Livestock farming కోట్లాది మంది ప్రజలు ప్రధానంగా రైతు కుటుంబాలు తమ పోషణ, ఆహార భద్రత మరియు జీవనోపాధి కోసం పశువులపై ఆధారపడుతున్నారు. ముఖ్యంగా గ్రామీణ యువత మరియు మహిళలకు ఉపాధి దొరుకుతుంది. పశువుల పెంపకాన్ని ప్రారంభించాలనుకుంటే పెద్ద ఎత్తున వ్యవసాయం ప్రారంభించాల్సిన అవసరం లేదు. చిన్న తరహా పశువుల పెంపకంతో భారీగా సంపాదించవచ్చు.
Tetanus ఇది క్లాస్ట్రీడియం టని అనే గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా వలన అన్ని పశువులలో కలుగు అతి ప్రాణాంతకమైన వ్యాధి. ఈ వ్యాధిలో తీవ్రమైన ఉద్రేకం, కండరాలు బిగుసుకుపోవడం, పక్షవాతం ముఖ్య లక్షణాలుగా వుంటాయి.
వ్యాధి కారకం :- (1) క్లాస్ట్రీడియం టెటని ఇది ఒక గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా. (2) దీనికి సిద్ధం బీజాలను ఉత్పత్తి చేసే గుణం కలదు. (3) దీని పెరుగుదలకు ఆక్సిజన్ రహిత స్థితి అవసరం. (4) సహజంగా ఈ బ్యాక్టీరియాలు అన్ని పశువుల జీర్ణాశయంలో వుండి పేడ ద్వారా బయటకు వెలువడుతూ ఉంటాయి.(5) ఇవి Exotoxin అనే విషపదార్థాన్ని విడుదల చేస్తాయి.
వ్యాధి బారిన పడే పశువులు :- ఆవులు, గుర్రాలు, గేదెలు, మేకలు మరియు మనుషులు.
వయస్సు:- అన్ని రకాల వయస్సులోను ఈ వ్యాధి వస్తుంది కాని, చిన్న వాటిలో వస్తే మరింత ప్రాణాంతకంగా వుంటుంది.
వ్యాధి వచ్చు మార్గం :- శరీర గాయాల ద్వారా (విత్తులు నొక్కినపుడు, షియరింగ్, డాక్కింగ్ మొదలగు సందర్భాలలో) సిద్ధబీజాలు రక్తంలోనికి ప్రవేశిస్తాయి.
వ్యాధి వ్యాప్తి చెందడం :- శరీర గాయాల ద్వారా సిద్ధబీజాలు శరీరంలోకి చేరి, అక్కడ గాలి రహిత స్థితి ఏర్పడినప్పుడు అవి పెరిగి బ్యాక్టీరియాలుగా మారి టెటనో స్పాస్మిన్, టెటనో లైసిన్, ఫిబ్రినోలైసిన్ (Tetano spasmin, tetanolysin, Fibrinolysin) అను విష పదార్థాలను విడుదల చేస్తాయి. ఈ విష పదార్థాలు రక్తం ద్వారా పెరిఫెరల్ నరాలకు చేరి, వాటి ద్వారా మెదడుకు చేరి న్యూరో ట్రాన్స్మీటర్ ఉత్పత్తిని అడ్డుకుంటుంది. ఫలితంగా కండరాలు కొట్టుకోవడం, బిగుసుకుపోవడం, పక్షవాతం, ఊపిరితిత్తుల కండరాలు బిగుసుకుపోవడం వంటి లక్షణాలతో పశువుకు ఊపిరి ఆడక చనిపోతుంది.