Turkey Poultry Farming: కోడి పిల్లలు, బాతు, నీటి తర్వాత టర్కీ ప్రముఖ స్థానాన్ని ఆక్రమించుకొన్నది. నీటిని ముఖ్యంగా మాంసం కొరకు పెంపకం చేస్తారు. వీటి పెంపకం మన దేశంలో పెద్ద నగరాలు, పట్టణాలలో చిన్న సంఖ్యలో పెంపకం చేస్తారు. కేరళ, తమిళనాడు, ఈస్ట్రన్ పార్ట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ యందు స్వదేశీ మరియు నాన్ డిస్ క్రిస్టిటివ్ టర్కీలను చిన్నసంఖ్యలో పెంపకం చేపడుతున్నారు. అయితే విదేశాల యందు ముఖ్యంగా యు.ఎస్.ఎ. కెనడా జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, నెదర్లాండ్స్ మరియు యు.కె.ల యందు టర్కీల పెంపకం మంచి స్థానాన్ని ఆక్రమించుకొని ఉన్నది. 2004 వ సంవత్సరం లెక్కల ప్రకారం ప్రపంచపు టర్కీ మాంసం 4.94 మిలియన్ల టన్నులుగా లెక్కించడమైనది.
టర్కీల చరిత్ర:- ఇది పెద్ద గ్యాలియోనియస్ పక్షి. ఇవి ఉత్తర మరియు మధ్య అమెరికా ప్రాంత దేశాలకు చెందినవి. యూరోప్ మరియు ఇతర దేశాలకు వ్యాప్తి చెందాయి. ప్రపంచంలో టర్కీల జనాభా సుమారు 50 కోట్లు, వీ దీనుండి మాంసం ఉత్పత్తి 2004 వ సంవత్సరపు అంచనాల ప్రకారం 49.4 లక్షల టన్నులు.
టర్కీ ఇన్ ఇండియా:- ప్రస్తుతం ఈ పెంపకం బాల్య దశలో ఉన్నది. పెంపకానికి గాను ఐ.సి.ఏ.ఆర్. విభాగం ఎ గారు దక్షిణ భారత దేశంలో బెంగళూరులోని హెస్పరఘట్ట నందు టర్కీల అభివృద్ధికి గాను టర్కీ ఫారమ్ ను ప్రారంభించడమైనది. కేరళ మరియు తమిళనాడు వారు ప్రస్తుతం టర్కీ పెంపకంలో దేశంలో ముందంజలో ఉన్నారు..ప్రస్తుతం దక్షిణ భారత దేశంలో ఈ పెంపకానికి చాలా మంది ఆసక్తి చూపుతున్నారు.
Also Read: Disease in Turkey Rearing: టర్కీ కోళ్ల లో వచ్చే వ్యాధులు.!
టర్కీ కోళ్ళకు ఎక్కువ ప్రోటీన్స్, మినరల్స్ మరియు విటమిన్స్ చాలా అవసరం సాధారణ కోళ్ళ కంటే వీటికి ఫీడింగ్ ధర చాలా ఎక్కువ 1 కేజి మాంసోత్పత్తికి 2.5 కేజీల దాణా అవసరం. పౌల్ట్ లలో కెనబాలిజమ్ వంటి లక్షణాలు. నిర్మూలించుటకు డీ-బీకింగ్ చేయుదురు. దీనిని హ్యచరీ లెవెలో అంటే పౌల్ట్స్ కు ఒక రోజు వయస్సు నుండి 3-5 వారా లలోపు చేయుదురుటో-క్లిపింగ్ కూడా హాచెల్ లెవెల్ లోనే చేస్తారు. ముక్కు దగ్గర వ్రేలాడుతున్న భాగం తీసివేయు _టనుడి మూడింగ్ అంటారు. డిస్ మూడింగ్ను ఒక రోజు వయస్సు నుండి 3-5 వారాల లోపు చేస్తారు. దీని వ లనగాయాలు కాకుండావ్యాధులు రాకుండా ఆరికట్టవచ్చు.
టర్కీల యాజమాన్యం:- టర్కీ కోళ్ళు సుమారు 7 నెలలకు పూర్తిగా పరిణతి చెంది సంవత్సరానికి సుమారు 80 నుండి1 00 గ్రుడ్లు పెట్టగలవు. గుడ్డు కొద్ది పాటి గోధుమ వర్ణం కలిగి 85 గ్రాముల బరువు తూగుతుంది. ఫలధీకరణం చెందిన టర్కీ గుడ్లు 28 రోజులకు పొదగబడుతాయి. కోడి గుడ్లు మాదిరిగానే వీటికి కూడా పొదుగు యంత్రం లేదా పొదుగుడు. కోడి సహాయంతో పిల్లలను తీయవచ్చు. పొదగబడిన పిల్లలను మొదటి 6 లేదా 8 వారాల వరకు వాతవరణ పరిస్ధితులను బట్టి కోళ్ళ మాదిరిగానే వీటికి కూడా ” బ్రూడింగ్ చేయాలి.
బ్రూడింగ్:- మాములు కోళ్ళకు బ్రూడింగ్ ఏ విధంగా చేయుదురు. వీటికి కూడా అదే రీతిలో చేయాలి. టర్కీలలో O – 4 వారాలు వరకు బ్రూడింగ్ చేస్తారు. అయితే చలికాలంలో 5 6వారాల వరకు బ్రూడింగ్ పొడిగించవచ్చు. అయితే వీటికి హెవర్ క్రింద కోళ్ళు కంటే ఎక్కువ స్థలం కావాలి. ఒక్కోక్క బ్రూడరు క్రింద 50 టర్కీ పిల్లలను ఉంచాలి. ఇది పొదిగిన 45 గంటలలో వీటికి ఫీడ్, నీళ్ళు ఇవ్వవలెను. వీటికి 10 పిల్లలకు 100 మీ.లీ. పాలతో పాటు ఒక ఉడక పెట్టిన గుడ్డు మొదటి రెండు వారాల వరకు ఇవ్వాల్సి ఉంటుంది. బ్రూడింగ్ కొరకు ఉష్ణోగ్రత 98 డిగ్రీలు ఉండాలి.
టర్కీలు పచ్చని మేలు రకాల గడ్డిని తినడం ఇష్టపడతాయి కనుక ఎదిగే సమయంలో గడ్డిని చిన్న చిన్న ముక్కలుగా చేసి ఇస్తే ఆరోగ్యం మరియు పెరుగుదల బాగుంటుంది. వీటిని కోళ్ళ మాదిరిగానే ఊక చల్లిన నేల మీద లేదా బ్యాటరీ బ్రూడరు నందు పెంచవచ్చు. లిట్టరు ఎల్లప్పుడూ పొడిగా ఉండేట్లు తగు చర్యలు తీసుకోవాలి.
Also Read: Emu Chicks Management: ఈము పెంపకంలో ఎదిగే పిల్లల యాజమాన్యం.!