The wrath of nature is the same whether it is a farmer or a king
ప్రకృతి కోపానికి రైతైనా, రాజైనా ఒక్కటే. ప్రస్తుతం రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది. రెండు రాష్ట్రాలలో పంట వేసే కాలంలో అంటే జూన్, జూలై కాలంలో అధిక వర్షపాతం నమోదయింది. వ్యవసాయం ఈ సంవత్సరం అంతా చాలా మంచిగా ఉంటుందని ఎంతో ఉత్సాహంగా పంటలు వేసిన రైతుకి వర్షాలు లేక వచ్చేకొద్దీ చాలా విపరీతమైన పరిస్థితులు ఉత్పన్నమైనవి. రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షం లేక రైతులు ఆకాశం వంక చూసి దేవుడు ఎప్పుడు కరుణిస్తాడా అన్నట్లుగా ఉంది పరిస్థితి. రెండు తెలుగు రాష్ట్రాలలో రైతులు వర్షాలు లేక సరైన నీటిపారుదల వ్యవస్థ లేక పంటలకు తగు మోతాదులో నీళ్లు అందక పంటలు కళ్ళముందు ఎండిపోవడంతో చాలా దిగాలుగా ఉన్నారు. ఈ ప్రస్తుత పరిస్థితికి ప్రకృతి వైపరీత్యాలు ఒక కారణమైతే మరొక కారణం ప్రభుత్వం. ఒక విధంగా ముందు చూపు లేని రైతులు కూడా ఒక కారణం అని చెప్పవచ్చు. ఒకప్పుడు గ్రామాలలో, పట్టణాల్లో చెట్లు అధికంగా ఉండటం వల్ల వర్షాలు ఒక ఒక క్రమ పద్ధతిలో సమయానుకూలంగా వర్షాలు ఉండేవి. కానీ ఇప్పుడు పట్టణాల్లోనే కాదు గ్రామాల్లో ముఖ్యంగా పొలంలో కూడా ఎక్కడా చెట్లు కనపడే పరిస్థితి లేదు. రైతులకు ముందుచూపు అనేది లేకుండా చెట్లు కొట్టేయడం వల్ల మనకి తుఫాన్లు వచ్చినప్పుడు కానీ అధిక గాలి వచ్చినప్పుడు ప్రత్యక్షంగా అవి పంటల మీద పడి పంటలు మొత్తం కూడా నాశనం అయిపోతున్నాయి. మన ప్రభుత్వాలు కూడా వ్యవసాయానికి అధిక మొత్తంలో నిధులు కేటాయించినప్పటికి ఒక ప్రణాళిక అబద్ధమైన నీటి నిల్వ, పారుదల వ్యవస్థ ఇప్పటి అవసరాలకు అనుగుణంగా ఏర్పరచలేకపోయింది. రైతులు కూడా ఇంతకుముందు కాలంలో మాదిరిగా పంటకు కావలసిన నీటిని అందించే కాలువల ఏర్పాటు వాటి నిర్వహణ మీద శ్రద్ధ పెట్టడం తగ్గించారు. వీటివల్ల అధిక వర్షపాతం అల్ప వర్షపాతం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నీటి నిల్వ, నీటిపారుదల యొక్క అవసరాన్ని గుర్తించలేక పోతే భవిష్యత్తులో వ్యవసాయరంగంలో మరింత దారుణమైన పరిస్థితులు చూడవలసి రావచ్చు.
Also Read : ఈ కొత్త రకం ఆవుల పాలలో ఎక్కువ పోషక విలువలు..
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా రాష్ట్రాల అంగీకారంతో అనుకూలమైన ప్రదేశాలతో బహుళార్థక ప్రాజెక్ట్‌లను కట్టి నీటి నిల్వకు అధిక ప్రాదాన్యతను కల్పించి సరిjైున నీటిపారుదల వ్యవస్థను ఏర్పాటు చేయ గలిగితే ప్రస్తుత పరిస్థితులను కొంతవరకు అధిగమించవచ్చు. ప్రతి సంవత్సరం కూడాను అధిక వర్షపాతం వల్ల నీటి నిల్వ సామర్థ్యం లేక నీరు సముద్రంలో వృధాగా కలిసిపోతుంది. అటువంటి నీటిని ఎక్కడికక్కడ అనుకూలమైన ప్రాంతంలో అధిక సంఖ్యలో చిన్న, పెద్ద డ్యాములతో నిల్వ చేస్తే వ్యవసాయానికి తగినంత నీరు అందించడమే కాకుండా భూమి లోపల భూగర్భ జలాల సామర్థ్యాన్ని పెంచుకునే ఆస్కారం ఉంటుంది. ఆదర్శ రైతులు, రైతు సంఘాలు అలానే కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా తమ తమ గ్రామాలలో వీటి మీద అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ఈ నీటి నిల్వ పారుదల వ్యవస్థ యొక్క ఆవశ్యకతను వివరిస్తే ఇలాంటి విపరీతమైన వాతావరణ పరిస్థితులు ఉన్నప్పుడు రైతాంగానికి కొంతవరకు మేలు జరుగుతుంది. రైతులు కూడా తమ తమ గ్రామాలలో నీటిపారుదల వ్యవస్థను అభివృద్ధి చేసుకొని ప్రతి సంవత్సరం వాటి యాజమాన్యం నిర్వహించగలిగితే నీరు వృధా కాకుండా తగినంత మోతాదులో పంటకు అందించి పంటలను కాపాడుకోవడమే కాకుండా అధిక దిగుబడిని పొందవచ్చు. కాబట్టి రైతులు, రైతు సంఘాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నీటి నిల్వ, పారుదల వ్యవస్థ పై అధిక శ్రద్ధను కనపరిచి ఇలాంటి పరిస్థితులు రాకుండా వ్యవసాయాన్ని లాభదాయకంగా మారుస్తారని ఆశిస్తున్నాము.
Leave Your Comments