Tobacco Cultivation: ఇండియాలో పెంచే ముఖ్య మత్తు, ఉత్తేజము కల్గించే పదార్థాలు పంటలలో పొగాకు ఒకటి. ఈ పంటను దాని ఆకుల కోసం పెంచుతారు. వాటిని పదును చేసిన తరువాత పైపు కాల్చడానికి చుట్ట, సిగరెట్, హుక్కా, పీల్చడానికి నశ్యంగాను అనేక రూపాలలో నమలడానికి ఉపయోగిస్తారు.పొగాకు అనేక రకాల పరిస్థితులలో పెంచుతారు. ఉష్ణమండలం నుండి ఉప ఉష్ణమండలం, సమశీతోష్ణమండలం వరకు విస్తరిస్తుంది.
Also Read: Food Poisoning in Rainy Season: ఫుడ్ పాయిసనింగ్ గురించి ప్రతి ఒకరు తెలుసుకోవలసిన విషయాలు.!
ఇండియాలో దీని సాగు విస్తారంగా వితరణ చెందింది. ఇండియాలో 4.5 లక్షల హెక్టార్ల విస్తీర్ణం నుండి ఉత్పత్తి సుమారు 700 మిలియన్ కిలోగ్రాముల ఆకు ప్రపంచంలో “యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా” తర్వాత ఈ ఉత్పత్తి అతి పెద్దది. దీని వల్ల సాలీన ఎక్సైజ్ ఆధార 9100 కోట్లు విదేశీ మారకం సుమారు 1713 కోట్లు లభిస్తుంది. ఇండియాలో ఇది ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక, బీహార్, పశ్చిమ బెంగాగ్, ఉత్తర ప్రదేశ్, ఒడిస్సా, పంజాబ్, కేరళలో సాగు చేయబడుతుంది. వర్జీనియం పొగాకు విస్తీర్ణంలో (1.2 ల. హెక్టారులు) ఆంధ్రప్రదేశ్ మొదటిస్థానంలో ఉంది. 250 మిలియన్ కిలోల ఆకు ఉత్పత్తితో ద్వితీయ స్థానంలో ఉంది. ఇండియాలో ఉత్పత్తి అయిన 2/3 పరిమాణం ప్రస్తుతం ఎగుమతి అవుతుంది.పొగాకు ఎక్సైజ్ సామాగ్రిలో 3 వ స్థానంలోనూ, ఎగుమతి సామాగ్రిలో 9వ స్థానంలో ఉంది.
నేలలు:
ఉత్పత్తి చేసిన పొగాకు రకం శ్రేణి, నాణ్యత చాలా వరకు నేల అభిలక్షణాల వల్ల ప్రత్యేకించి మృత్తిక వయనం వల్ల ప్రభావితం అవుతాయి. తేలిక నేలల్లో (ఇసుక లోమ్లు ) పెద్ద ఆకులు, బరువు తక్కువ. లోత రంగు, ఘాటు తక్కువ బలహీనమైన సువాసన ఉత్పత్తి అయ్యే ప్రవృత్తి కనిపిస్తుంది. భారీ నేలల్లో సాధారణంగా మందమైన, బరువైన, ముదురు రంగు, ఘాటైన సువాసన గల ఆకులు ఉత్పత్తి అవుతాయి. అయితే కొన్ని బీడీ పొగాకులుతేలిక, బరువు నేల అభిలక్షణాల వల్ల ప్రభావితం కావు. సాధారణంగా పొగాకు ఇసుకలోమి ఉపరితల మృత్తిక, కొద్దిగా సూక్ష్మమైన (లోమ్ నుండి బంక మట్టి వరకు) ఉప మృత్తిక, మంచి మురుగు పారుదల, వాయు ప్రసరణ, అధిక తేమ నిలుపుకునే సామర్ధ్యం గల చోట్ల బాగా పెరుగుతుంది. ఇండియాలో ఎఫ్.సి.వి (F.C.VO పొగాకు క్రింద, మొత్తం విస్తీర్ణంలో 60% వరకు ఉంటుంది. ప్రకాశం, గుంటూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలలో ఎఫ్.సి.వి (F.C.V.) పొగాకును విస్తారంగా సాగు చేస్తారు.
