Cotton Crop: ప్రపంచంలో ప్రధానమైన వాణిజ్య పంట పత్తి. ప్రపంచంలో పండే నాలుగు రకాల పత్తిపంటలో 90 శాతం పత్తిపంట గాసిపియం హిర్సూటం రకానికి చెందినది. ప్రపంచంలో అత్యధికంగా భారత్ నుండి సుమారు 6.2 మిలియన్ టన్నుల పత్తి ఉత్పత్తి అవుతున్నది .. భారత్ పాటు చైనా, అమెరికాలలో పత్తి ఎక్కువగా సాగవుతున్నది. 6.2 మిలియన్ టన్నుల పత్తి ఉత్పత్తితో ప్రపంచంలో భారత్ అగ్రస్థానంలో ఉన్నది.
భారతదేశంతో పాటు ప్రధానంగా దక్కన్ పీఠభూమి ప్రపంచంలోనే పత్తి సాగుకు అత్యంత అనుకూలం. 6.1 మిలియన్ టన్నుల ఉత్పత్తితో చైనా రెండోస్థానం.. 3.6 మిలియన్ టన్నుల ఉత్పత్తితో అమెరికా మూడో స్థానంలో ఉన్నది. అమెరికాలో టెక్సాస్, అర్జియా, మిసిసిపి, అర్కాన్ సాస్, అలబామా రాష్ట్రాల్లో పత్తి ప్రధానంగా సాగవుతుంది. 2030 నాటికి భారతదేశంలో పత్తి ఉత్పత్తి 7.2 మిలియన్ టన్నులకు చేరుతుందని అంచనా.
Also Read: Leaf spot in turmeric: పసుపు పంటలో ఆకు మచ్చ తెగులు నివారణ చర్యలు
దేశంలో తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్ లలో పత్తి సాగవుతున్నది .. ఉత్పత్తిలో మహారాష్ట్ర మొదటి, రెండో స్థానంలో తెలంగాణ ఉన్నాయి. 2002 నుండి పురుగులను తట్టుకునే బోల్ గార్డ్ రకం హైబ్రీడ్ పత్తి సాగవుతున్నది .. దీంతో పంట ఉత్పాదకత పెరిగింది. బేయర్ విత్తన కంపెనీ ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో పరిశోధన జరిపి ఆ దేశ వాతావరణ, భూ పరిస్థితులకు అనుకూలమైన ఎక్కువ దిగుబడి ఇచ్చే రకాలను అందిస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా ఒకటవ తరం బోల్ గార్డ్ 1, బోల్ గార్డ్ 2 పత్తి రకాలతో పాటు బేయర్ సంస్థ మరింత ముందుకు వెళ్లి మూడో రకం అందించింది .. నాలుగో రకం సిద్దంగా ఉన్నది.
పత్తి సాగులో ఉన్న పెట్టుబడి వ్యయం తగ్గించడం, ఉత్పాదకత పెంచడం, పంటకోతలో సమస్యలు సరళీకరించేందుకు నూతన సాంకేతికతలను అభివృద్ధి చేసి అధిక సాంద్రతతో పత్తి సాగు పద్ధతులను అమలుచేస్తున్న అమెరికాలో అద్యయనం చేయడం జరిగింది. తెలంగాణలో ఈ ఏడాది 20 వేల ఎకరాలలో అధికసాంధ్రత పద్దతిలో పత్తి సాగు .. ఈ పద్దతి మరింత ముందుకు తీసుకెళ్లేందుకుఈ పర్యటన తోడ్పడుతుంది.
దేశానికి, తెలంగాణకు పత్తి, మొక్కజొన్న, కూరగాయల రకాలలో నూతన వంగడాలను అందించిందేందుకు బేయర్ సంస్థ సంసిద్ధతగా ఉన్నది. అమెరికాలో వ్యవసాయ కమతాలు పెద్దవి .. యాంత్రీకరణతో వారు అద్భుతాలు సృష్టిస్తున్నారు. తక్కువ విస్తీర్ణంలో, తక్కువ రోజులలో అధిక ఉత్పత్తి సాధిస్తున్నారు.
అధికసాంద్రత పత్తి సాగులో కలుపు సమస్య ఉండదు. తెలంగాణ ప్రభుత్వం పత్తి సాగు, వ్యవసాయంలో యాంత్రీకరణను ప్రోత్సహిస్తున్నది. అమెరికాలోని సెయింట్ లూయిస్ లో బేయర్ పత్తి విత్తన పంట మరియు జెన్యూ పరిశోధన కేంద్రాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, రవీంద్రనాయక్, పెద్ది సుదర్శన్ రెడ్డి, విత్తనాభివృద్ది సంస్థ ఎండీ కేశవులు తదితరులు సందర్శించారు.
Also Read: Eriophid Mite management in coconut: కొబ్బరిలో ఇరియోఫిడ్ నల్లి ని ఇలా నివారించండి