మన వ్యవసాయం

Indian Economy: భారతీయ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం పాత్ర 

1
Farming
Farming

Indian Economy: భారత ఆర్థిక వ్యవస్థ కు వ్యవసాయ రంగాన్ని వెన్నెముకగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే నేటికి సుమారు 53 % మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా వ్యవసాయం పైనే ఆధారపడి జీవిస్తున్నారు. మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయమే ప్రధాన జీవనాధారంగా ఇప్పటికీ మనుగడలో ఉంది.

The role of agriculture in the Indian economy

The role of agriculture in the Indian economy

  • అయితే స్వాతంత్ర్యానంతరం వివిధ పారిశ్రామిక తీర్మానాలు,విధానాలు ,నూతన ఆర్థిక సంస్కరణల ప్రభావంతో భారత ఆర్థిక వ్యవస్థ లో ,జాతీయాదాయంలో వ్యవసాయ రంగం వాటా క్షీణిస్తూ వస్తుంది. అదే విధంగా వ్యవసాయరంగంపై ఆధారపడే ప్రజల సంఖ్య కూడా తగ్గుతుంది.
  • వ్యవసాయరంగం లో జరుగుతున్న ఆధునిక అభివృద్ధి పారిశ్రామిక రంగంతో పాటుగా సేవారంగ అభివృద్ధికి కూడా ఎంతగానే దోహదం చేస్తుంది. వ్యవసాయాధార పరిశ్రమలకి ముడిపదార్థాలను ఉత్పాదకాల రూపంలో అందించడం జరుగుతుంది.
  • వ్యవసాయ రంగంలో ప్రచ్ఛన్న నిరుద్యోగిత ప్రభావం వల్ల ఈ రంగానికి చెందినవారు పారిశ్రామిక రంగానికి తరలిపోతున్నారు.
  • ఆధునిక వ్యవసాయ విధానంలో భాగంగా పరికరాల వాడకం పెరగడం తో ఈ రంగం లో మానవ ఉపాధి అవకాశాలు తగ్గుతున్నాయి. అయినప్పటికీ వ్యవసాయ రంగ ప్రాధాన్యతని విస్మరించలేం.
  • బ్రిటిష్ కాలంలో ప్రజలకు వ్యవసాయం ప్రధాన జీవనాధారంగా ఉన్నా, 1966 నుండి హరిత విప్లవం ప్రభావంతో వ్యవసాయ రంగం లో వాణిజ్య పంటల ప్రాధాన్యం పెరిగింది.

Also Read: సహజ వ్యవసాయంలో మహిళా రైతుల విజయగాథ

భారత ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగ ప్రాధాన్యాన్ని తెలిపే అంశాలు:

  • ఆర్థికాభివృద్ధికి జాతీయాదాయం లో వ్యవసాయరంగం వాటాని ఒక సూచికగా చెప్పుకోవచ్చు.అయితే అభివృద్ధి చెందిన దేశాల్లో జాతీయాదాయం లో వ్యవసాయ రంగం వాటా అత్యల్పంగా ఉంటుంది.
  • ఆర్థికాభివృద్ధిలో వ్యవసాయ రంగం వాటా ఒకప్పుడు ఎక్కువగా ఉన్న భారతదేశం లో కూడా ఇపుడు పారిశ్రామిక, సేవా రంగాల అభివృద్ధి వలన అది క్రమేపీ తగ్గుతూ వస్తుంది.
  • వ్యవసాయానుబంధ రంగాల వృద్ధిరేటు 2013-2014 లో 4.2% కాగా, ప్రస్తుత తరుణంలో కొనసాగుతున్న కోవిడ్ సంక్షోభంలో కూడా 2021-2022 లో 3.9 % గా నమోదైంది.
Farming

Farming

ఉద్యోగితలో వ్యవసాయరంగం వాటా:

  • 1951 లో మొత్తం జనాభాలో 69.5% మందికి వ్యవసాయ రంగమే ఉపాధి కల్పించగా, 2021-2022 నాటికి 40.6% గా ఉంది.
  • వ్యవసాయ రంగం అధిక జనాభాకి ఉపాధి కల్పిస్తూ, ప్రైవేటు రంగం లో అతిపెద్ద ఉపాధి కల్పనా రంగముగా అభివృద్ధి చెందుతుంది.

