ఉద్యానశోభమన వ్యవసాయం

Tulasi Cultivation: తులసి సాగులో మెళుకువలు.!

2
Tulasi
Tulasi

Tulasi Cultivation: మనదేశస్తులు దీనిని పవిత్రంగా పెంచి, పూజించడమే గాక, నిత్య జీవితంలో సంభవించు అనేక వ్యాధుల నివారణకు ఉపయోగిస్తున్నారు.

తులసి నుండి సుగంధ తైలము కూడా తీసి వివిధ పరిశ్రమలలీ ఉపయోగిస్తారు. తులసి ఇండియాలోనేకాక థాయిలాండు, గ్వాటిమాలా, కొన్ని ఆఫ్రికా దేశాలలో కూడా పండించబడుచున్నది. మనదేశంలో ఉత్తరప్రదేశ్ లోని రాంపుర, చందౌసీ, కనేజ్, లక్నో, మైనపురి మొదలైన ప్రాంతాలలో ఎక్కువగా పండిస్తున్నారు.

అన్ని రకములైన భూములలోని ఇది ప్రక్రుతి సిద్ధంగానే పెరుగుతుంది. నీరునిలిచే ప్రదేశాలు పనికిరావు. భూమి పిహెచ్ 5.0 నుండి 8.5 దీనికి అనుకూలం. పర్వత ప్రాంతాలు, మైదాన ప్రాంతాలలో కూడా బాగుగా పెరుగుతుంది.

వాతవరణ కాలుష్యాన్ని పోగట్టి పరిసరాలను శుభ్రపరుస్తుంది. దీని సేవన వలన నోటిలోని క్రిములను హరించి, దుర్వాసనను పోగట్టి చిగుళ్ళకు, గొంతుకు స్వస్థత చేకూరుస్తుంది.కఫమును పోగట్టి జలుబు, రొంప, దగ్గులను నివారిస్తుంది. జ్వరము, చర్మ వ్యాధులలో అమోఘంగా పనిచేస్తుంది.సౌందర్య సాధనాలలో ఉపయోగించబడుతుంది.తులసి తైలములో డెంటల్ క్రీములు, టూత్ పేస్టులు తయారుచేస్తారు.తులసి తైలాన్ని స్ప్రేలలో, పన్నీరులో, స్వీట్లలో వాడుతారు.

Tulasi Cultivation

Tulasi Cultivation

Also Read: Diseases in Duck Rearing: బాతుల పెంపకంలో వచ్చు వ్యాధులు.!

వాతావరణం:

14 డిగ్రీల నుండి 30 డిగ్రీల సెంగ్రే వాతావరణంలో యిది బాగుగా పెరుగుతుంది. మంచుపడి వాతావరణం అనుకూలం కాదు.

విత్తనము:

ఇది విత్తనాల ద్వారా ప్రవర్ధనము చేయబడుతుంది. ఎకరానికి 200 గ్రాముల విత్తనం అవసరమౌతుంది. విత్తనానికి 8 రెట్ల ఇసుకతో కలిపి తయారు చేసుకొన్న నారుముళ్లలో ఎప్రిల్, మే నెలలో చల్లుకొని నారు పెంచుకోవాలి. ఒక నెలలో నారు నాటుకువస్తుంది. 8-13 రోజులలో మొత్తం విత్తనం మొలకెత్తుతుంది.

ఎరువులు:

బాగుగా చిలికిన పశువుల ఎరువు ఎకరానికి 6-8 టన్నులు వేయాలి.

నత్రజని: ఫాస్పరస్ : పొటాష్ : 48:120:24

భూమి తయారు:

భూమిని ఒకసారి లోతుగా దున్నుకొని పశువుల ఎరువు వేసి, భూమిలో బాగుగా కలిసేట్లు గుంటక తోలుకోవాలి. మొక్కలు నాటే ముందు తిరిగి దున్నుకొని రసాయనిక ఎరువువేసి నాగలితో సాళ్లు తోలుకోవాలి.

నాటు:

బాగుగా తయారుచేసుకొన్న భూమిలో 40 సెం.మీ 40 సెం.మీ అంతరంతో మొక్కలను నాటుకోవాలి.

నీటి ఆవశ్యకత: నాటిన ఒక నెలవరకు వారానికి 2 సార్లు, మెక్కలు కుదురుకున్న తరువాత, వాతావరణ, భూ పరిస్థితులను బట్టి వారానికొకసారి నీరివ్వాలి.

అంతర సేద్యం:

మొక్కలు నాటిన 30 రోజులకు ఒకసారి, 60 రోజుల తరువాత మరొకసారి కలుపు తీసుకోవాలి. ఆ తరువాత మొక్కలు పెరిగి విస్తరించబడిన కలుపు తీసుకొని ఎరువులు వేస్తుండాలి.

Also Read: Weeding in Wheat: గోధుమ పంటలో కలుపు మరియు ఎరువుల యాజమాన్యం.!

Leave Your Comments

Diseases in Duck Rearing: బాతుల పెంపకంలో వచ్చు వ్యాధులు.!

Previous article

Coconut Fruit Drop: కొబ్బరిలో పిందెలు రాలటాన్ని ఇలా నివారించండి.!

Next article

You may also like