తెలంగాణ సేద్యం

వచ్చే ఐదు రోజులలో(జూన్ 1 నుండి 5 వరకు) వాతావరణం ఎలా ఉండబోతుంది? రైతులు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి?

0
june weather report eruvaaka
Telangana Weather Report : తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి వాతావరణ ఆధారిత వ్యవసాయ సలహాలు
తేది 01.06.2024 (శనివారం) నుండి 05.06.2024 (బుధవారం) వరకు
గ్రామీణ కృషి మౌసమ్ సేవ పథకం (GKMS Project) భారత వాతావరణ శాఖ, న్యూఢిల్లీ వారి సహకారంతో ప్రతి మంగళ, శుక్ర వారాలు వాతావరణ సలహాలను రాజేంద్రనగర్ లోని వ్యవసాయ వాతావరణ విభాగం అందిస్తోంది. ఆ వివరాలు …
గత మూడు రోజుల వాతావరణం :
గడిచిన మూడు రోజుల్లో రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసాయి. పగటి ఉష్ణోగ్రతలు 37 నుండి 44 డిగ్రీల సెల్సియస్ , రాత్రి ఉష్ణోగ్రతలు 25 నుండి 31 డిగ్రీల సెల్సియస్ గా నమోదయ్యాయి.
రాబోవు ఐదు రోజుల వాతావరణ విశ్లేషణ (జూన్ 1 మధ్యాహ్నం 1 గంట ఆధారంగా):
హైదరాబాద్ వాతావరణ కేంద్రం వారు అందించిన సమాచారం ప్రకారం రాబోవు ఐదు రోజులలో రాష్ట్రంలో కొన్ని చోట్ల తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే  సూచనలున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 35 నుండి 47 డిగ్రీల సెల్సియస్, మధ్య , రాత్రి ఉష్ణోగ్రతలు 22 నుండి 33 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు.
హెచ్చరిక:
మొదటి రోజు(జూన్ 1 ): హెచ్చరికలు లేవు
రెండవ రోజు(జూన్ 2 ): రాష్ట్రంలోని నల్గొండ, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్ధిపేట, యదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో  అక్కడక్కడ ఉరుములు మెరుపులు , ఈదురు గాలుల (గాలి వేగం గంటకు 30-40 కి.మీ)తో కూడిన వర్షాలు కురిసే సూచనలున్నాయి.
మూడవ రోజు(జూన్ 3 ) : రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయి. రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, మెదక్, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు మెరుపులు, ఈదురు గాలుల (గాలి వేగం గంటకు 30-40 కి.మీ)తో కూడిన వర్షాలు కురిసే సూచనలున్నాయి.
నాలుగవ రోజు(జూన్ 4 ) : రాష్ట్రంలోని ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి,వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు మెరుపులు , ఈదురు గాలుల (గాలి వేగం గంటకు 30-40 కి.మీ) తో కూడిన వర్షాలు కురిసే సూచనలున్నాయి.
ఐదవ రోజు (జూన్ 5 ): రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జనగాం, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు మెరుపులు , ఈదురు గాలుల (గాలి వేగం గంటకు 30-40 కి.మీ) తో కూడిన వర్షాలు కురిసే సూచనలున్నాయి..
