Tomato Diseases: టమాట పంటలో పొగాకు లద్దె మరియు అక్షింతల పురుగు యాజమాన్యం.
గుర్తింపు చిహ్నాలు:
- దీని రెక్కలు పురుగులు దృఢంగా ఉండి చాలాదూరం వరకు ఎగరగలవు.
ముందు జత రెక్కలు గోధుమరంగులో ఉండి, తెల్లని చారలు కలిగి ఉంటుంది. ఈ చారలు వెండిలాగా మెరుస్తూ ఉంటాయి. వెనక జత రెక్కలు తెలుపు రంగులో ఉంటాయి. - లద్దెపురుగులు బలిష్టంగా ఉండి నలుపురంగులో ఉండి ప్రక్కలకు పసుపురంగు మచ్చలుంటాయి.
Also Read: Fusarium Wilt in Tomato: టమాట ఫ్యుసేరియం వడలు తెగులును ఇలా నివారించండి.!
గాయపర్చు విధానం మరియు గాయం లక్షణాలు:
- లద్దెపురుగు తొలిదశలో గుంపులు గుంపులుగా ఆకుమీద పత్రహరితాన్ని గోకి తింటాయి. దీనినే “జిల్లెడ ఆకులు” అని అంటారు.
- పెరుగుతున్న కొద్ది లద్దెపురుగులు ఆకులను కొరికి తిని ఈనెలను మాత్రం మిగిలిస్తాయి.
- పైరు గూడు పూత కాయదశలో ఉండే బద్దెపురుగులు వాటిలోకి ప్రవేశించి వంకరటింకర రంధ్రాలు చేసిలోపలి పదార్థాలను తింటూ నష్టపరుస్తాయి.
- ఈ పురుగులు పగటిపూట మొక్కల మొదళ్ళలో భూమిలో దాగి ఉండి రాత్రిపూట ఆకులను తింటుంటాయి.
జీవితచక్రం:
- ఆడపురుగు (Female) సుమారు 500 గ్రుడ్లను గుంపులుగా పెడుతుంది. గ్రుడ్లను వెంట్రుకలతో కప్పివేస్తుంది.
- ఈ పురుగు ముఖ్యంగా భూమిలో, పైనకాలిన ఆకులలో, గూడులలో మట్టి పెళ్ళలలో కోశస్థదశలో ప్రవేశిస్తుంది.
అక్షింతల పురుగు:
కాక్సినెళ్లిడే కుటుంబానికి చెందిన పురుగులు బదనిక ఇవి మెత్తటి శరీరం కలిగిఉన్న పచ్చదోమ, పేనుబంక, తెల్లదోమ ఇతరేతర పురుగులను తింటాయి. ఈ ఒక్క పురుగు మాత్రమే పంటను నష్టపరుస్తాయి.
గుర్తింపు చిహ్నాలు:
- పెంకు పురుగులు గుండ్రంగా ఉంది వెడల్పుగా ఉంటాయి. 5mm పొడవు ఉండి 30mm వెడల్పుగా ఉంటాయి.
పెంకుపురుగు అడుగుభాగం చదునుగా పైభాగం ఉబ్బిత్తుగా ఉంటుంది. - ఇవి ఇటుక లేదా గాఢపసుపు రంగులో ఉంటాయి.
- రెక్కలపై 12-28 నల్లటి మచ్చలు ఒక క్రమపద్ధతిలో ఉంటాయి.
- పిల్లపురుగుల ముందుభాగం వెడల్పుగా ఉండి, వెనుకభాగం సన్నగా ఉండి శరీరమంతా ముళ్ళువంటి వెంట్రుకలతో కప్పబడి ఉంటాయి.
గాయపర్చు విధానం మరియు గాయం లక్షణాలు:
- పిల్ల మరియు పెద్ద పురుగులు పంటకు ఆశించి నష్టాన్ని కలిగిస్తాయి.
- Grubs తొలిదశలో ఆకుల అడుగుభాగంలో ఉండి పత్రహరితాన్ని గోకి తింటుంటాయి.
- Grubs వల్ల నిచ్చెన ఆకారంలో మచ్చలు ఏర్పడతాయి.
నివారణ చర్యలు:
- ఉదయం, సాయంత్రం వేళలలో Adult మందకొడిగా ఉంటాయి. కావున వాటిని ఏరి నాశనం చేయాలి.
- Grubs ఆశించిన ఆకులను మరియు గ్రుడ్లను ఆకులతో పాటు ఏరి నాశనం చేయాలి.
- ఎండోసల్ఫాన్ 2m|(కార్బరిల్ 3g/L వీటిలో కలిపి పంటలపై పిచికారి చేయాలి.
Also Read: Early blight of tomato: టమాట ఆల్టర్నేరియా ఎండు తెగులు లక్షణాలు మరియు నివారణ చర్యలు
Leave Your Comments