Transesterification in Jatropha: ఇది పొద ప్రధాన కాండం నుండి ప్రక్క కొమ్మలు ఎక్కువగా వేస్తుంది. జట్రోఫా షుమారు 3-4 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. ఆకులు పొడవు 10-15 సెం.మీ., 7-12 సెం.మీ., వెడల్పుతో చివర్లు ఉంటాయి. పుష్పాలు పసుపు ఆకుపచ్చ రంగులో ఉండి వదులుగా పుష్పగుచ్ఛమును కలిగి ఉంటాయి. సంవత్సరంలో రెండు సార్లు మార్చి-ఎప్రిల్, సెప్టెంబర్-అక్టోబర్ లో పుస్తాయి. పరిపక్వం చెందిన పండ్లు పసుపు వర్ణంలో ఉండి. 2-5 సెం.మీ., సైజును కలిగి ఉంటాయి. విత్తనాలు అముదం విత్తనాలను పోలి ఉండి, 1.8-2.0 సెం.మీ., పొడవు ,అండాకారంలో ఉండి, పై పొర నల్లగా ఉంటుంది.
Also Read: Tobacco Cultivation Techniques: ఆరోగ్యవంతమైన పొగాకు నారు పెంపకంలో మెళుకువలు.!
ఉపయోగాలు:
i) జట్రోఫా గింజల నుండి తీసిన నూనెను కందకం, సబ్బులు మరియు క్రొవ్వొత్తుల తయారీ పరిశ్రమల్లో వాడతారు. వెంట్రుకల పెరుగుదలను ప్రేరేపించుట వలన దీనిని తైలం వులలో గాయలకు మందుగా ఉపయోగిస్తారు. తయారీలో ఉపయోగిస్తారు.
ii) గింజలలో 4.44% నత్రజని, 1.4% ఫాస్ఫరస్, 1.2% పొటాష్ ఉండుట వలన సేంద్రీయ ఎరువుగా ఉపయోగిస్తారు.
iii) ఇంగ్లాండులో ఉన్ని తయారీలో, చైనాలో (Non or semi drying ) ఆల్కలాయడ్స్ (Alkaloids) తయారీలో ఉపయోగిస్తారు. జట్రోఫా నూనెను ఐరన్ ఆక్సైడ్తో మరిగించడం వలన వార్నిష్ తయారవుతుంది.
iv) పోషకాలు లేని నిస్సార భూముల్లో కూడా పెరుగుతుంది. ఇటువంటి భూముల్లో కూడా హెక్టారుకు 1-2 టన్నుల నూనె దిగుబడి లభిస్తుంది.
ట్రాన్స్ ఎన్దరిఫికేషన్:
జీవ ఇంధనాన్ని మిథైల్ ఎస్టర్ నుండి ట్రాన్స్ ఎస్టరిఫికేషన్ అనే పద్ధతిలో తయారు చేస్తారు. ఆయిల్ ఎక్స్ఫల్లెర్లో కంప్రషన్ చాంబర్ మరియు కుక్కర్ అమరికలో చిన్న మార్పు చేసి నూనెను తీస్తారు. జట్రోఫా నూనెను (NO) మరియు (KOH) ఉత్ప్ర్పేరకాలను మిధనాలుతో చర్య జరిపితే మిథైల్ ఎస్టర్స్ మరియు గ్లిసరాలు ఏర్పడును. 65°జ దగ్గర నూనెను వేడి చేయాలి. ద్రావణం తయారు చేయుట కొరకు (NAOH) గుళికలను మిథనాలులో కరిగించాలి. మొత్తం జట్రోఫా నూనెలో NAOH/ ICOH 2% మరియు మిథనాలు 25-30% ఉ డాలి. ఈ ద్రావణాన్ని జట్రోఫా నూనెలో కలిపి 5-7 నిమిషాలు కలపాలి. 4 గంటల వరకు ఈ ద్రావణాన్ని కదపకూడదు. గ్లిసరాల్ అడుగుభాగములో చేరుతుంది. మరియు బయోడీజిల్ను పై భాగము నుండి వేరు చేయవచ్చు. నూనెను 2-3 సార్లు నీటితో కడిగినచో సోడియం లాంటి అవశేషాలను తొలగించవచ్చు.నూనెలో నీటిని పోసి 5 నిమిషాలు తరువాత పైకి తేలిన నూనెను తీసుకోవాలి. ఈ పద్ధతి పరుమార్లు చేయాలి. చివరిగా నూనెను నీటిని ఆవిరి చేయడానికి నూనెను వేడి చేయాలి. అప్పుడు బయోడీజిల్ తయారవుతుంది.
Also Read: July Month Cultivation Works: జులై నెలలో చేపట్టవలసిన సేద్యపు పనులు.!