మన వ్యవసాయం

తెలుగు రాష్ట్రాలలో పెసర ప్రధానమైన పంట

0
green bean

మన తెలుగు రాష్ట్రాలలో పెసర ప్రధానమైన పంట. ఈ పెసర లేదా మినుము పంటను ముఖ్యంగా ఖరీఫ్ మరియు రబీ కాలంలో సాగు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ పెసర పంటను మన రాష్ట్రములో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో వరికి ప్రత్యామ్నాయంగా సాగుచేయడం జరుగుతుంది. మనము ఈ పంట పప్పు దినుసులు వైపు గనుక పండించినట్లితే గనుక రైతులు అధిక దిగుబడులు లాభాలు ఆర్జించవచ్చు. అయితే ఈ ప్రధానమైన పంటలలో ముఖ్యంగా రకరకాలైన తెగుళ్ళు ఆశించి నష్టపరుస్తుంటాయి. ముఖ్యంగా మనం ఈ రబీలో వరికి ప్రత్యామ్నాయంగా వేస్తున్నాం కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో వరికి ప్రత్యామ్నాయంగా తెలంగాణ ప్రభుత్వం మద్దతుగా ఉంటుంది కాబట్టి దీని మీద మనం ఎక్కువ శ్రద్ద తీసుకోని సాగు చేసుకొని దీనిలో ఉన్న ఏ ఏ శిలీంద్రాలు నాశినులు మరియు తెగుళ్ళు ఎప్పుడెప్పుడు పంటను ఆశిస్తాయో గమనించి వాటి నివారణకు మనం ఆచరణ పద్దతులు తెలుసుకొని కనుక మెలుకువలు పాటించినట్లయితే అధిక దిగుబడులు రావడానికి అవకాశం ఉంది.

 

green beans

green beans

పెసర పంటను ఆశించే తెగుళ్ళు :

  1. సెర్మోస్పోరా ఆకు మచ్చ తెగులు : ఈ తెగులు సెర్మోస్పోరా కెవిసేన్స్ అవే శిలీంద్రము ద్వారా వ్యాపిస్తుంది. ఈ తెగులు సోకిన ఆకులపై గోధుమ రంగు ఏర్పడి తర్వాత పెద్దవై ఆకులు ఎండి రాలిపోతాయి. ఈ శిలీంద్రము వలన దిగుబడి బాగా తగ్గుతుంది మరియు కాయలో గింజలు సరిగా ఎండవు.

  నివారణ : దీని నివారణకు కార్బెండాజిమ్ 1 గ్రా. + 1 లీటరు నీటిలో లేదా మ్యాంకోజెబ్ 2.5 గ్రా / 1      లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.

2. బాక్టీరియా ఆకుమచ్చ తెగులు : ఈ తెగులు జాంతో మోనాస్ అనే బాక్టీరియా ద్వారా వ్యాపిస్తుంది. ఈ తెగులు సోకిన ఆకుల మీద తడితో కూడిన గోధుమ రంగు గరుకు మచ్చలు ఏర్పడతాయి.

  నివారణ : కాపర్ ఆక్సీ క్లోరైడ్ 10 గ్రా + 10 గ్రా స్ట్రెప్టో మైసిన్ 10 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి.

పల్లాకు తెగులు : పెసరలో డబ్ల్యు.జి.జి 37 , డబ్ల్యు జి జి 42 , యం.జి.జి 351 రకాలు ఈ తెగులును కొంతవరకు తట్టుకోగలవు మినుములో పల్లాకు తెగులును తట్టుకునే ఎల్ .జి.జి 752 ఎల్.బి.జి – 787 పియు 31 రకాలను సాగు చేయాలి. తెగులు సోకిన మొక్కలను గమనించి పీకి కాల్చివేయాలి.

Also Read : పుట్ట గొడుగులు – పోషకాల గనులు

Leave Your Comments

ఆరోగ్యానికి ఆకుకూరలు

Previous article

పీజేటిఎస్ఏయూ లో హార్టికల్చర్ కౌన్సిలింగ్

Next article

You may also like