ఈ నేలలే కాకుండా ఎఫ్.సి.వి (F.C.V.) పొగాకును ఖమ్మం, తూర్పుగోదావరి జిల్లాలలో నదీశయాల మీద కూడ పెంచుతారు. ఇక్కడ నేలలు ఒండ్రుతో కూడిన మేట వేసిన లోమ్లు వీటి సారవంత స్థాయి ఎక్కువ. యఫ్.సి.వి (F.C.V.) ని కర్ణాటక, గుజరాళ్లలో నీటి పారుదల గల ఇసుక లోడ్ల మీద (తేలిక నేలలు) కూడా పెంచుతారు. బీడి పొగాకును గుజరాత్లో ఒండ్రు నేలలమీద, కర్ణాటక, మహారాష్ట్రలలో నల్ల బంకమట్టి నేలల మీద సాగుచేస్తారు. చుట్ట, చెర్రూట్ పొగాకులను తమిళనాడులో తేలిక నేలలమీద పెంచుతారు. నమిలే పొగాకును వివిధ మృత్తిక పరిస్థితులలో పెంచుతారు. హుక్కా పొగాకును బీహార్, ఉత్తర ప్రదేశ్, పశ్చిమబెంగాల్లలో ఒండ్రు నేలల్లో పెంచుతారు. భారత దేశంలో పొగాకు పెంచే నేలల్లో సాధారణంగా కర్బనం, నైట్రోజన్, తక్కువగా వుంటాయి.
ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాలలో నల్లనేలలు అధికంగా బంకమట్టితో కూడుకుని ఒక మాదిరిగా క్షార పి.హెచ్.(7.8-8.7)ఉంటుంది. 4.5-5% నేలలలో కాల్షియం కార్బోనేట్తో అవి కాల్కేరియస్గా ఉంటాయి. వాటి జలాధారాణ శక్తి చాలా ఎక్కువ 70% దాకా ఉంటుంది. కనుక వానాకాలం నుండి సంరక్షింపబడిన తేమతో శీతాకాలంలో పొగాకు పెంచవచ్చు. కాని ఈ మృత్తికలలో మురుగు పారుదల ఎక్కువ.
ఒక మాదిరి లోతుగల ప్రకాశం, నెల్లూరు, పశ్చిమ గోదావరిలో కొన్ని ప్రాంతాలలో మురుగునీరు పారుదల బాగా వున్న ఎర్రనేలలు, ఒక మాదిరి జలాధారణ శక్తి కలిగి చాలా మంచి నాణ్యత గల ఆకును ఉత్పత్తి చేస్తాయి. ఈ నేలలు (6.7-7.5) పి.హెచ్. తో తటస్థంగానూ, హానికర ద్రావణీయకాలు లేకుండా సారవంతత స్థాయిలో తక్కువ నుంచి మధ్యరకంగా ఉంటాయి.
నాటు పొగాకు పశ్చిమ గోదావరి, కృష్ణ, గుంటూరు, ప్రకాశం, ఖమ్మం, కర్నూలు, అనంతపురం జిల్లాలలో పెంచుతారు. శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలలో కూడా చుట్ట నమలడం కోసం నాటు పొగాకు పెంచుతారు. నాటు పొగాకు పెంచే నేలలు గుంటూరులొ వలె బరువైన నల్ల బంకమట్టి నేలలనుండి పశ్చిమగోదావరి, శ్రీకాకుళంలోని ఇసుక, ఇసుకలోమ్ నేలల వరకు ఉంటాయి.
లంక పొగాకును పూర్తిగా గోదావరి ఒండ్రు నేలల్లో పెంచుతారు. వీటికి మృత్తిక తేమను నిలుపుకునే సామర్ధ్యం ఉంటుంది. గుంటూరు, ప్రకాశం జిల్లాలలోని నల్లనేలల్లో బర్టీ పొగాకు పెంచుతారు. బర్జీని వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, హైదరాబాద్, మెదక్, నల్గొండ జిల్లాల ఎర్రనేలల్లో (చల్కా) వర్షాధార పరిస్థితి క్రింద పెంచుతారు. ఈ నేలల్లో కర్బన పదార్ధం తక్కువగానూ నీరు నిలుపుకునే శక్తి సారవంతత స్థాయి తక్కువగా ఉంటాయి. ఈ నేలల నుంచి ఉత్పత్తి చేసిన ఆకు అధిక నాణ్యత కలిగి వుంటుంది.
Also Read: Integrated Farming: సమీకృత వ్యవసాయం తో రూ. 12 లక్షలు సంపాదిస్తున్నా రైతు