అంతర్జాతీయ వ్యాపారంలో వ్యవసాయ రంగ ప్రాధాన్యం:

  • వ్యవసాయోత్పత్తులైన టీ, పంచదార ,నూనెగింజలు , పొగాకు , సుగంధ ద్రవ్యాల లాంటివి ఎగుమతుల్లో ప్రధాన పాత్ర వహిస్తున్నాయి.
  • 1990-1991 నాటికి మొత్తం ఎగుమతుల్లో వ్యవసాయోత్పత్తుల వాటా 18.5 % గా ఉండగా , ఇది 2021-2022 నాటికి 21.8% గా ఉంది.

వ్యవసాయార్థిక వ్యవస్థపై హరితవిప్లవ ప్రభావము:

  • హరితవిప్లవ ప్రభావం వల్ల వరి, గోధుమ , మొక్కజొన్న ,జొన్న ,వంటి ఆహార పంటల ఉత్పత్తి ఎన్నో రేట్లు పెరిగింది. ఈ విప్లవాన్నీ ఆహారపంటలకే పరిమితం చేసి , మిగతా పంటలని నిర్లక్ష్యం చేసారు. ఈ విప్లవం ద్వారా అధికంగా వృద్ధి చెందిన పంట గోధుమ.
  • ఈ విధంగా వ్యవసాయ రంగాన్ని , ఉత్పత్తుల నిల్వ ,పంపిణీ మొదలగు ప్రక్రియలని నిర్వహించుటకు 1965 లో FCI ( Food Corporation of India) ని ఏర్పాటు చేసారు.
  • వ్యవసాయం, దాని అనుబంధరంగాల అభివృద్ధికి సంబంధించిన రుణ సదుపాయాలు , సహకారం వంటివి అందించడానికి 1963 లో NABARD ని స్థాపించారు. ఇలంటి సంస్థలు కూడా దేశ ఆర్థికవ్యవస్థలో వ్యవసాయ రంగం వాటా ని, ప్రాధాన్యాన్ని పెంచేందుకు దోహదం చేశాయి.

ఆర్థిక ప్రణాళికలో వ్యవసాయ రంగం పాత్ర:

  • వ్యవసాయ ఆర్థికాభివృద్ధిని సాధించడంలో భాగంగా బాంక్ ఋణాల్లో 40 % వరకు వ్యవసాయరంగానికి కేటాయించేలా నిర్ధేశించారు. ఇది ఆర్థికవ్యవస్థలో వ్యవసాయరంగ ప్రాధాన్యతని సూచిస్తుంది.
  • పెరుగుతున్న జనాభాకి తగిన స్థాయిలో ఆహార భద్రతని కల్పించి , పేదరికాన్ని తొలగించడంలో వ్యవసాయరంగ పాత్ర ప్రధానమైంది.
  • పరిశ్రమలకి ముడిపదార్థాలను అందించడమే కాక , పారిశ్రామిక ఉత్పత్తులకి తగిన మార్కెట్ రంగాన్ని కూడా వ్యవసాయం కల్పిస్తుంది.
  • జాతీయదాయంలో వ్యవసాయ రంగ వాటా తగ్గుతున్నప్పటికీ నేటికీ మన దేశంలో గ్రామీణులకి అధిక ఉపాధి కల్పిస్తున్న రంగముగా వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి.

Also Read: బొగ్గుతో వ్యవసాయం దిగుబడులు అధికం

Leave Your Comments

Fertilizer Import: ఎంఓపీ ఎరువు కోసం ఇజ్రాయెల్ తో భారత్ ఒప్పందం

Previous article

Farmer Protest: ఎంఎస్పీ చట్టం కోసం మరోసారి రైతన్నల పోరాటం

Next article

You may also like