్లు, తేలికపాటి నేలల్లో 20-25 సార్లు నీరు పెట్టాలి. అదేవిధంగా ఆకువల్ల సత్తువ, సేంద్రియ పదార్థం నేలకు అందుతుంది. అంతేకాకుండా ప్రధాన పోషకాలతో పాటు సూక్ష్మపోషకాలు కూడా పైరుకు అందుతాయి.
పసుపు పంట కోసం ఎంచుకున్న భూమిని లోతుగా దున్నుకోవాలి ఇలా దున్నుకోవడం వల్ల నేల వదులుగామారి పసుపుగడ్డ ఉరడానికి అనువుగా ఉంటుంది. అలాగే కలుపు విత్తనం చాలావరకు నాశనం అవుతుంది. ఒకేనేలలో వరుస రెండు పంటలు వేయకూడదు. పంట మార్పిడి పద్ధతిని పాటించాలి. మన రైతు సోదరులు చాల మంది పసుపు విత్తన శుద్ధి పాటించకపోవడం వల్ల పంట దిగుబడిలో చాల వరకు కోల్పోవడం జరుగుతుంది. విత్తనశుద్ధి చెయ్యడం వలన దుంప కుళ్ళు తెగులును చాల వరకు నివారించవచ్చు. విత్తనం వేసే ముందు డైమితోయేట్ 2 మీ.లీ / 1 లీటర్ నీటికి లేదా మోనోక్రోటోఫాస్ 1.5 మీ.లీ / 1 లీటర్ నీటికి కలుపుకొని 30 నిమిషాలపాటు ఈ ద్రావణంలో పసుపు దుంపలను ఉంచిన తరువాత విత్తుకోవాలి.
పంట వేసుకునే ముందు పశువుల ఎరువు ఎకరానికి 10-15 టన్నుల వేసుకొని దుక్కి చేసుకోవాలి.. పశువుల ఎరువు వెయ్యలేకపోతే చివరి దుక్కిలో ఎకరానికి 200 కిలోల వేపపిండి మరియు కానుగ పిండి లేదా 200 కిలోల సూపర్ ఫాస్ఫేట్ మరియు ఆముదం పిండి కలుపుకొని వేసుకోవాలి. చివరి దుక్కిలో జింక్ సాల్ఫేట్ వేసుకోవాలి.. పసుపు నాటుకున్న 35-40 రోజుల మధ్య ఎకరానికి 50 కిలోల యూరియ మరియు 200 కిలోల వేపపిండి రెండు కలుపుకొని వేసుకోవాలి.
#TurmericCropCultivation #TurmericFarming #Harvsting #Guide #eruvaaka