Tumba Farming: తక్కువ వర్షాపాతం ఉన్న ఎడారి ప్రాంతాలలో పంటలు పండించడం రైతులకు చాలా కష్టం. కానీ కలుపు మొక్కగా పేరుగాంచిన తుంబ సాగు ఎడారిలో గు లక్షలు సంపాదిస్తున్నారు. ఔషద గుణాలు అధికంగా ఉండడంతో నేడు ఈ మొక్కి అధిక డిమాండ్ ఏర్పడింది. మీరు గృహావసరాల కోసం తుంబా పొడిని తయారు చేసి మార్కెట్‌లో విక్రయించడం ద్వారాకూడా రైతులకు మంచి ఆదాయ వనరుగా మారింది. తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో తుంబ లాభాలను పొందవచ్చు.
అంతేకాదు నేల సంరక్షణలో కూడా ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. పొట్టను శుభ్రపరచడం, మానసిక ఒత్తిడి, కామెర్లు, మూత్ర సంబంధిత వ్యాధులకు ఇది దివ్య ఔషధం. దీని పండ్ల గుజ్జును ఎండబెట్టి ఔషధంగా ఉపయోగిస్తారు. జూన్-జూలై సమయంలో దీనిని ఎక్కువగా సాగు చేస్తారు. 150 నుంచి 300 మి.మీ వర్షపాతం నమోదయ్యే ప్రాంతాల్లో ఈ పంట నుంచి మంచి దిగుబడి పొందవచ్చు. దీని విత్తనాలు 3 మీటర్ల దూరంలో 1-1 మీటర్ల వరుసలలో విత్తుతారు. ఒక ఎకరానికి 250 గ్రాముల విత్తనం సరిపోతుంది.
Also Read: కొర్రసాగుతో – ఆరోగ్యం మీ సొంతం
తుంబాను నారు ద్వారా మార్పిడి చేస్తారు. ఈ పద్ధతి ద్వారా విత్తనాల అవసరం సగానికి తగ్గిస్తారు. ఈ మొక్క పండ్లు నవంబర్-డిసెంబర్‌లో పసుపు రంగులోకి మారడం ప్రారంభిస్తాయి. అప్పుడు రైతు సోదరులు వాటిని కోసి వాటి నుంచి విత్తనాలను వేరు చేస్తారు. ఒక ఎకరంలో 2 క్వింటాళ్ల విత్తనాలు, 3 నుంచి 3.5 క్వింటాళ్ల వరకు పండ్లు పండుతాయి.
ఉపయోగాలు: తుంబని ఆయుర్వేదంలో ఎక్కువగా వాడుతారు. ఇది జలుబు, ఉదర వ్యాధులు, కఫం, కుష్టు, జ్వరాలను తొలగిస్తుంది. తుంబా సీడ్ ఆయిల్‌ను కొబ్బరినూనెతో కలిపి తలకు క్రమం తప్పకుండా మసాజ్ చేయడం వల్ల తెల్లబడిన జుట్టు నల్లగా మారుతుంది. తుంబ వేరు పొడికి బెల్లం కలిపి వాడితే కామెర్లు నయమవుతాయి.
Also Read: వ్యవసాయ ఉత్పత్తికి గ్రీన్ హౌస్ టెక్నాలజీ