వాతావరణ ఆధారిత వ్యవసాయ సలహాలు
  • ఉరుములు , మెరుపులతో కూడిన వర్ష సూచనలున్నందున రైతులు విద్యుత్ స్థంబాలు,   విద్యుత్ తీగలు , చెరువులు, నీటి కుంటలకు దూరంగా ఉండాలి.
  • రాష్ట్రంలో అక్కడక్కడ వివిధ జిల్లాలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్ష   సూచనలున్నందున రైతులు చెట్ల కింద  నిలబడరాదు. పశువులు, గొర్రెలు, మేకలను  చెట్ల కింద ఉంచరాదు.
  • కోసిన పంటలను ముందు జాగ్రత్తగా సురక్షిత ప్రాంతానికి తరలించాలి. మార్కెట్ కు   తరలించిన దాన్యం తడవకుండా టార్పాలిన్ తో కప్పి ఉంచాలి.
  • వర్షాధారపు పంటలను సరైన సమయంలో విత్తుకోడానికి విత్తనాలు, ఎరువులు, పురుగు  మందులు సేకరించుకోవాలి.
  • మామిడి తోటలో పడిపోయిన కాయలను సేకరించి మంచిగా ఉన్న కాయలను మార్కెట్ కు   తరలించాలి. పగిలి పోయిన కాయలను అలాగే తోటలో వదిలేసినట్లయితే తెగుళ్ళు   ఆశించే అవకాశం ఉంటుంది  కాబట్టి ఆ కాయలను కూడా తోటలో నుంచి  తీసివేయాలి.
  • మట్టి నమూనాలను సేకరించి నేల లోని పోషక విలువల సమాచారం కొరకు మట్టి  నమూనాలను పరిక్ష చేయించుకోవాలి.
  • ఇప్పటి వరకు కురిసిన వర్షాలను ఉపయోగించుకొని రైతులు పచ్చిరొట్ట పైరును (జీలుగ,   జనుము ,పెసర) వేసుకోవాలి.
  • కొత్త పండ్ల తోటలు పెట్టడానికి గుంతలు తవ్వుకోవాలి.
వరి
  • నీరు సమృద్ధిగా ఉన్న ప్రాంతాల్లో రైతులు దీర్ఘకాలిక వరి రకాల (140-145 రోజులు)   నారుమళ్ళు పోసుకోవడానికి ఇది అనువైన సమయం.
  • వరిలో 3 గ్రా. కార్బండాజిమ్ మందును కిలో విత్తనానికి కలిపి విత్తనశుద్ధి చేసుకోవాలి.
  • రైతులు తెలంగాణ సోన (RNR 15048) వరి విత్తనాన్ని జూన్ నెలలో నారుమడి  పోసుకోకూడదు.
కోళ్లు :
  • అక్కడక్కడ నమోదవుతున్న వేడి వాతావరణాన్ని తట్టుకునేందుకు  షెడ్లల్లో ఫ్యాన్లను,    ఫాగర్స్ ను అమర్చి షెడ్లను వరిగడ్డితో కప్పి స్ప్రింక్లర్లను అమర్చాలి.
  • కోళ్ళు ఎక్కువ మోతాదులో తినుటకు అనుగుణంగా మెత్తటిదాణాను పెట్టి తాగుటకు    చల్లని నీటిని అందుబాటులో ఉంచాలి.
పశువులు
  • అక్కడక్కడ నమోదవుతున్న వేడి వాతావరణాన్ని తట్టుకొనుటకు పశువులు, గొర్రెలు , మేకలను నీడలో ఉంచాలి , తగు విధంగా నీరు , మేతను అందించినట్లయితే పశువుల్లో అధిక ఉష్ణోగ్రతల వలన కలిగే ఒత్తిడి తగ్గుతుంది.
  • అధిక ఉష్ణోగ్రతల వలన పాలలో వెన్న శాతం తగ్గకుండా  పాలిచ్చు ఆవులు , గేదెలకు పూత దశలో ఉన్న పశుగ్రాసాలను మేతగా వేయాలి
డా. పి.లీలా రాణి,ప్రధాన శాస్త్రవేత్త (అగ్రానమీ),
వ్యవసాయ వాతావరణ విభాగం, రాజేంద్రనగర్
Leave Your Comments

Coleus Plants: పాషాణ బేది సాగు (కోలియస్ ఫోర్ స్కోలై)

Previous article

జూన్ 8 నుండి 12 వరకు వరకు వాతావరణ ఆధారిత వ్యవసాయ సలహాలు?

Next article

You may also like