మారుతున్న కాలమాన పరిస్ధితుల వలన “ఒంగోలు” జాతి పశువులు అంతరించిపోయేదశకు చేరినవి. ఇటువంటి మేలుజాతి పశువులను తక్కువ వ్యవధిలో ఎన్నో రెట్లు పెంపొందించుకోనేందుకు కృత్రిమ గర్భత్పత్తి విధానం కంటే పిండోత్పత్తి మరియు పిండమార్పిడి ప్రక్రియ ఎంతో ఉపకరిస్తుంది.
పిండదాత (Donor) మరియు పిండగ్రహీతల (Recipient) ఎంపిక :
-
జన్యుపరంగా అత్యుత్తమైన మరియు పునరోత్పత్తి లోపాలు లేని ఆవు/గేదెలను మాత్రమే పిండదాతలుగా ఎంపిక చేయాలి. అలా ఎంపిక చేయబడిన పశువు నుండి సుమారు నాలుసార్లు పిండసేకరణ చేయాలి. పిండగ్రహీతలను జన్యుపరంగా విలువ లేనివైనప్పుటికీ పునరుత్పత్తిలో ఎటువంటి లోపాలు లేని వాటిని మాత్రమే ఎంపిక చేయాలి. తిరగకట్టే పశువులు, అస్తవ్యస్త ఎదకాలం, గర్భకోశవ్యాధులు మరియు ఇతర లోపాలున్న పశువులను పిండసేకరణకు గాని పిండగ్రహీతకు గాని వాడరాదు.
అత్యధిక ఆండాల విడుదల ప్రక్రియ (Super ovulation of donors)
-
ఎంపిక చేయబడిన పిండదాతకు ఎదకు వచ్చిన పది రోజుల తర్వాత “ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోను” అను ఇంజక్షన్ ను కనీసం 4-5 రోజులు ఇస్తారు. ఈ హోర్మోను ప్రభావం వలన పిండదాత ఎదకు వచ్చి ఒక అండానికీ బదులుగా మరిన్ని అండాలు విడుదల చేస్తుంది. ఈ అండాల విడుదల 24 నుండి 36 గం.ల వ్యవధిలో మేలుజాతి వీర్యదానం (Al) చేయాలి.
పిండసేకరణ విధానం
-
ఇది వరకు శస్త్రవిధానం ద్వారా గర్భాశయం నుండి పిండసేకరణ చేసేవారు. ఇది కష్టసాధ్యమయిన పని ఏ గాక పిండదాతకు ఎక్కువ సార్లు ప్రక్రియ వాడే వీలు కాదు. ప్రస్తుతం నాన్ సర్జీకల్ విధానం ద్వారా పిండసేకరణ చేస్తున్నారు. ఒక ప్రత్యేకమయిన రష్కధేటర్ (Ruschcathetor) ను గర్భాశయ నాళం చివరి భాగానికి పంపిస్తారు. Y ఆకారంలోని రెండు వాల్వులున్న ట్యూబులను ఈ కధేటర్ యొక్క మరొక కొనకు జతపరచాలి. ఫాస్పెట్ బఫర్ (పి.బి.యస్) మీడియం ఒక ట్యూబు ద్వారా గర్భాశాయంలోనికి పంపించి రెండవ ట్యూబు ద్వారా పిండాలను బయటకు రప్పించి మరొక ఫిల్టరులోనికి తీసుకుంటారు.
Also Read : పశువులకు పుష్టి – హెర్బల్ మిక్చర్
పిండాల గ్రేడింగు
-
ఫలదీకరణం చెందిన 6-7 రోజులకు పిండాల మార్యులు (Morula) మరియు బ్లాస్టాసిస్ట్ (Blastocyst) దశకు చేరుకుంటాయి. ఈ రెండు దశల పిండాలను మాత్రమే ద్రవనత్రజని యందు నిల్వచేసేందుకు వీలుకలుగుతుంది.
-
ఫిల్టరు నుండి పిండాలను పెట్రిడిష్ నందు తీసుకుని దశల వారిగా గ్రేడింగ్ చేస్తారు. మొదటి గ్రేడుల పిండాలను వెంటనే పిండ గ్రహీతలకు పిండదానం చేయాలి. పిండమార్పిడి ప్రక్రియ అత్యంత సుక్లిస్టమయిన అధునాతన ప్రక్రియ.
పిండోత్పత్తి మరియు పిండమార్పిడి ప్రక్రియ ఎందుకు చేపట్టాలి
-
నాణ్యమైన పాలసార మరియు జాతి లక్షణాలు గల పశువు జన్యువులను తక్కువ కాల వ్యవధిలో ఎన్నోరెట్లు చేయవచ్చు.
-
మేలుజాతి అంబోతుల ఎంపిక సులభతరమవుతుంది. అలా ఎన్నిక చేయబడిన అబోతులను కృత్రిమ గర్బోత్పత్తి ప్రోగ్రామునుందు వాడవచ్చు.
-
ఏ నాటికి అంతరించి పోవు పశుజాతులను కాపాడుకోవచ్చు.
-
పిండమార్పిడి ద్వారా పుట్టిన సంతతికి నూటికి నూరుపాళ్ళు జన్యుమార్పిడి జరుగుతుంది.
-
వయసు పైబడినప్పటికి, విలువైన పశువుల నుండి సంతతిని పెంపొందించవచ్చు.
-
పాలసార తక్కువగా వున్న నాటు జాతి పశువులను సవతి తల్లులుగా (surrogate mothers) గా వాడవచ్చు.
ఈ అంతర్జాతీయ రవాణా ద్వారా పశువులను కొనుగోలు చేయుట కష్టతరం. ఖరీదుతో కూడినది. ఇలాంటపుడు పిండాలను సులభతరంగా అతి తక్కువ ఖర్చుతో రవాణా చేసుకొనవచ్చు.
పిండమార్పిడి వలన కలిగే ప్రయోజనాలు :
-
అధిక పాలసార వున్న అవు/గేదె నుండి ఒకే సంవత్సరంలో 8 నుండి 10 దూడలు పొందవచ్చు. సాధారణ పద్ధతిలో ఇన్ని దూడలు పుట్టించుటకు కనీసం 15 సంవత్సరాలు పడుతుంది.
-
రైతులు తమ నాటు జాతి పశువు నుండి ఒకే సంవత్సరంలో నూరు శాతం మంచి జాతి లక్షణాలు గల దూడలను పొందవచ్చు.
పిండమార్పిడి పశువుల ఎంపిక – జాగ్రత్తలు :
-
పిండదాత అధిక పాలసార కలిగి పునరుత్పత్తి లోపాలు లేనిదై వుండాలి
-
జన్యుపరంగా నాశిరకమయినను, పిండగ్రహీత కూడ పూనరుత్పత్తి లోపాలు లేనిదైవుండాలి.
-
తిరగకట్టె పశువులు, అస్తవ్యస్త ఎదకాలం గర్భకోశ వ్యాధులు మరియు లోపాలున్న పశువులు పిండదాతలుగా మరియు పిండగ్రహీతలుగా పనికిరావు.
డాక్టర్.జి.రాంబాబు, పశు వైధ్యాధికారి, కడప.
Also Read: పశువుల ఆరోగ్య పరిరక్షణలో పరాన్నజీవుల నివారణ..
Leave Your Comments